Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మేం ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదు.. అతిగా ఆలోచించడం మానేసి మ్యాచ్ ఆడండి: అక్షర్‌

We are playing on the same wicket: Axar Patel slams critics of Chepauk pitch

చెన్నై: విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు పచ్చికతో కూడిన పిచ్‌లపై టీమిండియా ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదని ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ స్పష్టం చేశాడు. స్పిన్‌ అనుకూల పిచ్‌లను విమర్శించేవారు తమ వైఖరి మార్చుకోవాలని సూచించాడు. చిన్న గాయంతో తొలి టెస్ట్ మ్యాచ్‌ ఆడొద్దని అనుకున్నానని అక్షర్‌ తెలిపాడు. చెన్నై చెపాక్ పిచ్‌పై వస్తున్న విమర్శలు నేపథ్యంలో ఇప్పటికే టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కూడా ఫైర్ అయ్యారు. తొలి రోజు నుంచే స్పిన్‌కు స‌హ‌క‌రిస్తున్న చెపాక్ పిచ్‌పై కెవిన్ పీట‌ర్స‌న్‌, మైకేల్ వాన్‌ లాంటి ఇంగ్లండ్ మాజీలు విమ‌ర్శలు చేసిన విషయం తెగెలిసిందే.

మేం ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదు

మేం ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదు

'మీరు (విమ‌ర్శకులు) పిచ్‌ గురించి మాట్లాడినట్టైతే ఒక్క బంతి సైతం బ్యాట్స్‌మన్‌ హెల్మెట్‌కు తాకలేదు. చెపాక్ పిచ్‌పై టర్న్‌ ఎప్పటిలానే సాధారణంగానే ఉంది. మేమూ అదే పిచ్‌పై ఆడుతూ పరుగులు చేశాం. దాంతో ఎవరికీ సమస్య ఉంటుందనుకోం. ఇంకా చెప్పాలంటే.. విదేశాల్లో మేం పర్యటిస్తున్నప్పుడు సీమింగ్‌ పిచ్‌లపై ఎక్కువ పచ్చిక ఉన్నప్పుడు అస్సలు ఫిర్యాదు చేయలేదు. అందుకే వికెట్‌పై అతిగా ఆలోచించడం మానేసి.. వైఖరి మార్చుకుంటే బాగుంటుంది' అని ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌‌ అన్నాడు.

టర్న్‌ను ఉపయోగించుకోవాలంటే

టర్న్‌ను ఉపయోగించుకోవాలంటే

పిచ్‌పై టర్న్‌ను ఉపయోగించుకోవాలంటే.. బంతిని బలంగా పిచ్‌ అయ్యేలా చూడాలని అక్షర్‌ పటేల్ సూచించాడు. 'చెపాక్ పిచ్‌‌ స్పిన్నర్లకు సాయపడుతోంది. అదనంగా చేయాల్సిందేమీ లేదు. బంతిని బలంగా విసిరితే బాగా స్పిన్‌ అవుతోంది. మెల్లగా విసిరితే మాత్రం నెమ్మది బౌలర్లకు కాస్త కష్టం. బలంగా, వేగంగా బంతిని వేస్తే బ్యాట్స్‌మెన్‌ ఇబ్బంది పడతారు. నెమ్మదిగా వేస్తే బ్యాట్స్‌మెన్‌ బ్యాక్‌ఫుట్‌ తీసుకొని ఆడతాడు' అని అక్షర్‌ పటేల్‌ తెలిపాడు. 'మేం ఆడుతున్నప్పుడు బయటవాళ్ల గురించి పట్టించుకొని సందేశం ఇవ్వాలని అనుకోం. మేం సాధారణ క్రికెట్‌ ఆడాం. నాలుగో రోజైతే డిక్లేర్‌ చేయడం గురించి ఆలోచించేవాళ్లం. మూడో రోజే కావడంతో బ్యాటింగ్‌ కొనసాగించాలని అనుకున్నాం' అని చెప్పాడు.

తొలి మ్యాచ్‌ ఆడొద్దనుకున్నా

తొలి మ్యాచ్‌ ఆడొద్దనుకున్నా

'రవిచంద్రన్ అశ్విన్‌తో కలిసి నేను చాలా క్రికెట్‌ ఆడాను. ఎన్నో ఏళ్లుగా అతడి నుంచి నేర్చుకుంటున్నాను. ముఖ్యంగా మనస్తత్వం గురించి నేర్చుకుంటాను. ఏ బ్యాట్స్‌మెన్‌కు ఎలా వేయాలో చర్చించుకుంటాం. అది ఎంతో మేలు చేస్తోంది. ఇక చిన్న గాయంతో తొలి మ్యాచ్‌ ఆడొద్దని అనుకున్నా. ఎందుకంటే ఆట మధ్యలో గాయం తీవ్రమైతే జట్టుకు తీరని నష్టం కలుగుతుంది. అందుకే ఫిజియోతో ఆలోచించే తొలి టెస్టు ఆడొద్దని నిర్ణయించుకున్నా' అని అక్షర్‌ పటేల్‌ చెప్పుకొచ్చాడు.

సీమింగ్ పిచ్ సంగ‌తి ఏంటి

సీమింగ్ పిచ్ సంగ‌తి ఏంటి

చెపాక్ పిచ్‌పై కెవిన్ పీట‌ర్స‌న్‌, మైకేల్ వాన్‌ చేసిన వ్యాఖ్యలపై సునీల్ గవాస్కర్ ఫైర్ అయ్యారు. 'ఇదే పిచ్‌పై రోహిత్ శర్మ ఎలా 150కిపైగా ప‌రుగులు చేశాడు. పిచ్ బాలేకపోతే 330 పరుగులు చేయడం అసాధ్యం. ఇలాంటి విమ‌ర్శ‌లు స‌రికావు. తొలి రోజు నుంచే బంతి ట‌ర్న్ అవ‌డంపై అందరూ విమ‌ర్శ‌లు చేస్తున్నారు. మ‌రి ఇంగ్లండ్‌లో సీమింగ్ పిచ్ సంగ‌తి ఏంటి?. రోజంతా అక్క‌డ ప‌రిస్థితి ఇలాగే ఉంటుంది. దాని గురించి ఎవ‌రూ మాట్లాడ‌రు. ఎప్పుడూ ఇండియ‌న్ పిచ్‌ల గురించే మాట్లాడ‌తారు. బాల్ ట‌ర్న్ అయితే వాళ్ల‌కు స‌మ‌స్య మొద‌లువుతుంది' అని సన్నీ అన్నారు.

Australian Open 2021: బార్టీ జోరు.. స్వితోలినాకు షాక్‌! క్వార్టర్స్‌లో రఫా!

Story first published: Tuesday, February 16, 2021, 8:10 [IST]
Other articles published on Feb 16, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+