Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

స్టార్ క్రికెటర్‌పై ఏప్రిల్ ఫూల్ ప్రాంక్.. మరీ వెర్రోడిని చేశారు!!

Watch Marnus Labuschagne fell prey to April Fools day prank courtesy Justin Langer and Tim Paine

సిడ్నీ: ఆస్ట్రేలియా యువ బ్యాట్స్‌మన్‌ మార్నస్‌ లబుషేన్‌ను ఆ జట్టు కోచ్ జస్టిన్ లాంగర్, టెస్ట్ కెప్టెన్ టిమ్ పైన్ ఓ ఆట ఆడుకున్నారు. ర్యాగింగ్ తరహాలో సరదాగా ప్రాంక్ చేసి లబుషేన్‌ను వెర్రోడిని చేశారు. అత్యంత దారుణంగా ఏప్రిల్ ఫూల్ చేశారు. అయితే ఇది ఈ ఏడాది చేసింది కాదు. గతేడాది ఈ వీడియోను రూపోందించగా.. ఆస్ట్రేలియా జట్టుపై డాక్యుమెంటరీ రూపొందించిన అమెజాన్ ప్రైమ్ తాజాగా ఈ ప్రాంక్‌ వీడియోను విడుదల చేసింది.

ఇంతకేం చేశారంటే..?

సౌతాఫ్రికాకు చెందిన మార్నస్ లబుషేన్‌ పదేళ్ల వయసులోనే ఆస్ట్రేలియాకు వలసవచ్చి ఇక్కడ క్రికెటర్‌గా ఎదిగాడు. గతేడాది ఆస్ట్రేలియా టెస్టు బ్యాట్స్‌మన్‌గా అరంగేట్రం చేసిన ఇతడిని ఏప్రిల్‌ ఫూల్స్‌ డే సందర్భంగా కెప్టెన్‌, కోచ్‌ ప్రాంక్‌ చేశారు. లబుషేన్‌ను ఆల్‌టైమ్ ఫేవరేట్ క్రికెటర్‌ ఎవరని ప్రశ్నించగా.. ఈ యువ ప్లేయర్.. సౌతాఫ్రికా మాజీ క్రికెటర్‌ జాక్వెస్‌ కలిస్‌ పేరు చెప్పాడు. దీంతో లాంగర్‌ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు నటించి అతడిని పక్కకు తీసుకెళ్లి హెచ్చరించారు. 'నువ్వు సమాధానం చెప్పేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆస్ట్రేలియా క్రికెటర్‌గా ఉంటూ కలిస్‌, డివిలియర్స్‌ పేర్లు చెప్పడం సరికాదు. ఇలా చెబితే మన ఆటగాళ్లకు నచ్చదు. ఇలాంటి వాటిని వారు తేలిగ్గా తీసుకోరు' అని బెదిరించాడు.

అది నిజమేనని అనుకున్న లబుషేన్‌.. 'సరే, అది నా ఉద్దేశం కాదు. ఇకపై ఇలాంటి ప్రశ్నలే ఎదురైతే ఏం చెప్పాలి?' అని కోచ్‌ను సలహా అడిగాడు. దీనికి లాంగర్‌ స్పందిస్తూ.. స్టీవ్‌స్మిత్‌ పేరు చెప్పమని సూచించాడు. ఆ తర్వాత టిమ్‌పైన్‌, జస్టిన్ లాంగర్‌ నవ్వుకుంటూ వచ్చి కెమెరాను చూస్తూ అందరికీ ఏప్రిల్‌ ఫూల్స్‌ డే శుభాకాంక్షలు చెప్పారు. అది తనమీద చేసిన ప్రాంక్‌ అని లబుషేన్‌కు అప్పుడు అర్థం అయ్యింది. దీంతో అవాక్కైన లబుషేన్ ఊపిరి పీల్చుకోగా.. లాంగర్, టిమ్ పైన్ నవ్వు ఆపుకోలేకపోయారు.

కంగారుల కొత్త లబ్ డబ్.. లబుషేన్

కంగారుల కొత్త లబ్ డబ్.. లబుషేన్

స్టీవ్ స్మిత్ నిషేధంతో జట్టులోకి వచ్చిన లబుషేన్‌కు మళ్లీ అతని రీ ఎంట్రీతోనే చోటు పోయింది. అదేందో కానీ మళ్లీ స్మిత్ గాయపడటంతోనే కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా అవకాశం లభించింది. ఇక అక్కడి నుంచి అతనికి వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుస శతకాలతో ఆస్ట్రేలియా క్రికెట్‌లో నిలకడకే మారుపేరుగా నిలిచాడు. ముఖ్యంగా యాషెస్ సిరీస్, ఆ తర్వాత పాకిస్థాన్‌తో జరిగిన టెస్ట్ సిరీస్ చెలరేగాడు. ఆ అద్భుత ప్రదర్శనతో భారత్‌తో జరిగిన 50 ఓవర్ల ఫార్మాట్ సిరీస్‌తో అంతర్జాతీయ వన్డేల్లోకి అరంగేట్రం చేశాడు.

సచిన్ మెచ్చిన ఆటగాడు..

సచిన్ మెచ్చిన ఆటగాడు..

ఇక లబుషేన్ ఆటను క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సైతం కొనియాడాడు. లబుషేన్ బ్యాటింగ్ చూస్తుంటే ఒకప్పటి తాను గుర్తుకు వస్తున్నానని కితాబిచ్చాడు.

‘యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో స్టీవ్ స్మిత్ గాయపడటంతో తొలి కంకషన్ ప్లేయర్‌గా క్రీజులోకి వచ్చిన మార్నస్ లబుషేన్ ఆటను నేను మా బావతో కలిసి చూశాను. రెండో ఇన్నింగ్స్‌లో అతని బ్యాటింగ్ 15 నిమిషాలు చూడగానే లబుషేన్ ప్రత్యేక ఆటగాడనే విషయం అర్థమైంది. అతనిలో ఏదో స్పెషల్ ఉందనిపించింది. ఫుట్‌వర్క్ అనేది ఫిజిక‌ల్‌కు సంబంధించినది కాదు. మానసికమైనది. మీ ఆలోచనలు సానుకూలంగా లేకుంటే మీ పాదాలు ముందుకు కదలవు. ఇదే లబుషేన్ మానసిక బలం ఏంటో తెలియజేస్తుంది. మానసికంగా దృడంగా లేకుంటే ఫుట్‌వర్క్ సరిగ్గా ఉండదు. మార్నస్ ఫుట్‌వర్క్ అత్యుద్భుతం. 'అని సచిన్ కొనియాడాడు.

Story first published: Thursday, April 2, 2020, 19:30 [IST]
Other articles published on Apr 2, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+