Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WCL 2025 టైటిల్ గెలవడమే మా లక్ష్యం: యువరాజ్ సింగ్

వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్‌(డబ్ల్యూసీఎల్) 2025 టైటిల్ గెలవడమే తమ లక్ష్యమని ఇండియా ఛాంపియన్స్ కెప్టెన్ యువరాజ్ సింగ్ తెలిపాడు. సెమీఫైనల్ చేరడం సంతోషంగా ఉందన్నాడు. వెస్టిండీస్‌తో మంగళవారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన యువరాజ్ సింగ్ సారథ్యంలోని ఇండియా ఛాంపియన్స్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ టోర్నీలో భారత్ సాధించిన ఏకైక విజయం ఇదే కావడం గమనార్హం. ఒకే ఒక్క విజయం సాధించినా మెరుగైన రన్‌రేట్ కారణంగా భారత్ సెమీస్‌కు అర్హత సాధించింది.

ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన యువరాజ్ సింగ్ తమ విజయంపై సంతోషం వ్యక్తం చేశాడు. ఇక టైటిల్ గెలవడమే తమ లక్ష్యమని పేర్కొన్నాడు. 'సెమీఫైనల్ చేరినందుకు సంతోషంగా ఉంది. ఈ టోర్నీలో ముందుకు సాగే అవకాశాలపై మాకు పూర్తి నమ్మకం ఉంది. లక్ష్యం కఠినమైనప్పటికీ.. సెమీఫైనల్స్‌కు వెళ్లడానికి కావాల్సిన ఓవర్లలోపే చేధించాం. ఇప్పుడు మా ఫోకస్ అంతా తదుపరి మ్యాచ్‌లపై పెడుతాం. టైటిల్ సాధించడమే మా లక్ష్యం.'అని యువరాజ్ సింగ్ పేర్కొన్నాడు.

WCL 2025 Yuvraj Singh Says India Champions aim for trophy after dominating win against West Indies Champions

స్టువర్ట్ బిన్నీ విధ్వంసం..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ ఛాంపియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 144 పరుగులు చేసింది. కీరన్ పోలార్డ్(43 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్స్‌లతో 74) ఒక్కడే రాణించగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో పియూష్ చావ్లా (3/18) మూడు వికెట్లు తీయగా.. వరుణ్ ఆరోన్(2/40), స్టువర్ట్ బిన్నీ(2/17) రెండేసి వికెట్లు పడగొట్టారు. పవన్ నేగికి ఓ వికెట్ దక్కింది.

టీమిండియా సెమీస్ చేరాలంటే 14.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ భారత్ 13.2 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసి గెలుపొందింది. స్టువర్ట్ బిన్నీ(21 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 50 నాటౌట్) హఫ్ సెంచరీతో చెలరేగగా.. యువరాజ్ సింగ్(11 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 21), యూసఫ్ పఠాన్(7 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 21 నాటౌట్) మెరుపులు మెరిపించారు. విండీస్ బౌలర్లలో డ్వేన్ స్మిత్(2/27), డ్వేన్ బ్రావో(2/47) రెండేసి వికెట్లు పడగొట్టారు.

పాక్‌తో సెమీఫైనల్..

ఈ టోర్నీ లీగ్ దశలో 5 మ్యాచ్‌లు ఆడిన భారత్ ఒకే ఒక్క విజయం సాధించింది. కానీ మెరుగైన రన్‌రేట్‌తో సెమీస్‌కు అర్హత సాధించింది. ఈ టోర్నీలో మొత్తం 6 జట్లు బరిలోకి దిగగా.. నాలుగేసి విజయాలతో పాకిస్థాన్, సౌతాఫ్రికా ఛాంపియన్స్ జట్లు టాప్‌-2లో నిలిచాయి. రెండు విజయాలతో ఆస్ట్రేలియా ఛాంపియన్స్ మూడో స్థానంలో నిలవగా.. ఇండియా ఛాంపియన్స్ మెరుగైన రన్‌రేట్‌తో నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. ఇంగ్లండ్, వెస్టిండీస్ ఒక్కో విజయం సాధించినా.. తక్కువ రన్ రేట్ కారణంగా టోర్నీ నుంచి నిష్క్రమించాయి.

పాక్‌తో భారత్ ఆడుతుందా..?

టోర్నీ రూల్స్ ప్రకారం అగ్రస్థానంలో నిలిచిన జట్టు.. నాలుగో స్థానంలో నిలిచిన టీమ్‌తో సెమీఫైనల్ ఆడాలి. దాంతో పాక్‌తో భారత్ సెమీస్ ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే లీగ్ దశలో పాకిస్థాన్‌తో ఆడేందుకు ఇండియా ఛాంపియన్స్ నిరాకరించింది. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ ఘటనల నేపథ్యంలో పాకిస్థాన్‌తో ఆడలేమని ఆటగాళ్లు చెప్పారు. దాంతో ఈ మ్యాచ్‌ను నిర్వాహకులు రద్దు చేశారు. సెమీస్‌లో మరోసారి ఈ రెండు జట్లు తలపడాల్సిన పరిస్థితి తలెత్తడంతో ఇప్పుడు ఏం చేస్తారనే ప్రశ్న తలెత్తుతుంది.

ఈ మ్యాచ్‌ గురువారం జరగనుంది. తొలి మ్యాచ్ తరహాలోనే ఈ సెమీస్‌ను భారత్ బాయ్‌కాట్ చేస్తే పాకిస్థాన్ ఫైనల్ చేరనుంది. మరోవైపు శిఖర్ ధావన్ మాత్రం పాకిస్థాన్‌తో ఎట్టి పరిస్థితుల్లో ఆడేది లేదని మీడియాతో అన్నాడు. ఈ పరిస్థితుల్లో నిర్వాహకులు సెమీస్ పోరును మారుస్తారా? లేక పాకిస్థాన్‌‌ను ఫైనల్ చేర్చుతారా? అనే ఉత్కంఠ నెలకొంది. ఈ మ్యాచ్‌‌కు స్పాన్సర్ చేయలేమని ఈజ్ మై ట్రిప్ సంస్థ తప్పుకుంది. యువరాజ్ సింగ్ కూడా పాక్‌తో సెమీఫైనల్ ఆడే విషయంపై ఎలాంటి కామెంట్ చేయలేదు.

Story first published: Wednesday, July 30, 2025, 15:44 [IST]
Other articles published on Jul 30, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+