For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs NAM: బుమ్రా కళ్లు చెదిరే క్యాచ్.. పోలా అదిరిపోలా!(వీడియో)

టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా కళ్లు చెదిరే ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. స్టన్నింగ్ యార్కర్లతో ప్రత్యర్థి బ్యాటర్ల వికెట్లను కూల్చే బుమ్రా.. ఫీల్డింగ్‌లోనూ అసాధారణ క్యాచ్‌తో ఔరా అనిపించాడు. తన కెరీర్‌లోనే ఇది బెస్ట్ క్యాచ్ అని చెప్పొచ్చు. 4.7 సెకన్ల వ్యవధిలోనే రియాక్ట్ అయ్యి.. సూపర్ డైవ్‌తో బంతిని అందుకున్నాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా నమీబియాతో గురువారం జరిగిన మ్యాచ్‌లో బుమ్రా ఈ అద్భుత క్యాచ్ అందుకున్నాడు.

అతని అసాధారణ ఫీల్డింగ్‌కు నమీబియా బ్యాటర్ మలాన్ క్రుగర్(5)నిరాశగా పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ క్యాచ్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. బుమ్రా క్యాచ్ పోలా.. అదిరిపోలా అని కొనియాడుతున్నారు.

అసలేం జరిగిందంటే..?

అక్షర్ పటేల్ వేసిన 13వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ మూడో బంతిని ఔట్ సైడ్ ఆఫ్ దిశగా వేయగా.. మలాన్ స్వీప్ షాట్ ఆడాడు. దాంతో బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి షార్ట్ ఫైన్ దిశగా గాల్లోకి లేచింది. బుమ్రా ఎడమ వైపు పరుగెత్తి డైవ్‌తో అద్భుతంగా అందుకున్నాడు. బుమ్రా స్టన్నింగ్ క్యాచ్ అందుకోవడం చూసి టీమిండియా డగౌట్‌లో నవ్వులు పూసాయి. ఎప్పుడు సీరియస్‌గా ఉండే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా నవ్వు ఆపుకోలేకపోయాడు.

Watch Jasprit Bumrah Pulls Off Sensational Diving Catch in India vs Namibia T20 World Cup 2026

ఇషాన్, హార్దిక్ ఊచకోత..

ఈ మ్యాచ్‌లో టీమిండియా 93 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 209 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్(24 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 61), హార్దిక్ పాండ్యా(27 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 52) హాఫ్ సెంచరీలతో రాణించారు. నమీబియా కెప్టెన్ ఎరాస్మస్(4/20) నాలుగు వికెట్లు తీయగా.. బెన్ షికోంగో, జేజే స్మిత్, బెర్నార్డ్ స్కాల్ట్జ్ తలో వికెట్ తీసారు.

అనంతరం నమీబియా 18.2 ఓవర్లలో 116 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తీ(3/7) మూడు వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా(2/21), అక్షర్ పటేల్(2/20) రెండేసి వికెట్లు పడగొట్టారు.

Story first published: Thursday, February 12, 2026, 22:36 [IST]
Other articles published on Feb 12, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+