Eng vs Aus: వారెవ్వా స్టార్క్ వాటే స్టార్ట్.. తొలి రెండు బంతులకే రెండు వికెట్లు! (వీడియో)

మాంచెస్టర్: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న డిసైడర్ వన్డేలో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ శుభారంభాన్ని అందించాడు. తొలి రెండు బంతుల్లోనే వరుసగా రెండు వికెట్లు తీసి ఆతిథ్య జట్టును దెబ్బతీశాడు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ ఫస్ట్ ఓవర్ తొలి రెండు బంతులకే ఓపెనర్ జాసర్ రాయ్(0), వన్ డౌన్ బ్యాట్స్‌మన్ జోరూట్(0)ల వికెట్ కోల్పోయింది. స్టార్క్ వేసిన షార్ట్ లెంగ్త్ బాల్‌ను జాసన్ రాయ్ బ్యాక్ వార్డ్ పాయింట్ దిశగా ఆడాడు. కానీ ఆ దిశలో ఫీల్డింగ్ చేస్తున్న మ్యాక్స్‌వెల్ క్యాచ్ అందుకోవడంతో గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరాడు.
ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన ఫస్ట్ డౌన్ బ్యాట్స్‌మన్ జో రూట్(0) కూడా మరుసటి బంతికే ఎల్బీగా వెనుదిరిగాడు. దీంతో స్టార్క్‌కు హ్యాట్రిక్ చాన్స్ రాగా.. మూడో బంతి ఆడిన కెప్టెన్ మోర్గాన్ ఆ అవకాశం ఇవ్వలేదు. అయితే ఇంగ్లండ్ మాత్రం పరుగుల ఖాతా తెరవకుండానే కీలక రెండు వికెట్లు కోల్పోయింది. ఇక ఈ వీడియోను క్రికెట్ ఆస్ట్రేలియా 'అప్పుడే స్టార్క్ రాడార్ ఆన్ అయింది'అనే క్యాప్షన్‌తో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది.
చెలరేగిన బెయిర్ స్టో ..
0/2 క్లిష్టస్టితిలో ఇంగ్లండ్‌ను కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌తో కలిసి మరో ఓపెనర్ బెయిర్ స్టో గట్టెక్కించాడు. ఆచితూచి ఆడుతూ వీలు చిక్కిన బంతిని బౌండరీకి తరలించాడు.
హజల్ వుడ్ వేసిన రెండో ఓవర్ ఐదో బంతితో బౌండరీల ఖాతా తెరిచిన బెయిర్ స్టో.. ఐదో ఓవర్‌లో వరుసగా రెండు ఫోర్లు కొట్టి స్కోర్ బోర్డు వేగాన్ని పెంచాడు. ఇక కమిన్స్ వేసిన ఏడో ఓవర్ రెండో బంతిని అద్భుతంగా సిక్సర్‌గా మలిచాడు. మరోవైపు మోర్గాన్ కూడా ధాటిగా ఆడటం మొదలుపెట్టాడు. దీంతో ఇంగ్లండ్ 10 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్లకు 67 రన్స్ చేసింది.

దెబ్బతీసిన జంపా..
ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని ఆసీస్ స్పిన్నర్ ఆడమ్ జంపా కెప్టెన్ మోర్గాన్‌ను ఔట్ చేసి విడదీసాడు. మిడాఫ్ దిశగా భారీ షాట్ ఆడిన మోర్గాన్(23) స్టార్క్ చేతికి చిక్కి పెవిలియన్ చేరాడు. దీంతో మూడో వికెట్‌కు నమోదైన 67 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం క్రీజులోకి వికెట్ కీపర్ జోస్ బట్లర్ రాగా.. ఆసీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగుల వేగం తగ్గింది. ఈ క్రమంలో కమిన్స్ వేసిన 16వ ఓవర్ ఐదో బంతిని మిడ్ వికెట్ మీదుగా బౌండరీకి తరలించిన బెయిర్ స్టో.. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే కొద్దిసేపటికే జంపా బౌలింగ్‌లో బట్లర్(8) క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.

సామ్ బిల్లింగ్స్ సాయంతో..
క్రీజులోకి వచ్చిన సామ్ బిల్లింగ్స్ సాయంతో బెయిర్ స్టో ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపిస్తున్నాడు. ఈ ఇద్దరు నిలకడగా ఆడుతూ మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడుతున్నారు. ఇప్పటికే 10 ఫోర్లు బాదిన బెయిర్ స్టో సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతానికి 29 ఓవర్లలో ఇంగ్లండ్ నాలుగు వికెట్లకు 154పరుగులు చేసింది. క్రీజులో బెయిర్ స్టో(86), బిల్లింగ్స్(23) ఉన్నారు. ప్రస్తుతానికి స్టోక్స్, జంపా రెండేసి వికెట్లు తీశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications