Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2026: మళ్లీ కేఎల్ రాహుల్ X సంజీవ్ గోయెంకా (వీడియో)

లక్నో సూపర్ జెయింట్స్(LSG) ఓనర్ సంజీవ్ గోయెంకా మరోసారి వార్తల్లో నిలిచారు. తొలి మ్యాచ్‌లోనే తన జట్టు ఓటమిని తట్టుకోలేకపోయిన సంజీవ్ గోయెంకా కెప్టెన్ రిషభ్ పంత్‌కు తనదైన శైలిలో గట్టిగా క్లాస్ పీకారు. పక్కనే ఉన్న హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్‌ను కూడా అర్సుకున్నారు.

ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. కెప్టెన్లను మందలించే అలవాటును ఇంకా సంజీవ్ గోయెంకా మానుకోలేదనే చర్చ మళ్లీ మొదలైంది. గతంలో కూడా కేఎల్ రాహుల్‌ను ఇలానే మందలించి సంజీవ్ గోయెంకా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు.

రాహుల్ ఔటవ్వడంపై..

సంజీవ్ గోయెంకా వ్యవహర శైలి నచ్చని కేఎల్ రాహుల్.. ఆ జట్టును వదిలేసి ఢిల్లీ క్యాపిటల్స్‌కు వెళ్లిపోయాడు. తాజా మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 6 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలోనే ఓటమిపాలైంది. అయితే ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ ఔటైన సందర్భంలో సంజీవ్ గోయెంకా సంతోషానికి హద్దే లేకుండా పోయింది. మహమ్మద్ షమీ వేసిన ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్ తొలి బంతికే కేఎల్ రాహుల్(0) క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.

Watch Sanjiv Goenka Wild Celebration After KL Rahul s Golden Duck Sparks Social Media Frenzy

ఫస్ట్ బాల్‌కే రాహుల్ ఔటవ్వడంతో సంజీవ్ గోయెంకా ఎగిరి గంతేసారు. తన పక్కనే ఉన్న వ్యక్తికి హైఫై ఇచ్చి మరీ సెలెబ్రేట్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. రాహుల్‌పై గోయెంకా ఇంకా కోపం తగ్గలేదు కదా? అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

తేలిపోయిన లక్నో..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 18.4 ఓవర్లలో 141 పరుగులకు ఆలౌటైంది. మిచెల్ మార్ష్(28 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 35), అబ్దుల్ సమద్(25 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 36) టాప్ స్కోరర్లుగా నిలవగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో లుంగి ఎంగిడితో పాటు నటరాజన్ మూడు వికెట్లు తీయగా.. కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టాడు. అక్షర్ పటేల్‌కు ఒక వికెట్ దక్కింది.

అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 17.1 ఓవర్లలో 4 వికెట్లకు 145 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. ఇంపాక్ట్ ప్లేయర్ సమీర్ రిజ్వీ(47 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 70 నాటౌట్), ట్రిస్టన్ స్టబ్స్(32 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 39 నాటౌట్) అసాధారణ బ్యాటింగ్‌తో ఢిల్లీ విజయలాంఛనాన్ని పూర్తి చేశారు. లక్నో బౌలర్లలో ప్రిన్స్ యాదవ్ 2 వికెట్లు తీయగా.. మహమ్మద్ షమీ, మోహ్‌సిన్ నఖ్వీ తలో వికెట్ తీసారు.

Story first published: Thursday, April 2, 2026, 16:06 [IST]
Other articles published on Apr 2, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+