Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WATCH: బాప్‌రే.. కోహ్లీ సూపర్ రే..! (వీడియో)

WATCH: Virat Kohli finds Colin Munro short of his crease with a inch-perfect throw in 4th T20I

వెల్లింగ్టన్‌: న్యూజిలాండ్‌తో జరుగుతున్న నాలుగో టీ20లో బ్యాటింగ్‌లో విఫలమైన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఫీల్డింగ్‌లో అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో చెలరేగిన కొలిన్ మున్రో( ఫోర్లు, 3 సిక్స్‌లతో 64)ను అద్భుత రనౌట్‌తో పెవిలియన్ చేర్చాడు. సిక్స్‌లు, ఫోర్లతో విజృంభించి ఆడిన మున్రోను కోహ్లి రనౌట్‌ చేసిన తీరు అబ్బురపరిచింది.

శివం దూబే వేసిన 12 ఓవర్‌ నాల్గో బంతిని మున్రో కవర్స్‌ మీదుగా భారీ షాట్ కొట్టాడు. అయితే బౌండరీ లైన్‌ దగ్గర ఫీల్డింగ్‌ చేస్తున్న శార్దూల్‌ ఠాకూర్‌ బంతిని అందుకున్న మరుక్షణమే షార్ట్‌ కవర్స్‌లో ఉన్న కోహ్లికి అందించాడు. అంతే వేగంగా బంతిని అందుకున్న కోహ్లి స్ట్రైకింగ్ ఎండ్ వైపు ఉన్న వికెట్లకు నేరుగా కొట్టాడు.

అప్పటికి ఒక పరుగు తీసి మరో పరుగు కోసం​ యత్నిస్తున్న మున్రో రనౌట్‌ అయ్యాడు. సాధారణంగా అయితే దానికి రెండు పరుగులు వచ్చేవి. కానీ ఠాకూర్‌, కోహ్లి ఎఫర్ట్‌తో అది పరుగు రాగా, న్యూజిలాండ్‌ కీలక వికెట్‌ను కోల్పోయింది. దీంతో మున్రో విధ్వంసానికి బ్రేక్‌లు పడ్డాయి.

ఈ మ్యాచ్‌లో సోధి, బెన్నెట్ ధాటికి టీమిండియా టాపార్డర్ విఫలమవ్వగా.. మనీష్ పాండే (50 నాటౌట్‌; 36 బంతుల్లో 3 ఫోర్లు) అజేయ హాఫ్ సెంచరీతో భారత్ గౌరవ ప్రదమైన స్కోర్ చేయగలిగింది. పాండే ఆదుకోవడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసిన భారత్.. కివీస్ ముందు 166పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

ఇక ఛేజింగ్‌‌కు దిగిన న్యూజిలాండ్ విజయం దిశగా దూసుకెళ్లి ఆఖర్లో తడబడి టై చేసుకుంది. దీంతో సూపర్ ఓవర్‌కు దారి తీసింది. సూపర్‌ ఓవర్‌‌లో విజయం కోహ్లీసేననే వరించింది. సూపర్ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ వికెట్ కోల్పోయి 13 పరుగులు చేసింది.

అనంతరం టీమిండియా వికెట్ కోల్పోయి ఓ బంతి మిగిలి ఉండగానే 16 పరుగులు చేయడంతో ఈ మ్యాచ్‌లో విజయం సాధించింది. అంతకుముందు 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆతిథ్య జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 165 పరుగులే చేయడంతో మ్యాచ్ టై అయింది. దీంతో మ్యాచ్ విజేతను నిర్ణయించేందుకు సూపర్ ఓవర్ ఆడించారు.

ఈ సిరీస్‌లో వరుసగా రెండోసారి సూపర్ ఓవర్ ఆడటం జరిగింది. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ టీమిండియానే విజయం సాధించింది. ఫలితంగా ఐదు టీ20ల సిరిస్‌లో టీమిండియా 4-0 ఆధిక్యంలో నిలిచింది.

Story first published: Friday, January 31, 2020, 17:01 [IST]
Other articles published on Jan 31, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+