రాబిన్సన్ vs కోహ్లీ..
ముందుగా బ్యాటింగ్‌కు వచ్చిన రాబిన్సన్‌ను కోహ్లీ తనదైన వ్యాఖ్యలతో కవ్వించాడు. భారత కెప్టెన్ వ్యాఖ్యలు స్టంప్‌మైక్‌లో స్పష్టంగా వినిపించాయి. 'వీడు(రాబిన్సన్) నేను కవర్ డ్రైవ్ మిస్సయినప్పుడు నన్ను చూసి నవ్వుకున్నాడు. ఇప్పుడు వీడు ఎలా బ్యాటింగ్ చేస్తాడో.. స్వంత గడ్డపై జట్టును ఎలా రక్షిస్తాడో చూస్తా. టెస్ట్ మ్యాచ్‌లో వికెట్ కాపాడుకోవడం ఎంత ముఖ్యమో వీనికి ఇప్పుడు తెలుసోస్తుంది.
వెలకమ్ రా ఒర్రుబోతు.. పుజారా నీ ఇన్నింగ్స్ ఎంత బోరింగ్‌గా ఉంది? బహుషా ఆ జిడ్డు బ్యాటింగ్‌తో టెస్ట్‌ల్లో నువ్వు ఔటవ్వకుండా ఉంటావనుకుంటా.. రారా ఒర్రుబోతు.. ఈ రోజు నీ సత్తా ఏంటో చూపించు?'అని కోహ్లీ .. రాబిన్సన్‌కు స్లెడ్జింగ్ రుచి చూపించాడు.

బుమ్రాను ఇలానే కవ్వించి..
ఇక రాబిన్సన్.. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ సందర్భంగా ఇలానే భారత ఆటగాళ్లను కవ్వించాడు. ముఖ్యంగా జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ బ్యాటింగ్ టైమ్‌లో మాటల తుటాలతో భారత బ్యాట్స్‌మెన్‌ను రెచ్చగొట్టాడు. రాకాసి బౌన్సర్లతో గాయపరిచే ప్రయత్నం చేశాడు. విరాట్ కోహ్లీ బ్యాటింగ్ సమయంలోనూ తన అత్యుత్సాహాన్ని ప్రదర్శించాడు.
వీటన్నిటిని మనసులో పెట్టుకున్న భారత ఆటగాళ్లు అతని బ్యాటింగ్ సమయంలో బదులు తీర్చుకున్నాడు. సిరాజ్ సైతం బౌన్సర్‌తో దాడి చేసి కళ్లలోకి సీరియస్‌గా చూస్తూ రెచ్చగొట్టాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో కోహ్లీ.. రాబిన్సన్ బౌలింగ్‌లోనే ఔటవ్వడం విశేషం.

ఇది వైట్ బాల్ క్రికెట్ కాదు..
ఆ తర్వాత జోస్ బట్లర్‌ను కూడా కోహ్లీ కవ్వించాడు. క్రీజులో గార్డ్ తీసుకుంటున్న బట్లర్‌ను.. 'ఇది వైట్ బాల్ క్రికెట్ కాదు.. ఆందోళన పడకు'అంటూ కామెంట్ చేశాడు. అంతకుముందు భారత ఇన్నింగ్స్ సందర్భంగా బుమ్రా-బట్లర్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రాబిన్సన్ బౌన్సర్.. బుమ్రా తలకు బలంగా తాకిన తర్వాత అతనేదో కామెంట్ చేయగా.. భారత బౌలర్ ధీటుగా బదులిచ్చాడు.
ఈ క్రమంలో జోక్యం చేసుకున్న బట్లర్‌తో బుమ్రా వాదించాడు. తాను స్లోయర్ బాల్స్ వేయమని మిమ్మల్ని కోరడం లేదన్నాడు. ఈ క్రమంలోనే కోహ్లీ.. బట్లర్‌కు స్లెడ్జింగ్ రుచి చూపించాడు. అయితే ఆరంభంలో అతను ఇచ్చిన సునాయస క్యాచ్‌ను కోహ్లీ నేలపాలు చేశాడు. ఆ తర్వాత మళ్లీ బుమ్రానే ఔట్ చేయడంతో భారత్ విజయం లాంఛనమైంది.

షమీ అందించిన విజయం..
181/6 ఓవర్ నైట్ స్కోర్‌తో చివరి రోజు ఆటను కొనసాగించిన భారత్.. రెండో ఇన్నింగ్స్‌లో 298/8 వద్ద డిక్లేర్ చేసింది. మహమ్మద్ షమీ(70 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 56 నాటౌట్), జస్‌ప్రీత్ బుమ్రా(53 బంతుల్లో 2 ఫోర్లతో 36 నాటౌట్) 9వ వికెట్‌కు అజేయంగా 89 పరుగులు జోడించారు. దాంతో భారత్‌కు 271 పరుగుల ఆధిక్యం లభించింది.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఇంగ్లండ్ 51.5 ఓవర్లలో 120 పరుగులకు ఆలౌటైంది. జోస్ బట్లర్(96 బంతుల్లో 25), జోరూట్(60 బంతుల్లో 33) పోరాడినా ఫలితం లేకపోయింది. భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్(4/32) నాలుగు వికెట్లతో చెలరేగగా.. జస్‌ప్రీత్ బుమ్రా(3/33) మూడు, ఇషాంత్ శర్మ(2/13) రెండు వికెట్లు తీశారు. మహమ్మద్ షమీ(1/13) ఒక వికెట్ దక్కింది. ఈ విజయంతో ఐదు టెస్ట్ సిరీస్‌లో భారత్ 1-0తో బోణీ కొట్టింది. ఇరు జట్ల మధ్య మూడో టెస్ట్ ఆగస్టు 25న(బుధవారం) లీడ్స్ వేదికగా ప్రారంభమవుతోంది.


Click it and Unblock the Notifications
