For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

స్మిత్‌ను అనుకరించిన రషీద్ ఖాన్.. సన్ రైజర్స్‌ను ట్రోల్ చేసిన రాజస్థాన్ రాయల్స్!!

Watch Rashid Khan Cheekily Imitates Steve Smith

హైదరాబాద్: కరోనా కారణంగా యావత్ ప్రపంచం స్వీయ నిర్భంధంలోకి వెళ్లింది. ఆటలన్నీ ఆగమాగమయ్యాయి. కొన్ని టోర్నీలు రద్దవ్వగా.. మరికొన్ని వాయిదా పడ్డాయి. దీంతో ఆటగాళ్లంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ లాక్‌డౌన్‌ సమయాన్ని కుటుంబంతో కలిసి ఆస్వాదిస్తూనే సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు. కరోనా వైరస్‌పై అవగాహన కల్పిస్తున్నారు. ఫ్యాన్స్‌తో చిట్‌చాట్ కూడా చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో అఫ్గానిస్తాన్‌ సంచలనం రషీద్‌ ఖాన్‌ తన ఇంట్లోనే ఓ చిలిపి ప్రయత్నం చేశాడు. ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌ స్మిత్‌ను అనుకరిస్తూ బ్యాటింగ్‌ చేశాడు. ఫన్నీగా ఉన్న ఆ వీడియోను సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తన అధికారిక ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. 'సన్‌రైజర్స్ ప్లేయర్ రషీద్ ఖాన్‌‌తో ఇండోర్ క్రికెట్ ఆడాలని ఎవరికి ఉంది.. కేవలం అనుకరన మాత్రమే'అని క్యాప్షన్‌గా పేర్కొంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

అయితే ఈ వీడియోపై రాజస్తాన్‌ రాయల్స్‌ సైతం సరదా కామెంట్ చేసింది. తమ కెప్టెన్ స్మిత్‌ ఆ విధంగా ఒక్కసారే కాదని అనేకమార్లు ఆడాడని పేర్కొంటూ మరో వీడియోను పోస్ట్‌ చేసింది. స్టీవ్‌ స్మిత్‌ రాజస్తాన్‌ రాయల్స్‌ సారథి అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రెండు ఫ్రాంచైజీల మధ్య జరిగిన సంభాషణ, స్మిత్‌ను అనుకరిస్తూ రషీద్‌ చేసిన బ్యాటింగ్‌పై నెటిజన్లు సరదాగా స్పందిస్తున్నారు. 'అచ్చం స్మిత్‌ లానే బ్యాటింగ్‌ చేస్తున్నావ్‌.. చూడముచ్చటగా ఉంది'అంటూ ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశాడు.

ఇక 2017 సీజన్‌తో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన రషీద్ ఖాన్ తన సంచలన బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ అదరగొట్టాడు. ఐపీఎల్‌లో అనేక మ్యాచ్‌ల్లో బంతితో పాటు బ్యాట్‌తో కూడా సన్‌రైజర్స్‌కు విజయాలను అందించాడు.

Story first published: Friday, April 3, 2020, 18:13 [IST]
Other articles published on Apr 3, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+