Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Virat Kohli లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్.. కళ్లు చెదిరే కవర్ డ్రైవ్! వీడియో వైరల్!

Watch: Virat Kohli Left Hand Batting Video Which Goes Viral On Internet

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కోహ్లీ బ్యాటింగ్‌కు సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింటిని షేక్ చేస్తోంది. అభిమానులను వీపరీతంగా ఆకట్టుకుంటున్న వీడియోలో ఏం ఉందంటే.. కోహ్లీ బ్యాటింగ్. ఇప్పుడంటే ఫామ్ లేక ఇబ్బంది పడుతున్న కోహ్లీ.. ఒకప్పుడు పరుగుల మోత మోగించిన విషయం తెలిసిందే. కళాత్మక కవర్ డ్రైవ్స్.. కళ్లు చెదిరే ఫ్లిక్ షాట్స్‌తో బౌలర్లకు చుక్కలు చూపించాడు. సెంచరీల మోతతో రికార్డుల రారాజుగా అందరి మన్ననలు అందుకున్నాడు.

కోహ్లీ బ్యాటింగ్ చూసేందుకు ఏ అభిమాని అయినా ఇష్టపడుతాడు. ఈ క్రమంలోనే కోహ్లీ వీరాభిమాని అయిన ఓ ట్విటర్ యూజర్ అతని బ్యాటింగ్‌కు సంబంధించిన వీడియోను షేర్ చేశాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ తనదైన శైలిలో చెలరేగాడు. నాన్ స్ట్రైకర్‌గా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఉండగా.. కోహ్లీ తనదైన కవర్ డ్రైవ్స్‌తో పరుగుల మోత మోగించాడు.

అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ వీడియోలో కోహ్లీ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ చేశాడు. మాములుగా కోహ్లీ రైట్ హ్యాండర్. మరీ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ ఎప్పుడు చేశాడబ్బా? అని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే సదరు అభిమాని ఈ వీడియోను అద్దంలో రికార్డు చేసి కోహ్లీ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ అంటూ షేర్ చేశాడు. నెటిజన్లను ఆకట్టుకునే ఉద్దేశంతో అతను ఈ పని చేయగా.. విరాట్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. కొందరు అయితే ఇది నిజమైన వీడియోనే అనుకుంటున్నారు.

ఇంగ్లండ్ పర్యటనలో దారుణంగా విఫలమైన కోహ్లీ.. వెస్టిండీస్ పర్యటనకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఫ్యామిలీతో యూరప్ ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తున్న కోహ్లీ..జింబాబ్వే పర్యటనకు వెళ్లే అవకాశం ఉంది. మళ్లీ ఫామ్ అందుకోవడానికి విరాట్‌కు ఇదే సరైన సిరీస్ అని సెలెక్టర్లు భావిస్తున్నారు.

Story first published: Friday, July 22, 2022, 11:25 [IST]
Other articles published on Jul 22, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+