Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

CPL 2020: వెస్టిండీస్ భారీకాయుడి భారీ ఇన్నింగ్స్.. సెయింట్ జౌక్స్ సూపర్ విక్టరీ!

Watch Stellar Innings from the big man Rahkeem Cornwall in CPL 2020

ట్రినిడాడ్: వెస్టిండీస్ భారీకాయుడు రకీమ్ కార్న్‌వాల్(29 బంతుల్లో 3 సిక్సర్లు, 2 ఫోర్లతో 32), నజిబుల్లా జడ్రాన్(25 బంతుల్లో1 ఫోర్, 3 సిక్సర్లతో 35) చెలరేగడంతో జమైకా తల్లవాస్‌తో జరిగిన మ్యాచ్‌లో సెయింట్ లూసియా జౌక్స్ అద్భుత విజయాన్నందుకుంది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో 11 పరుగులతో గెలుపొందింది.

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సెయింట్ జౌక్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 145 రన్స్ చేసింది. క్రికెట్ బాహుబలి కార్న్‌వాల్, జడ్రాన్‌తో పాటు చేజ్(32నాటౌట్) రాణించాడు. జమైకా బౌలర్లలో ముజీబ్ ఉర్ రెహ్మాన్ రెండు వికెట్లు తీయగా.. సందీప్ లమిచ్చేనే, కార్లోస్ బ్రాత్‌వైట్, ఫిడెల్ ఎడ్వర్డ్స్, వీరసామి పెర్‌మౌల్ తలొ వికెట్ తీశారు.

అనంతరం లక్ష్య చేధనకు దిగిన జమైకా తల్లవాస్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 134 రన్స్ చేసి ఓటమిపాలైంది. ఆ జట్టు ఓపెనర్లు బ్లాక్ వుడ్(25), గ్లేన్ ఫిలిప్స్ (49), నికోలస్ కిర్టన్(25) రాణించినా ఫలితం లేకపోయింది. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ ఆండ్రూ రస్సెల్ గోల్డెన్ డకౌట్‌ కాగా.. వాల్టన్(10), కెప్టెన్ పోవెల్(2), బ్రాత్‌వైట్(1) దారుణంగా విఫలమయ్యారు.

రస్సెల్‌తో కలిపి మొత్తం ముగ్గురు బ్యాట్స్‌మన్ డకౌట్ అయ్యారు. సెయింట్ జౌక్స్ బౌలర్లలో గ్లెన్(3/16), జహీర్ ఖాన్(3/25) మూడేసి వికెట్లతో తల్లవాస్ పతనాన్ని శాసించారు. కెస్రిక్ విలియమ్స్‌ రెండు వికెట్లు తీశాడు. ఇక 10 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో సెయింట్ లూసియా, 3 విజయాలతో జమైకా తల్లవాస్ జట్లు సెమీస్‌కు అర్హత సాధించాయి.

Story first published: Monday, September 7, 2020, 11:59 [IST]
Other articles published on Sep 7, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+