For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2025 Qualifier 1: ఆ ఒక్క తప్పిదమే మా ఓటమికి కారణం: శ్రేయస్ అయ్యర్

బ్యాటింగ్‌ వైఫల్యమే తమ ఓటమిని శాసించిందని పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అన్నాడు. పిచ్ కండిషన్స్‌కు తగ్గట్లు ఆడటంలో తమ బ్యాటర్లు విఫలమయ్యారని తెలిపాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో గురివారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 8 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. పూర్తిగా ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ కనీస పోటీ ఇవ్వలేకపోయింది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన శ్రేయస్ అయ్యర్.. తమ ప్రణాళికలను సమర్థవంతంగా అమలు చేయలేకపోయామని చెప్పాడు. ఈ మ్యాచ్ వైఫల్యంపై అధ్యయనం చేయాలని అభిప్రాయపడ్డాడు.

వరుసగా వికెట్లు కోల్పోవడంతో..
'ఇది మర్చిపోలేని రోజు. అయితే మేం మళ్లీ మొదటి నుంచి మా ప్రణాళికలను రచించుకోవాలి. మా బ్యాటింగ్ సమయంలో మేం వరుసగా వికెట్లు కోల్పోయాం. ఈ ఓటమి నేపథ్యంలో చాలా విషయాలను మేం అధ్యయనం చేయాలి. ఇంపాక్ట్ ప్లేయర్ విషయంలో మేం ఎలాంటి తప్పిదం చేయలేదు. నిజం చెప్పాలంటే నా నిర్ణయాలపై నాకు ఎలాంటి సందేహం లేదు. ప్రణాళిక పరంగా మేము ఏది చేసినా.. మైదానం బయట మేం ఏ వ్యూహాలు రచించినా.. అవి సరైనవేనని నేను భావిస్తున్నాను. కేవలం మేం మా వ్యూహాలను మైదానంలో అమలు చేయలేకపోయాం.

We Lost A Lot Of Wickets Shreyas Iyer Reflects After PBKS s Loss to RCB in IPL 2025 Qualifier 1
Photo Credit: screen grab for JioHotstar

తక్కువ స్కోర్‌ను డిఫెండ్ చేయాల్సి వచ్చినందున బౌలర్లను కూడా నిందించలేం. మేం బ్యాటింగ్‌పై ఫోకస్ పెట్టాలి. ముఖ్యంగా ఈ పిచ్‌పై వర్క్ చేయాల్సి ఉంది. మేం ఇక్కడ ఆడిన అన్ని మ్యాచ్‌ల్లో వేరియబుల్ బౌన్స్ కనిపించింది. అయితే వీటిని మేం సాకులుగా చెప్పలేం. ఎందుకంటే మేం ప్రొఫెషనల్ ఆటగాళ్లం. మేం పరిస్థితులకు తగ్గట్లు బ్యాటింగ్ చేయాల్సింది. అయితే మేం యుద్దంలో ఓడిపోలేదు.. ఈ పోరులో మాత్రమే ఓడిపోయాం.'అని శ్రేయస్ అయ్యర్ తెలిపాడు.

పిచ్ కండిషన్స్‌ తగ్గట్లు ఆడకుండా..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 14.1 ఓవర్లలో 101 పరుగులకు ఆలౌటైంది. మార్కస్ స్టోయినీస్(17 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 26) మినహా అంతా విఫలమయ్యారు. ప్రియాన్ష్ ఆర్య(7), ప్రభ్ సిమ్రాన్ సింగ్(18)తో పాటు జోష్ ఇంగ్లీస్(4), శ్రేయస్ అయ్యర్(2), నెహాల్ వధేరా(8) తీవ్రంగా నిరాశపరిచారు. ఆర్‌సీబీ బౌలర్లలో జోష్ హజెల్ వుడ్(3/21), సుయాశ్ శర్మ(3/17) మూడేసి వికెట్లు తీయగా.. యశ్ దయాల్(2/26) రెండు వికెట్లు పడగొట్టాడు. భువనేశ్వర్ కుమార్, రొమారియో షెపెర్డ్‌కు చెరో వికెట్ దక్కింది.

అనంతరం ఆర్‌సీబీ 10 ఓవర్లలోనే 2 వికెట్లకు 106 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. ఫిల్ సాల్ట్(27 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 56 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించగా.. రజత్ పటీదార్(8 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 15 నాటౌట్) విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. పంజాబ్ బౌలర్లలో కైల్ జెమీసన్, ముషీర్ ఖాన్ చెరో వికెట్ తీసారు. ఈ గెలుపుతో ఆర్‌సీబీ ఫైనల్ చేరగా.. క్వాలిఫయర్-2 రూపంలో పంజాబ్ కింగ్స్‌కు మరో అవకాశం ఉంది. పిచ్ కండిషన్స్‌కు తగ్గట్లు ఆడకుండా.. ఫియర్‌లెస్ గేమ్ అంటూ అనవసర షాట్లతో పంజాబ్ కింగ్స్ మూల్యం చెల్లించుకుంది.

Story first published: Thursday, May 29, 2025, 22:48 [IST]
Other articles published on May 29, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+