CPL 2020: 48 ఏళ్ల వయసులో సూపర్ క్యాచ్‌తో ఔరా అనిపించిన ప్రవీణ్ తాంబే

ట్రినిడాడ్: కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్) 2020 సీజన్ ఆడుతున్న తొలి భారత క్రికెటర్‌గా గుర్తింపు పొందిన ప్రవీణ్ తాంబే.. 48 ఏళ్ల వయసులో తనదైన ఆటతో అలరిస్తున్నాడు. ఈ ధనాధన్ లీగ్‌లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ తరఫున ఆడుతున్న ప్రవీణ్ తాంబేకు అవకాశాలు పరిమితంగానే వస్తున్నా.. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు. సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పాట్రియోట్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్, ఫీల్డింగ్‌లో ఈ భారత ఆటగాడు అదరగొట్టాడు. గాల్లోకి ఎగిరి అతను పట్టిన ఓ క్యాచ్.. మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. ఆటకు వయసుతో సంబంధంలేదని నిరూపించింది.
48 ఏళ్ల వయసులో..
48 ఏళ్ల వయసులో యువ క్రికెట్లరు ఏ మాత్రం తీసిపోని రీతిలో అతను పట్టిన క్యాచ్ ప్రతీ ఒక్కరిని అబ్బూరపరుస్తోంది. ఈ వీడియోను సీపీఎల్ 2020 నిర్వాహకులు అధికారిక ట్విటర్ వేదికగా.. ‘48 ఏళ్ల వయసులో గాల్లోకి ఎగిరి పట్టిన ప్రవీణ్ తాంబే క్యాచ్.. గూగ్లీ మ్యాజిక్ మూమెంట్'అనే క్యాప్షన్‌తో షేర్ చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

గాల్లోకి ఎగిరి..
సెయింట్ కిట్స్ ఇన్నింగ్స్ సందర్భంగా రెండో ఓవర్ చివరి బంతిని పిర్రే ఔట్‌సైడ్ ఆఫ్‌గా వేయగా.. ఓపెనర్ ఎవిన్ లూయిస్.. పాయింట్ దిశగా కట్ షాట్ ఆడాడు. అయితే అదే ప్లేస్‌లో ఫీల్డింగ్ చేస్తున్న తాంబే గాల్లోకి ఎగిరి అందుకున్నాడు. ఈ ఊహించని పరిణామంతో బ్యాట్స్‌మన్ అవాక్కవ్వగా.. ఫీల్డర్లంతా సంతోషం వ్యక్తం చేశారు. ఇక కామెంటేటర్స్ అయితే యంగ్ మ్యాన్ తాంబే అంటూ అతని 48 ఏళ్ల వయసును పరోక్షంగా ప్రస్తావిస్తూ గట్టిగా అరిచారు.

సూపర్ బౌలింగ్
ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన ప్రవీణ్ తాంబే 12 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీశాడు. ఇందులో ఒక ఓవర్ మెయిడిన్ చేయడం గమనార్హం. ఇక లేటు వయసులో టీ20 లీగ్ ఆడుతున్న ఆటగాడిగా కూడా ప్రవీణ్ తాంబే గుర్తింపు పొందాడు. ఈ మ్యాచ్‌లో నైట్ రైడర్స్ 59 పరుగులతో గెలుపొంది తమ జైత్రయాత్రను కొనసాగించింది. ఓటమెరుగని జట్టుగా 8 మ్యాచ్‌లకు 8 గెలిచి టేబుల్ టాపర్‌గా కొనసాగుతుంది.

నైట్ రైడర్స్ విక్టరీ..
తొలుత బ్యాటింగ్ చేసిన ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. లెండీ సిమ్మన్స్(96), డారెన్ బ్రావో(36) చెలరేగారు. ప్రత్యర్థి బౌలర్లలో షెల్డన్ కాట్రెల్ ఒక వికెట్ తీయగా.. డొమినిక్ డ్రేక్స్ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం సెయింట్ కిట్స్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లకు 115 పరుగులకే పరిమితమై ఘోరపరాజయాన్ని మూటగట్టుకుంది. నైట్ రైడర్స్ బౌలర్లలో సికింధర్ రాజా మూడు వికెట్లు తీయగా..ప్రవీణ్ తాంబే, హోసెన్, పిర్రే తలో వికెట్ తీశారు.
ఇంగ్లండ్ క్రికెట్‌లోని జాతి, మత వివక్షతో చావాలనుకున్నా: పాక్ సంతతి క్రికెటర్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications