Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WCL 2025: శిఖర్ ధావన్ విధ్వంసం.. టీమిండియాకు తప్పని పరాజయం!

వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025 టోర్నీలో ఇండియా ఛాంపియన్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ యువరాజ్ సింగ్ సారథ్యంలో ఇండియా ఛాంపియన్స్ జట్టు ఓటమిపాలైంది. శనివారం ఆస్ట్రేలియా ఛాంపియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇండియా ఛాంపియన్స్ 4 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇండియా ఛాంపియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 203 పరుగులు చేసింది. ఓపెనర్ శిఖర్ ధావన్(60 బంతుల్లో 12 ఫోర్లు, సిక్స్‌తో 91), పవర్ హిట్టర్ యూసఫ్ పఠాన్(23 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 52 నాటౌట్) విధ్వంసకర హాఫ్ సెంచరీలతో చెలరేగారు. రాబిన్ ఊతప్ప(21 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 37) పర్వాలేదనిపించగా.. అంబటి రాయుడు(0) డకౌటయ్యాడు. సురేశ్ రైనా(11), యువరాజ్ సింగ్(3) తీవ్రంగా నిరాశపర్చారు. ఆస్ట్రేలియా ఛాంపియన్స్ బౌలర్లలో డాన్ క్రిస్టియన్ (2/34) రెండు వికెట్లు తీయగా.. బ్రెట్ లీ, డీ ఆర్సీ షాట్ చెరో వికెట్ పడగొట్టారు.

WCL 2025 Australia Champions beat India Champions by 4-wickets in Leeds
Photo Credit: X (twitter)

అనంతరం ఆస్ట్రేలియా ఛాంపియన్స్ 19.5 ఓవర్లలో 6 వికెట్లకు 207 పరుగులు చేసి గెలుపొందింది. కాలమ్ ఫెర్గూసన్(38 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 70) విధ్వంసకర హాఫ్ సెంచరీతో ఆసీస్ ఛాంపియన్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతనికి అండగా డాన్ క్రిస్టియన్(39) రాణించాడు. భారత బౌలర్లలో పియూష్ చావ్లా(3/36) మూడు వికెట్లు తీయగా.. హర్భజన్ సింగ్(2/33) రెండు వికెట్లు పడగొట్టాడు. వినయ్ కుమార్‌(1/47) ఒక వికెట్ దక్కింది. ఆఖరి ఓవర్‌లో ఆసీస్ విజయానికి 13 పరుగులు అవసరం కాగా.. వినయ్ కుమార్ డిఫెండ్ చేయలేకపోయాడు.

పాకిస్థాన్‌తో తొలి మ్యాచ్‌ను రద్దు చేసుకున్న భారత్.. ఆ తర్వాత సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా ఛాంపియన్స్ చేతిలో ఓడి పాయింట్స్ టేబుల్‌లో ఆఖరి స్థానంలో నిలిచింది. ఆదివారం ఇంగ్లండ్ ఛాంపియన్స్‌తో ఆడనున్న భారత్.. మంగళవారం వెస్టిండీస్‌తో తలపడనుంది.

Story first published: Saturday, July 26, 2025, 23:45 [IST]
Other articles published on Jul 26, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+