
దుబాయ్: చెన్నై సూపర్ కింగ్స్‌తో శుక్రవారం జరిగిన ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ శిఖర్ ధావన్ అందరి ధృష్టిని ఆకర్షించాడు. తొలుత తన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న ధావన్.. ఆ తర్వాత ఓ డిఫరెంట్ లుక్‌తో ఫీల్డింగ్‌కు దిగాడు. ఉబెర్ కూల్ గ్లాసెస్‌తో ఓ మోడల్‌లా కనిపించాడు. దీంతో అభిమానులతో పాటు కామెంటేటర్లు ఆ గ్లాసెస్‌పై మనసుపారేసుకున్నారు. విచిత్రం ఏంటంటే ఈ గ్లాసెస్ గురించి అన్ని భాషల కామెంటేటర్లు చర్చించడం.
ఇంగ్లీష్ కామెంటేటర్ కెవిన్ పీటర్సన్ అయితే ఆ గ్లాసెస్‌లో ధావన్‌ను చూడగానే తనకు కావాలని పట్టుబట్టాడు. దీంతో కామెంట్రీ బాక్స్‌లో నవ్వులు పూసాయి. ఇక తెలుగు కామెంట్రీ బాక్స్‌లో కళ్యాణ్.. ఈ గ్లాసెస్ గురించి ప్రస్తావిస్తూ సహచర కామెంటేటర్ వేణుపై సెటైర్లు వేశాడు. ఆ గ్లాసెస్‌తో అతన్ని చూడాలనుందని తెలిపాడు.
అలాగే ఐపీఎల్ తమ అధికారిక ట్విటర్‌లో ధావన్ గ్లాసెస్ పెట్టుకొని ఫీల్డింగ్ చేసిన క్లిప్‌ను షేర్ చేసింది. దీనికి 'హే ధావన్.. ఈ ఉబర్ కూల్ గ్లాసెస్ ఎక్కడ కొన్నావు?'ప్రశ్నించింది. దీనిపై అభిమానులు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. 'శిఖర్ ధావన్.. కూల్‌కు మరో అర్థం'అని ఒకరంటే.. ఈరోజు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఈ గ్లాసెస్‌కు ఇవ్వాల్సిందని మరొకరు కామెంట్ చేశారు.
ఈ మ్యాచ్‌లో ఢిల్లీ 44 పరుగులతో గెలుపొందిన విషయం తెలిసిందే. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' పృథ్వీ షా (43 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్‌తో 64 ) అర్ధ సెంచరీ సాధించాడు. రిషభ్ పంత్ (25 బంతుల్లో 5 ఫోర్లతో 37 నాటౌట్ ), శిఖర్ ధావన్ (27 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 35) రాణించారు. అనంతరం చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్లకు 131 పరుగులు చేసింది. డుప్లెసిస్ (35 బంతుల్లో 4 ఫోర్లు 43) టాప్ స్కోరర్‌గా నిలవగా... రబడా 3 వికెట్లు పడగొట్టాడు.