Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: బెన్ డకెట్‌ X సిరాజ్! భుజాలతో ఢీకొట్టి..!(వీడియో)

భారత్, ఇంగ్లండ్ మూడో టెస్ట్ నాలుగో రోజు ఆట వాడి వేడీగా మొదలైంది. ఆటగాళ్ల మధ్య మాటల యుద్దం తారా స్థాయికి చేరింది. పిచ్ కూడా బౌలింగ్‌కు అనుకూలిస్తుండటంతో ఇంగ్లండ్ బ్యాటర్లు తీవ్రంగా తడబడుతున్నారు. ఆట ఆరంభంలోనే మహమ్మద్ సిరాజ్.. ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్(12)ను పెవిలియన్ చేర్చాడు. తన మాటలతో కవ్వించి మరి బెన్ డకెట్‌ను క్యాచ్ ఔట్ చేశాడు.

వికెట్ తీసిన అనంతరం దూకుడుగా సంబరాలు చేసుకున్నాడు. ఈ క్రమంలో బెన్ డకెట్‌‌వైపు దూసుకెళ్లాడు. అతను కూడా ధీటుగా బదులిచ్చాడు. అయితే సిరాజ్ తీరును అంపైర్లు తప్పుబట్టారు. అతన్ని మందలించారు. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో సిరాజ్ వేసిన 6వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ మూడో బంతిని డకెట్ బౌండరీ కొట్టడంతో సిరాజ్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. మళ్లీ బౌండరీ కొట్టంటూ అతన్ని రెచ్చగొట్టాడు. నాలుగో బంతిని డాట్ చేసిన డకెట్.. ఐదో బంతికి ఔటయ్యాడు.

Watch Mohammed Siraj s Aggressive Celebration Towards Ben Duckett After Wicket in Lord s Test

గంటకు 140 కిలోవీటర్ల వేగంతో ఈ బంతిని సిరాజ్ నాలుగో స్టంప్ లైన్‌లో వేయగా.. డకెట్ పుల్ షాట్ ఆడబోయి మిడాన్‌లో బుమ్రాకు చిక్కాడు. వికెట్ తీసిన అనంతరం 'కామాన్'అంటూ డకెట్‌పై సిరాజ్ గట్టిగా అరిచాడు. ఈ క్రమంలో ఇద్దరు ఆటగాళ్లతో భుజాలతో ఢీకొట్టుకున్నారు. డకెట్ వెనక్కి తగ్గడంతో గొడవ జరగలేదు. అంపైర్లు మాత్రం సిరాజ్‌ను మందలించారు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 387 పరుగులకు ఆలౌటైంది. అనంతరం భారత్ కూడా 387 పరుగులే చేసింది. దాంతో ఏ జట్టుకు ఆధిక్యం దక్కలేదు.

Story first published: Sunday, July 13, 2025, 16:39 [IST]
Other articles published on Jul 13, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+