Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఈడెన్‌లో కోల్‌కతాతో మ్యాచ్: నాయర్ అద్భుత క్యాచ్ (వీడియో)

WATCH: Karun Nairs brilliant catch against kolkata at Eden gardens

హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో పంజాబ్ ఆటగాడు కరుణ్ నాయర్ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ కోల్‌కతాను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.

ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్

దీంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే ఓపెనర్ సునీల్ నరైన్ పెవిలియన్‌కు చేరాడు. పవర్‌ప్లే రెండో ఓవర్‌లోనే యువ స్పిన్నర్ ముజీబ్‌ను బౌలింగ్‌కు దించి కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ ఆశ్చర్యపరిచాడు.

దీంతో ముజీబ్ ఉర్ రెహ్మాన్ వేసిన రెండో ఓవర్ మూడో బంతికి సునీల్ నరేన్ డీప్ మిడ్ వికెట్ దిశగా నరైన్ భారీ షాట్ ఆడటంతో బౌండరీ లైన్ వద్ద డైవ్ చేస్తూ పంజాబ్ ఫీల్డర్ కరుణ్ నాయర్ అద్భుత క్యాచ్ అందుకున్నాడు. సునీల్ నరేన్ వికెట్ లభించడంతో పంజాబ్ జట్టు ఉత్సాహంతో సంబరాలు చేసుకుంది.

ఆ తర్వాత దూకుడుగా ఆడుతున్న రాబిన్ ఉతప్ప(34)ను 9వ ఓవర్లో అశ్విన్ పెవిలియన్‌కు చేర్చాడు. అశ్విన్ వేసిన బంతిని దూకుడుగా ఆడే క్రమంలో ఊతప్ప కూడా నాయర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇక, 10వ ఓవర్లో ముజీబ్ రెహ్మాన్ మరోసారి విజృంభించాడు. యువ ఆల్ రౌండర్ నితీష్ రాణా(3) వికెట్ కోల్పోయింది.

అంకిత్ రాజ్‌పుత్ అతడిని రనౌట్ చేశాడు. దీంతో కోల్‌కతాపై ఒత్తిడి పెరిగింది. మరో ఓపెనర్ క్రిస్‌లిన్ మాత్రం చాలా దూకుడుగా ఆడుతున్నాడు. ప్రస్తుతం 16 ఓవర్లకు గాను కోల్‌కతా 4 వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసింది. క్రీజులో ఆండ్రూ రసెల్ (1), దినేశ్ కార్తీక్ (31) పరుగులతో ఉన్నారు.

Story first published: Saturday, April 21, 2018, 18:22 [IST]
Other articles published on Apr 21, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+