For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బుమ్రా బౌలింగ్‌ను ఇమిటేట్ చేసిన రోహిత్ డాటర్.. ఫిదా అయిన యార్కర్ల కింగ్!!

Watch Rohit Sharmas daughter imitates Jasprit Bumrahs bowling action
Watch : Rohit Sharma's Daughter Imitates Jasprit Bumrah's Bowling

హైదరాబాద్: విభిన్న శైలి కలిగిన టీమిండియా స్టార్‌ పేసర్ జస్‌ప్రీత్‌ బుమ్రా బౌలింగ్‌‌కు పిచ్చ క్రేజ్ అన్న విషయం తెలిసిందే. ఈ యార్కర్ల కింగ్ బౌలింగ్ యాక్షన్‌ను చిన్నా పెద్దా తేడా లేకుండా ఎంతో మంది అభిమానులు అనుకరిస్తుంటారు. అందుకు సంబంధించిన వీడియోలు కూడా గతంలో నెట్టింట్లో హల్‌చల్ చేశాయి.

ఈసారి 15 నెలల పాప..

ఈసారి 15 నెలల పాప..

ఇక తాజాగా తన బౌలింగ్‌ను ఓ 15 నెలల పాప అనుకరించింది. ఆమె ఎవరో కాదు.. టీమిండియా పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ డాటర్ సమైరా. అవును జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌ను అనుకరించి అందరిని ఆశ్చర్యపరిచింది. కరోనా దెబ్బతో ఆటగాళ్లంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ క్వారంటైన్ సమయాన్ని ఫ్యామిలీతో హాయిగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే రోహిత్.. అతని సతీమణి రితికా సజ్ధే తన కూతురు సమైరాతో సరదాగా ఆడుకుంటున్నారు.

పెద్ద ఫ్యాన్ అయిపోయా..

ఈ సమయంలో రితికా.. బుమ్రా ఎలా బౌలింగ్‌ చేస్తాడని సమైరాను ప్రశ్నించింది. దీంతో వెంటనే బుమ్రా యాక్షన్‌ను అనకరించడంతో రోహిత్‌, రితికాలు గట్టిగా నవ్వుకున్నారు. ఈ వీడియోను బుమ్రా తన సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ ‘నా కంటే సమైరానే బాగా చేసిందనుకుంటున్నా. ఆమె నన్ను అభిమానించే కంటే నేనే ఎక్కువగా ఆమెకు పెద్ద ఫ్యాన్‌ అయిపోయా'అని పేర్కొన్నాడు.

చహల్‌కు బెదిరింపులు..

చహల్‌కు బెదిరింపులు..

లాక్‌డౌన్ నేపథ్యంలో బుమ్రా, రోహిత్ సరదాగా చిట్ చాట్ చేస్తుండగా.. చహల్ మధ్యలోకి వచ్చాడు. దీంతో ఈ ఇద్దరు చహల్‌కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. ఈ సీజన్‌ ఐపీఎల్‌ వేలంలో ముంబై ఇండియన్స్‌ కొనుగోలు చేసిన ట్రెంట్‌ బౌల్ట్‌ గురించి బుమ్రాతో రోహిత్‌ చర్చించాడు. బౌల్ట్‌తో కలిసి బౌలింగ్‌ ఎన్‌కౌంటర్‌ ఎలా ఉండబోతుందనే విషయం వీరి సంభాషణలో ప్రస్తావనకు వచ్చింది. వీరి సంభాషణ మధ్యలో దూరిపోయిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్సీబీ) స్పిన్నర్‌ యజ్వేంద్ర చహల్‌.. తనను మిస్‌ అవుతున్నారా అంటు చమత్కరించాడు. ఇంకో అడుగు ముందుకేసి మరీ ముంబై ఇండియన్స్‌ ఏమైనా నన్ను మిస్‌ అవుతుందా'అని రోహిత్‌ను ఆట పట్టించే యత్నం చేశాడు. దానికి రోహిత్‌ కూడా చిలిపిగానే జవాబిచ్చాడు.

‘నీ గురించి ఆర్సీబీకి చెబుతాం.. ముంబై ఇండియన్స్‌ జట్టుకు ఆడాలనుకుంటున్నావని మీ ఫ్రాంచైజీ యాజమాన్యానికి తెలియజేస్తాం. నీ వేషాలు మీ కెప్టెన్‌ కోహ్లి కూడా చెబుతా. అయినా నిన్ను మిస్‌ అవ్వాల్సిన అవసరం మా జట్టుకు లేదే. మేము గెలవకపోతే నిన్ను మిస్‌ అయినట్లు. మరి మేము గెలుస్తున్నాం కదా.. అటువంటప్పుడు నిన్ను ఎందుకు మిస్‌ అవుతున్నామని అనుకోవాలి. నీ అవసరం మాకు లేదు కదా. నువ్వు బెంగళూరులోనే ఉండు. మా దగ్గరికి రావొద్దు ' అని రోహిత్‌ సరదాగా సమాధానమిచ్చాడు.

Story first published: Friday, April 3, 2020, 18:43 [IST]
Other articles published on Apr 3, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+