Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వారెవ్వా ఏం క్యాచ్.. అచ్చం చేప పిల్లలానే డైవ్ (వీడియో)

WATCH: Nathan Lyons flying catch to dismiss Sam Heazlett in BBL

బ్రిస్బెన్ : ఆస్ట్రేలియా దేశవాళీ టోర్నీ బిగ్‌బాష్ లీగ్‌లో కళ్లు చెదిరే క్యాచ్ అభిమానులను కనువిందు చేసింది. అచ్చం చేపపిల్లాలనే ఉన్న డైవ్ బ్యాట్స్‌మెన్‌తో పాటు చూస్తున్న ప్రేక్షకులు నోరెళ్లబెట్టేలా చేసింది. బిగ్‌బాష్ లీగ్‌లో భాగంగా బ్రిస్బెన్ హీట్ vs సిడ్నీసిక్సర్స్ మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో ఈ అద్భుతం చోటు చేసుకుంది.

ఇక ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి క్రిస్‌లిన్ నేతృత్వంలోని బ్రిస్బెన్ హిట్ తొలుత బ్యాటింగ్ చేయగా.. సిడ్నీ సిక్సర్స్ బౌలర్ నాథన్ లియోన్ కళ్లుచెదిరే క్యాచ్‌తో ఔరా అనిపించాడు. లియోన్ వేసిన ఆరో ఓవర్ తొలి బంతిని బ్రిస్బెన్ హీట్ ఓపెనర్ సామ్ హిజ్లెట్ డిఫెన్స్ చేయబోయాడు. అయితే బౌన్స్ అయిన బంతి బ్యాట్ ఎడ్జ్‌ తీసుకొని గాల్లోకి లేచింది. ఇది గమనించిన లియోన్ సూపర్ డైవ్‌తో బంతిని అద్భుతంగా ఒడిసిపట్టుకున్నాడు. అచ్చం చేపపిల్లను తలపించిన అతని డైవ్‌తో మైదానంలోని ఆటగాళ్లు, అభిమానులు, మ్యాచ్‌ను చూస్తున్న ప్రేక్షకులు సంభ్రమాశ్చర్యానికి లోనయ్యారు.

బ్యాట్స్‌మన్ సామ్ అయితే అలా ఎలా? క్యాచ్ పట్టాడు? అనే షాక్‌తోనే మైదానం వీడాడు. దీనికి సంబంధించిన వీడియోను బిగ్‌బాష్ నిర్వాహకులు ట్వీట్ చేయగా.. నెట్టింట వైరల్ అయింది. నెటిజన్లు ఫన్నీ కామెంట్లతో ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. లియోన్ క్యాచ్ పడితే సహచర ఆటగాళ్లంతా బంతి ఎక్కడా?అని వెతుకుతున్నారని కామెంట్ చేస్తున్నారు.

ఇక ఈ మ్యాచ్‌లో సిడ్నీసిక్సర్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బ్రిస్బెన్ హీట్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 126 పరుగులు చేసింది. సౌతాఫ్రికా లెజెండ్ డివిలియర్స్ (25),ప్యాటిన్సన్ (27) టాప్ స్కోరర్లుగా నిలిచారు. సిడ్నీ బౌలర్లలో జాక్సన్ బర్డ్, టామ్ కరణ్, బెన్ రెండేసి వికెట్లు తీయగా.. లియోన్, స్టీవ్ఒకీఫ్ తలో వికెట్ తీశారు. అనంతరం ఛేజింగ్‌కు దిగిన సిడ్నీ సిక్సర్స్.. 15.5 ఓవర్లలో రెండు వికెట్లకు 127 పరుగులు చేసి 25 బంతులు మిగిలి ఉండగానే విజయాన్నందుకుంది. ఓపెనర్లు జేమ్స్ ఫిలిప్(43 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్‌తో 52), జేమ్స్ విన్స్ (37 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్సర్‌తో 51) హాఫ్ సెంచరీలతో రాణించారు.

Story first published: Thursday, January 23, 2020, 22:35 [IST]
Other articles published on Jan 23, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+