
ఇంతకేం జరిగిందంటే..?
భారత్ విధించిన 225 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ ఓపెనర్ జాసన్ రాయ్ (0) మొదటి ఓవర్‌లోనే డకౌట్‌గా వెనుదిరిగాడు. అనంతరం వచ్చిన డేవిడ్ మలాన్ (46 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 68)తో కలిసి జోస్ బట్లర్ భారీ షాట్లు ఆడేశాడు. ఈ క్రమంలో రెండో వికెట్‌కు మలాన్‌తో కలిసి 130 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన బట్లర్.. హాఫ్ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు.
ఇక ప్రమాదకరంగా మారిన ఈ జోడిని కట్టడి చేసేందుకు భువనేశ్వర్ కుమార్‌ను రంగంలోకి దింపిన విరాట్ కోహ్లీ అనుకున్న ఫలితాన్ని రాబట్టాడు.ఇన్నింగ్స్ 13వ ఓవర్ వేసిన భువనేశ్వర్ కుమార్.. ఆఫ్ స్టంప్‌కి చాలా వెలుపలగా బంతుల్ని వేస్తూ జోస్ బట్లర్‌ని ఇబ్బందిపెట్టాడు. దాంతో.. ఆ ఓవర్‌లో ఐదో బంతిని లాంగాఫ్ దిశగా భారీ షాట్ ఆడిన బట్లర్.. బౌండరీ లైన్ వద్ద హార్దిక్ పాండ్యాకు చిక్కాడు.
విరాట్ నోర్మూయ్..
ఇక తన వ్యూహం ఫలించడంతో విరాట్ కోహ్లీ సంబరాలు చేసుకున్నాడు. ఈ సంతోషంగా కొన్ని వ్యాఖ్యలు చేస్తూ గట్టిగా అరించాడు. అయితే విరాట్ సంబరాలకు చికాకు పడ్డ బట్లర్.. ఆ వ్యాఖ్యలను తనకు ఆపాదించుకొని విరాట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. పెవిలియన్‌కి వెళ్తున్న అతను వెనక్కి వచ్చి మరీ కోహ్లీతో వాగ్వాదానికి దిగాడు. ఫీల్డ్ అంపైర్ నితిన్ మీనన్ కలగజేసుకుని ఇద్దరికి సర్దిచెప్పాడు.
అయితే వారిద్దరి మధ్య ఏం జరుగుతుందనే విషయంపై ఎవరికీ క్లారిటీ లేదు. కానీ కోహ్లీ సంబరాలు చేసుకుంటుండగా.. వెనక్కి వచ్చిన బట్లర్ నోర్మూయ్ విరాట్ అన్నట్లు అతని అహభావాలని బట్టి అర్థమవుతోంది. ఆ ఓవర్ ముగిసిన తర్వాత కోహ్లీ తన వాదనను నితిన్ మీనన్‌కి వినిపిస్తూ కనిపించాడు.

అశ్విన్‌కు జతగా..
ఐపీఎల్ 2019 సీజన్‌లో జోస్ బట్లర్‌ని రవిచంద్రన్ అశ్విన్ మన్కడింగ్ చేయగా.. ఇప్పటికీ ఇద్దరి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోంది. ఇప్పుడు అశ్విన్‌కు తోడు కోహ్లీ జత అయ్యాడు. ఈ వాగ్వాదం ఇంతటితో ఆగుతుందా? లేక వన్డే సిరీస్‌లో కూడా కొనసాగుతుందా? అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. అక్కడ కూడా ఇలానే జరిగితే ఐపీఎల్‌లో కూడా వీరి మధ్య గొడవలుంటాయని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఇప్పటికే విరాట్ కోహ్లీ, ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ మధ్య గత కొన్నేళ్లుగా ఆధిపత్య పోరు నడుస్తున్న విషయం తెలిసిందే.

చితక్కొట్టుడు..
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ (52 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 80 నాటౌట్) , రోహిత్ శర్మ (34 బంతుల్లో4 ఫోర్లు, 5 సిక్సర్లతో 64) అర్ధ సెంచరీలు సాధించగా... హార్దిక్ పాండ్యా (17 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 39 నాటౌట్), సూర్యకుమార్ యాదవ్ (17 బంతుల్లో3 ఫోర్లు, 2 సిక్సర్లతో 32) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. అనంతరం ఇంగ్లండ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 188 పరుగులే చేసి ఓటమిపాలైంది.
డేవిడ్ మలాన్ (46 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 68), జోస్ బట్లర్ (34 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లు 52) దూకుడుగా ఆడినా ఫలితం లేకపోయింది. భారీ స్కోర్ల మ్యాచ్‌లో పొదుపైన బౌలింగ్‌తో 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' భువనేశ్వర్ (2/15) జట్టును గెలిపించాడు. భారత కెప్టెన్ కోహ్లీకి 'ప్లేయర్ ఆఫ్ ద సిరీస్' అవార్డు లభించింది.


Click it and Unblock the Notifications
