For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'పరుగుల ఛేజింగ్‌లో ధోని-కోహ్లీ జోడికి సాటి లేదు'

By Nageshwara Rao

మొహాలి: ఆదివారం మొహాలిలో జరిగిన మూడో వన్డేలో కెప్టెన్ ధోని, విరాట్ కోహ్లీ కీలక ఇన్నింగ్స్‌పై న్యూజిలాండ్ ఆల్ రౌండర్ జేమ్స్ నీషమ్ ప్రశంసలు కురిపించాడు. వారిద్దరి భాగస్వామ్యాన్ని 'అద్భుతమైన ఛేజర్స్' గా అభివర్ణించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి286 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ధోని సేన 48.2 ఓవర్లలో 3 వికెట్లను కోల్పోయి 289 పరుగులు చేసింది. దీంతో కివీస్‌పై 7 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. లక్ష్య చేధనలో భాగంగా ధోనీ, కోహ్లీలు 151 పరుగుల చక్కటి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

ఈ క్రమంలో ధోనీ 80 పరుగుల వద్ద ఔటవ్వగా, కోహ్లీ 154 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ విజయంతో ఐదు వన్డేల సిరీస్‌లో భారత్ 2-1 తేడాతో ముందజంలో ఉంది. మ్యాచ్ అనంతరం నీషమ్ మీడియాతో మాట్లాడాడు.

ధోని, కోహ్లీలు అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పి తమ నుంచి లాగేసుకున్నారని తెలిపాడు. భారత్ మూడో వికెట్ కోల్పోయిన వెంటనే క్రీజులోకి వచ్చిన ధోని తమ బౌలర్లపై ఆధిపత్యం చెలాయించడంతో మ్యాచ్‌పై పట్టు కోల్పోయామని పేర్కొన్నాడు.

Neesham

కోహ్లీకి తోడుగా ధోని కూడా చెలరేగి ఆడటంతో వారిద్దరి భాగస్వామ్యాన్ని విడగొట్టేందుకు తమ వంతు ప్రయత్నాలు చేశామని తెలిపాడు. తాము ఎంత గొప్పగా బౌలింగ్ వేసినా కోహ్లి, ధోనిల ముందు తమ వ్యూహాలు పని చేయలేదని పేర్కొన్నాడు. మూడో వన్డేలో తాము బౌలింగ్ సరిగా వేయకపోవడంతోనే ఓటమి చెందామనడం ఎంతమాత్రం సరైనది కాదని అన్నాడు.

'మేము ఈ మ్యాచ్‌లో చాలా బాగా బౌలింగ్ వేశాం. అయినప్పటికీ ధోని-కోహ్లిల జోడి అద్భుతమైన ఆట తీరును కనబరించింది. ప్రత్యేకంగా ధోని ఆరంభం నుంచి షాట్లతో చెలరేగాడు. తదుపరి మ్యాచ్‌ల్లో ధోని కోసం తగిన అస్త్రాలు సిద్ధం చేసుకోవాలి' అని నీషమ్ పేర్కొన్నాడు.

అంతేకాదు ఆరంభంలో పటిష్ట స్థితిలో ఉన్నప్పటికీ, ఆ తర్వాత వరుసగా వికెట్లను చేజార్చుకోవడం వల్ల సాధ్యమైనన్ని పరుగులు చేయలేకపోయామని తెలిపాడు. తమ ఆటగాళ్లు 50 పరుగుల వరకు క్రీజులో ఉంటే మరిన్ని పరుగులు వచ్చేవని పేర్కొన్నాడు.

3వ వన్డే: 26వ సెంచరీ చేసిన కోహ్లీ, కివీస్‌పై భారత్ ఘన విజయంఅలా కాకుండా ఆలౌట్ కావడంతో అనుకున్న పరుగుల్ని సాధించలేకపోయాని తెలిపాడు. కాగా మొహాలిలో జరిగిన మూడో వన్డేలో జేమ్స్ నీషమ్-హెన్రీల జోడి సరికొత్త భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. మూడో వన్డేలో తొమ్మిది వికెట్‌కు 84 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించ‌ారు.

దీంతో తొమ్మిదో వికెట్‌కు అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసిన న్యూజిలాండ్ జోడిగా అవతరించింది. ఈ భాగస్వామ్యంతో 2009లో భారత్‌పై 9వ వికెట్‌కు కివీస్ జోడి మిల్స్-సౌథీలు నమోదు చేసిన 83 పరుగుల భాగస్వామ్యాన్ని అధిగమించి రికార్డు నమోదు చేశారు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+