Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SL: అందరం తల్వార్లు తిప్పుదాం భయ్యా!(వీడియో)

శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో భారత ఆటగాళ్ల మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. శ్రీలంక బ్యాటింగ్ సందర్భంగా.. సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా మైదానంలోకి వచ్చిన సర్ఫరాజ్ ఖాన్.. జడేజాను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు.

'ఇంకా చాలా పెద్ద గేమ్ ఉంది జడ్డూ భాయ్.. ఆ తర్వాత మాట్లాడుకుందాం'అని అన్నాడు. వెంటనే రిషభ్ పంత్.. 'ఆ తర్వాత అందరం తల్వార్లు తిప్పుదాం'అని బదులిచ్చాడు. ఈ వ్యాఖ్యలు స్టంప్ మైక్‌లో రికార్డ్ కాగా.. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

IND vs SL: శుభ్‌మన్ గిల్ కళ్లు చెదిరే క్యాచ్.. పోలా అదిరిపోలా! (వీడియో)

IND vs SL: శుభ్‌మన్ గిల్ కళ్లు చెదిరే క్యాచ్.. పోలా అదిరిపోలా! (వీడియో)

తల్వార్లు తిప్పుదాం..

ఇంకా చాలా మిగిలి ఉందని, ఓపికగా ఆడుదామని జడేజాకు సర్ఫరాజ్ ఖాన్ సూచించగా.. మ్యాచ్ గెలిచి తల్వార్లు తిప్పుదామని రిషభ్ పంత్ బదులిచ్చాడు. సాధారణంగా హాఫ్ సెంచరీ, సెంచరీ చేసినప్పుడు జడేజా తల్వార్ తిప్పుతూ సంబరాలు చేసుకుంటాడన్న విషయం తెలిసిందే. ఆ సెలెబ్రేషన్స్‌ను గుర్తు చేస్తూ అందరం తల్వార్ తిప్పుదామని పేర్కొన్నాడు.

We ll All Wield the Sword Rishabh Pant and Sarfaraz Khan s Conversation Goes Viral During IND vs SL Test

నిప్పులు చెరిగిన భారత బౌలర్లు..

భారత బౌలర్ల ధాటికి శ్రీలంక బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. మహమ్మద్ సిరాజ్, మానవ్ సుతార్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా నిప్పులు చెరగడంతో శ్రీలంక తొలి సెషన్‌లోనే 5 వికెట్లు కోల్పోయింది. సిరాజ్ ధాటికి నిషాన్ మదుషంక(0) డకౌట్ కాగా.. లాహిరు(27), దినేష్ చండిమల్(4)ను మానవ్ సుతార్ పెవిలియన్ చేర్చాడు.

కామిందు మెండీస్‌ను కుల్దీప్ యాదవ్ ఔట్ చేయగా.. కెప్టెన్ ధనంజయ డిసిల్వా(21)ను జడేజా పెవిలియన్ చేర్చాడు. క్రీజులో సోనాల్ దినుషా(38 బ్యాటింగ్), నిరోషన్ డిక్‌వెల్లా(50 బ్యాటింగ్) ఉన్నారు.

IND vs SL: దేవదత్ పడిక్కల్ శతకం.. తొలి రోజు భారత్‌దే ఆధిపత్యం!

Also Read

IND vs SL: దేవదత్ పడిక్కల్ శతకం.. తొలి రోజు భారత్‌దే ఆధిపత్యం!

భారత్ 462 ఆలౌట్..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 462 పరుగులకు ఆలౌటైంది. దేవదత్ పడిక్కల్(230 బంతుల్లో 15 ఫోర్లు, సిక్స్‌తో 167) సెంచరీతో రాణించగా.. కేఎల్ రాహుల్(175 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్‌తో 82) శతకాన్ని చేజార్చుకున్నాడు. ధ్రువ్ జురెల్(68 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 51) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. శ్రీలంక బౌలర్లలో ప్రభాత్ జయసూర్య(4/109) నాలుగు వికెట్లు తీయగా.. కేశర నువాంత(3/175) మూడు వికెట్లు పడగొట్టాడు. అసితా ఫెర్నాండో(2/63) రెండు వికెట్లు తీసాడు.

Story first published: Monday, August 17, 2026, 14:31 [IST]
Other articles published on Aug 17, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+