For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వారెవ్వా షెఫాలీ.. వాటే త్రో! అచ్చం జడేజాలానే డైరెక్ట్ హిట్!(వీడియో)

Watch Shafali Vermas Stunning Direct Hit To Dismiss Annabel Sutherland In Her WBBL Debut

సిడ్నీ: ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న మహిళల బిగ్‌బాష్‌ లీగ్‌లో టీమిండియా యువ సంచలనం షెఫాలీ వర్మ కళ్లు చెదిరే ఫీల్డింగ్ విన్యాసంతో మైమరిపించింది. అరంగేట్ర మ్యాచ్‌లోనే తన మార్క్ ఫీల్డింగ్‌తో సత్తా చాటింది. సిడ్నీ సిక్సర్స్‌ తరఫున బిగ్‌బాష్ లీగ్‌లోకి అరంగేట్రం చేసిన పెఫాలీ... బ్యాటింగ్‌లో మెరవకపోయినా.. ఫీల్డింగ్‌లో ఓ మెరుపు రనౌట్‌ చేసింది. డైరెక్ట్‌ త్రోతో ప్రత్యర్థి బ్యాటర్‌ను పెవిలియన్‌కు చేర్చింది. అచ్చం టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను తలపించింది. దీనికి సంబంధించిన వీడియోను క్రికెట్ ఆస్ట్రేలియా ట్విటర్ వేదికగా పంచుకోగా వైరల్‌గా మారింది.

షెఫాలీ సూపర్ ఫీల్డింగ్‌ను అభిమానులు మెచ్చుకుంటున్నారు. 'వావ్‌, ఎక్స్‌లెంట్‌ ఫీల్డింగ్‌' అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు షెఫాలీని టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాతో పోలుస్తూ 'లేడీ జడేజా' అంటూ కొనియాడుతున్నారు. మెల్‌బోర్న్‌ స్టార్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత టాస్‌ గెలిచిన సిడ్నీ సిక్సర్స్‌ టీమ్‌ బౌలింగ్ ఎంచుకుంది. ఎల్లీస్సీ పేరీ వేసిన ఇన్నింగ్స్‌ ఐదో ఓవర్‌ ఐదో బంతికి మెల్‌బోర్న్‌ బ్యాటర్‌ ఎలీసీ విల్లాని షార్ట్‌ డీప్‌ మిడ్‌వికెట్‌ మీదుగా షాట్‌ ఆడింది. అయితే, నాన్‌స్ట్రైకర్‌ ఎండ్‌లో ఉన్న సుదర్‌లాండ్ అనే మరో బ్యాటర్‌ క్రీజు వదిలి కాస్త ముందుకెళ్లింది. అప్పుడే షెఫాలి బంతి అందుకొని వికెట్లకేసి డైరెక్ట్‌ త్రో విసిరింది. దీంతో క్రీజు బయటున్న సుదర్‌లాండ్‌ (14) పెవిలియన్‌ చేరాల్సి వచ్చింది.

దీనికి మంత్రముగ్ధులైన కామెంటేటర్లు కూడా షెఫాలీని మెచ్చుకున్నారు. ఇక వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 11 ఓవర్లకు కుదించగా తొలుత బ్యాటింగ్‌ చేసిన మెల్‌బోర్న్‌ స్టార్స్‌ ఒక వికెట్‌ నష్టానికి 99 పరుగులు చేసింది. విల్లాని (54), లాన్నింగ్‌ (23) చివరివరకూ బ్యాటింగ్‌ చేసి నాటౌట్‌గా నిలిచారు. అనంతరం సిడ్నీ సిక్సర్స్‌ బ్యాటర్లు నాలుగు వికెట్లు కోల్పోయి 10.2 ఓవర్లలో లక్ష్యాన్ని పూర్తి చేశారు. ఓపెనర్‌ అలిస్సా హేలీ (57) హాఫ్ సెంచరీతో రాణించగా.. షెఫాలి (8) పరుగులకే పెవిలియన్‌ చేరి బ్యాటింగ్‌లో నిరాశపరిచింది.

Story first published: Friday, October 15, 2021, 17:47 [IST]
Other articles published on Oct 15, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+