For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

RCB vs SRH: వారెవ్వా సాల్ట్.. వాటే క్యాచ్! మైండ్ బ్లోయింగ్!(వీడియో)

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) స్టార్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ కళ్లు చెదిరే క్యాచ్‌తో ఔరా అనిపించాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో సాల్ట్ స్టన్నింగ్ ఫీల్డింగ్‌తో మైమరిపించాడు. మొత్తం మూడు క్యాచ్‌లు అందుకున్న ఫిల్ సాల్ట్.. రెండు అయితే అసాధారణ రీతిలో పట్టాడు.

ముఖ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఇషాన్ కిషన్ ఇచ్చిన క్యాచ్‌ను బౌండరీ లైన్ ముంగిట సింగిల్ హ్యాండ్‌తో అందుకున్నాడు. ప్రస్తుతం ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ సీజన్‌లోనే బెస్ట్ క్యాచ్‌గా ఇది నిలిచిపోనుంది. అంతకుముందు హెన్రీచ్ క్లాసెన్ ఇచ్చిన క్యాచ్‌ను బౌండరీ లైన్‌పై సాల్ట్ అద్భుతంగా అందుకున్నాడు. ముఖ్యంగా బౌండరీ లైన్‌ను తాకకుండా తన శరీరాన్ని సమన్వయం చేసుకున్న తీరు అమోఘం. ఫిల్ సాల్ట్ క్యాచ్‌లతోనే ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ పతనాన్ని శాసించాడు. ఇషాన్, క్లాసెన్‌తో పాటు డేంజరస్ ట్రావిస్ హెడ్ క్యాచ్‌ను కూడా సాల్ట్ అందుకున్నాడు.

Watch Phil Salt s Insane One-Handed Flying Catch Ends Ishan Kishan s 80-Run Blitz in IPL 2026 Opener
Photo Credit: twitter (X)

నోరెళ్లబెట్టిన ఇషాన్ కిషన్..

విధ్వంసకర బ్యాటింగ్‌తో సెంచరీ దిశగా సాగిన ఇషాన్ కిషన్.. ఫిల్ సాల్ట్ అసాధారణ క్యాచ్‌తో నిరాశగా పెవిలియన్ చేరాడు. అరంగేట్ర పేసర్ అభినందన్ సింగ్ వేసిన 16వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్‌ ఆఖరి బంతిని ఔట్ సైడ్ ఆఫ్ ఫుల్‌టాస్‌గా వేయగా.. ఇషాన్ గాల్లోకి లేపాడు. పాయింట్ బౌండరీని నుంచి పరుగుత్తుకొచ్చిన ఫిల్ సాల్ట్.. ఫుల్ స్ట్రెచ్‌తో సింగిల్ హ్యాండ్‌తో అందుకున్నాడు. ఈ క్యాచ్‌కు ఇషాన్ కిషన్‌తో పాటు ఆర్‌సీబీ ఆటగాళ్లంతా నోరెళ్లబెట్టారు. కామెంటేటర్లతో పాటు ప్రేక్షకులు అవాక్కయ్యారు. జితేశ్ శర్మ అయితే మైండ్ బ్లోయింగ్ అంటూ ఫిల్ సాల్ట్‌ను ప్రశంసించాడు. ఫ్యాన్స్ సైతం వారెవ్వా వాటే క్యాచ్.. మైండ్ బ్లోయింగ్ అంటూ కామెంట్ చేస్తున్నారు.

సన్‌రైజర్స్ భారీ స్కోర్..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 201 పరుగులు చేసింది. కెప్టెన్ ఇషాన్ కిషన్(38 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లతో 80) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగగా.. అనికేత్ వర్మ(18 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 43), హెన్రీచ్ క్లాసెన్(22 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 31) దూకుడుగా ఆడారు. ఆర్‌సీబీ బౌలర్లలో జాకో డఫీ(3/22), రొమారియో షెఫెర్డ్(3/54) మూడేసి వికెట్లు తీయగా.. భువనేశ్వర్ కుమార్, అభినందన్ సింగ్, సుయాష్ శర్మ తలో వికెట్ తీసారు.

Story first published: Saturday, March 28, 2026, 21:39 [IST]
Other articles published on Mar 28, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+