Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Shaheen Afridi: బాల్ టాంపరింగ్ చేస్తూ కెమెరాకు చిక్కిన పాక్ పేసర్! (వీడియో)

పాకిస్థాన్ పేసర్ షాహీన్ షా అఫ్రిది మరో వివాదంలో చిక్కుకున్నాడు. రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో ఢాకా వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో షాహీన్ అఫ్రిది బాల్ టాంపరింగ్‌కు ప్రయత్నిస్తూ టీవీ కెమెరాలకు చిక్కాడు. బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది.

బౌలింగ్ చేసే సమయంలో అఫ్రిది.. బంతిని తన షూస్ కింద వేసి బలంగా నొక్కే ప్రయత్నం చేశాడు. ఈ విషయాన్ని గమనించిన అంపైర్ వెంటనే బంతిని చెక్ చేసి.. ఆకారం దెబ్బతినకపోవడంతో బౌలింగ్‌కు అనుమతిచ్చాడు. దాంతో అఫ్రిది ఆ ఓవర్‌ను పూర్తి చేశాడు. అయితే ఈ వీడియో నెట్టింట వైరల్ కాగా.. అఫ్రిదిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

WATCH Shaheen Afridi Under Scrutiny for Alleged Ball Tampering in Bangladesh vs Pakistan 1st Test

బాల్ టాంపరింగ్‌కు ప్రయత్నించిన అతనిపై మ్యాచ్ రిఫరీ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో ఫకార్ జమాన్ బాల్ టాంపరింగ్‌కు ప్రయత్నించి దొరికిపోయాడు. అతనిపై నిర్వాహకులు భారీ జరిమానా విధించారు. ఈ ఘటన‌ను మరిచిపోకముందే మరో పాక్ ఆటగాడు బాల్ టాంపరింగ్‌కు యత్నించడం తీవ్ర చర్చనీయాంశమైంది.

ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ విజయం దిశగా సాగుతోంది. 268 పరుగుల లక్ష్యంతో ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన పాకిస్థాన్ 121 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. క్రీజులో సౌద్ షకీల్, మహమ్మద్ రిజ్వాన్ ఉన్నారు.

ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 413 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ షాంటో (101), మోమినుల్ హక్ (91), ముష్ఫికర్ రహీమ్ (71) రాణించారు. పాకిస్థాన్ బౌలింగ్‌లో మహ్మద్ అబ్బాస్(5/92) ఐదు వికెట్లు తీయగా.. షాహీన్ షా అఫ్రిది 3 వికెట్లు పడగొట్టాడు.

అనంతరం పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 386 పరుగులకు ఆలౌటైంది. ఇమామ్-ఉల్-హక్ (120), అబ్దుల్లా ఫజల్ (120) శతకాలతో రాణించారు. 27 పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ 240/9 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. నజ్ముల్ హుస్సేన్ షాంటో (87), మోమినుల్ హక్ (56) రాణించారు.

Story first published: Tuesday, May 12, 2026, 15:42 [IST]
Other articles published on May 12, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+