For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Australian Open 2021: బార్టీ జోరు.. స్వితోలినాకు షాక్‌! క్వార్టర్స్‌లో రఫా!

Australian Open 2021: Ashleigh Barty, Rafael Nadal and Daniil Medvedev enters quarter finals

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో ప్రపంచ నంబర్‌వన్‌‌ అష్లె బార్టీ (ఆస్ట్రేలియా) జోరు కొనసాగతోంది. సోమవారం మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో బార్టీ 6-3, 6-4తో అన్‌సీడెడ్‌ రోజర్స్‌ (అమెరికా)ను చిత్తుగా ఓడించింది. తొలి సెట్లో నాలుగో గేమ్‌లోనే సర్వీస్‌ బ్రేక్‌ చేసి ఆపై సెట్‌ గెలిచిన బార్టీ.. రెండో సెట్లోనూ అదే జోరు ప్రదర్శించింది. డ్రాప్‌ షాట్లతో పాయింట్లు సాధిస్తూ మూడో గేమ్‌లో బ్రేక్‌ సాధించింది. ఆపై అదే ఊపులో 6-4తో సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలుచుకుని క్వార్టర్‌ఫైనల్లో ప్రవేశించింది.

ముచోవా (చెక్‌ రిపబ్లిక్‌), బ్రాడీ (అమెరికా) ముందంజ వేశారు. ముచోవా 7-6 (7-5), 7-5తో మెర్టిన్స్‌ (బెల్జియం)పై గెలవగా.. బ్రాడీ 6-1, 7-5తో వికిచ్‌ (క్రొయేషియా)ను ఓడించింది. ఇక ఉక్రెయిన్‌ స్టార్‌ ఎలీనా స్వితోలినాకు షాక్‌ తగిలింది. అన్‌సీడెడ్‌ జెస్సికా (అమెరికా) 6-4, 3-6, 6-3తో స్వితోలినాను ఓడించింది. టాప్‌-10 క్రీడాకారిణిని ఓడించడం జెస్సికాకు ఇదే తొలిసారి. తొలి రౌండ్లో విక్టోరియా అజరెంకను కూడా ఆమె ఓడించింది. చైనీస్‌ తైపీ వెటరన్‌ క్రీడాకారిణి సువీయ్‌ సంచలనాలు కొనసాగుతున్నాయి.‌ 6-4, 6-2తో 19వ సీడ్‌ వోండ్రుసోవా (చెక్‌ రిపబ్లిక్‌)కు సువీయ్‌ షాక్‌ ఇచ్చింది.

అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల వీరుడిగా చరిత్ర సృష్టించాలని పట్టుదలగా ఉన్న స్పెయిన్‌ బుల్ రఫేల్‌ నాదల్‌ ఆ దిశగా మరో అడుగు వేశాడు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో సునాయాస విజయం సాధించాడు. సోమవారం జరిగిన మ్యాచ్‌లో రెండో ర్యాంకర్‌ నాదల్‌ 6-3, 6-4, 6-2 తేడాతో ఫాబియో ఫొగిని (ఇటలీ)పై వరుస సెట్లలో గెలిచాడు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ క్వార్టర్స్‌ చేరడం రఫాకు ఇది 13వసారి కాగా.. గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో 43వది. గాయం కారణంగా మొటియో బెరెటినీ (ఇటలీ) పోటీ నుంచి తప్పుకోవడంతో నేరుగా క్వార్టర్స్‌ చేరిన‌ స్టెఫనోస్‌ సిట్సిపాస్‌తో నాదల్‌ తదుపరి పోరులో తలపడనున్నాడు.

డానియల్‌ మెద్వెదెవ్‌ (రష్యా), సిట్సిపాస్‌ (గ్రీస్‌) కూడా క్వార్టర్‌ఫైనల్‌కు దూసుకెళ్లారు. ప్రిక్వార్టర్స్‌లో మెద్వెదెవ్‌ 6-4, 6-2, 6-3తో మెక్‌డొనాల్డ్‌ (అమెరికా) పై విజయాన్ని అందుకున్నాడు. తొలి సెట్లో తప్ప మెద్వెదెవ్‌ దూకుడు ముందు మెక్‌డొనాల్డ్‌ నిలువలేకపోయాడు. ఈఅయిదో సీడ్‌ సిట్సిపాస్‌ బరిలో దిగకుండానే క్వార్టర్స్‌ చేరాడు. ప్రిక్వార్టర్స్‌లో అతని ప్రత్యర్థి బెరెటిని (ఇటలీ) గాయంతో వాకోవర్‌ ఇచ్చాడు. క్వాలిఫయర్‌ అస్లాన్‌ (రష్యా) ప్రిక్వార్టర్స్‌లో 3-6, 1-6, 6-3, 6-3, 6-4తో 20వ సీడ్‌ ఫెలిక్స్‌ అగర్‌ (కెనడా)పై విజయం సాధించాడు. గాయం వల్ల కాస్పెర్‌ రూడ్‌ మ్యాచ్‌ మధ్యలోనే తప్పుకోవడంతో ముందడుగేసిన ఆండీ రుబ్లేవ్‌ (రష్యా)తో క్వార్టర్స్‌లో డానిల్‌ పోటీ పడనున్నాడు.

Story first published: Tuesday, February 16, 2021, 7:31 [IST]
Other articles published on Feb 16, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+