జహీర్ వన్ హ్యాండెడ్ క్యాచ్.. సూపరో సూపర్.!

ముంబై: వయసు మీదపడుతున్నా.. అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమై చాలా రోజులవుతున్నా.. లెజండరీ బౌలర్ జహీర్ ఖాన్ ఆటలో మాత్రం పదును తగ్గలేదు. రోడ్డు భద్రతపై అవగాహన పెంచేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వరల్డ్ రోడ్ సేఫ్టీ సిరీస్‌లో భాగంగా శనివారం వెస్టిండీస్ లెజెండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇండియా లెజెండ్స్ తరఫున బరిలోకి దిగిన జహీర్.. సూపర్ పెర్ఫామెన్స్‌తో అదరగొట్టాడు. బౌలింగ్‌లో రెండు వికెట్లు తీసిన ఈ లెజండీరీ బౌలర్.. మైమరిపించే ఫీల్డింగ్‌తో ఔరా అనిపించాడు. ఒంటి చేత్తో అతను అందుకున్న ఓ క్యాచ్ యావత్ క్రికెట్ ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యానికి గురిచేస్తోంది. యువతరానికి సవాల్ విసురుతోంది.

సింగిల్ హ్యాండ్ జహీర్..
వెస్టిండీస్ లెజెండ్స్ ఇన్నింగ్స్ సందర్భంగా మునాఫ్ పటేల్ వేసిన 17వ ఓవర్‌లో రిచర్డో పోవెల్ లెగ్ సైడ్ భారీ షాట్ ఆడాడు. కానీ బంతి డీప్ స్క్వేర్ లెగ్ దిశగా దూసుకు రాగా.. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న జహీర్.. అంతే వేగంతో గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో బంతిని అందుకున్నాడు. జహీర్ ముందుకు రావడంతో బంతి దాదాపు బౌండరనీ అందరూ అనుకున్నారు. కానీ జహీర్ తన సూపర్ ఫీల్డింగ్‌తో క్యాచ్ అందుకోవడంతో బ్యాట్స్‌మన్ పొవెల్‌తో సహా మైదానంలో ఆటగాళ్లు, అభిమానులు సంభ్రమాశ్చర్యానికి గురయ్యారు. ఈ క్యాచ్‌కు ముగ్ధులైన సహచర ఆటగాళ్లు, అభిమానులు జహీర్.. జహీర్ అని అరుస్తూ అభినందించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

సూపర్ బౌలింగ్..
ఇక నాలుగు ఓవర్లు వేసిన జహీర్ 30 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. డారెన్ గంగా, రిడ్లీ జకోబ్స్‌ను ఔట్ చేశాడు. జకోబ్స్‌ను అద్భుత యార్కర్‌తో పెవిలియన్ చేర్చాడు. డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (57 బంతుల్లో 11 ఫోర్లతో 74 నాటౌట్) మెరుపు హాఫ్ సెంచరీకి తోడు కెప్టెన్ సచిన్ టెండూల్కర్ (36) రాణించడంతో ఇండియా లెజెండ్స్ సునాయస విజయాన్నందుకుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ లెజెండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 150 రన్స్ చేసింది. చందర్‌పాల్ (61), డారెన్ గంగా (32) సత్తాచాటారు. భారత బౌలర్లలో జహీర్ ఖాన్, మునాఫ్ పటేల్, ప్రజ్ఞాన్ ఓజా రెండేసి వికెట్లు తీశారు.

సెహ్వాగ్ ధనాధన్ బ్యాటింగ్..
అనంతరం సెహ్వాగ్ ధనాధన్ బ్యాటింగ్‌తో ఇండియా 18.2 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్నందుకొని 10 బంతులు మిగిలుండగానే గెలుపొందింది. అద్భుత హాఫ్ సెంచరీ విజయంలో కీలక పాత్ర పోషించిన సెహ్వాగ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వరించింది. ఇక రోడ్డు భద్రతా అవగాహన కోసం నిర్వహిస్తున్న ఈ సిరీస్‌లో శ్రీలంక, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా లెజెండ్స్ జట్లు కూడా పోటీపడుతున్నాయి. నేడు(ఆదివారం) శ్రీలంక లెజెండ్స్-ఆస్ట్రేలియా లెజెండ్స్ మధ్య ముంబై వేదికగా మ్యాచ్ జరగనుంది. మార్చి 10న శ్రీలంక లెజెండ్స్‌తో భారత లెజెండ్స్ మరో మ్యాచ్ ఆడనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications