Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టవల్‌తో క్యాచ్ పట్టిన బౌలర్.. పెనాల్టీ విధించిన అంపైర్! (వీడియో)

WBBL: క్రికెట్ చరిత్రలోనే కనీ వినీ ఎరుగని ఘటన చోటు చేసుకుంది. ఫీల్డర్ వేసిన త్రోను టవల్ సాయంతో క్యాచ్ పట్టే ప్రయత్నం చేసిన బౌలర్ భారీ మూల్యం చెల్లించుకుంది. టవల్‌తో బంతిని ఆపినందుకు అంపైర్.. 5 పరుగులు పెనాల్టీగా విధించాడు. దాంతో బ్యాటింగ్‌ జట్టుకు అప్పనంగా 5 పరుగులు వచ్చాయి.

ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోపై ఫ్యాన్స్ ఫన్నీ కామెంట్ చేస్తున్నారు. క్రికెట్‌లో ఈ రూల్ ఉందని ఈ రోజే తెలిసిందని, హెల్మెట్‌కు తాకినప్పుడు పెనాల్టీ విధించడం చూశామని అభిప్రాయపడుతున్నారు.

WBBL: Sydney Sixers Women Awarded Five Penalty Runs After Catching a ball with a towel

ఈ లీగ్‌లో భాగంగా మంగళవారం బ్రిస్బేన్ హీట్ వుమెన్ వర్సెస్ సిడ్నీ సిక్సర్స్ వుమెన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. సిడ్నీ సిక్సర్స్ బ్యాటింగ్ సందర్భంగా.. అమెలియా కేర్ ఈ తప్పిదం చేసింది. ఆమె వేసిన 10వ ఓవర్‌ తొలి బంతిని గార్డ్‌నర్ లాంగాన్ దిశగా ఆడింది. అక్కడే ఉన్న ఫీల్డర్ బంతిని అందుకొని అమెలియా కేర్‌కు ఇవ్వగా.. ఆమె టవల్ సాయంతో అందుకునే ప్రయత్నం చేసింది. వెంటనే అంపైర్ ఆమె తప్పిదాన్ని తెలియజేస్తూ ఐదు పరుగులు పెనాల్టీగా విధించాడు.

దాంతో అమెలియా కేర్‌తో బ్రిస్బేన్ హీట్ టీమ్ షాక్‌కు గురైంది. ఉద్దేశపూర్వకంగా చేయకున్నా.. నిబంధనలు అతిక్రమించడంతో అంపైర్ చర్యలు తీసుకున్నాడు. మైదానంలో బంతిని ఆటగాళ్లకు సంబంధించిన వస్తువులతో అడ్డుకున్నా.. వాటి వల్ల బంతి ఆగిపోయినా పెనాల్టీ విధిస్తారు. వికెట్ కీపర్లు వాడే హెల్మెట్.. కిందపెట్టినప్పుడు బంతి తాకినా 5 పరుగులు పెనాల్టీగా విధిస్తారు.

అమెలియా కేర్.. బంతిని తుడిచేందుకు టవల్‌ ఉపయోగించింది. అదే క్రమంలో టవల్ చేతుల్లో ఉండగానే బంతిని అందుకుంది. ఈ తప్పిదం బ్రిస్బేన్ హీట్ టీమ్ ఓటమిని శాసించింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన బ్రిస్బేన్ హీట్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 176 పరుగులు చేసింది. అమెలియా కేర్(44 బంతుల్లో 10 ఫోర్లతో 64) హాఫ్ సెంచరీతో సత్తా చాటింది.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన సిడ్నీ సిక్సర్స్ 19.5 ఓవర్లలో 4 వికెట్లకు 177 పరుగులు చేసి 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. పెనాల్టీ రూపంలో వచ్చిన 5 పరుగులు ఆ జట్టు విజయాన్ని సునాయసం చేశాయి. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో ఈ ఐదు పరుగులు రాకుంటే సిడ్నీ సిక్సర్స్ ఓటమిపాలయ్యేది.

Story first published: Tuesday, November 21, 2023, 19:34 [IST]
Other articles published on Nov 21, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+