బ్రహ్మానందం తరహాలో టీమిండియా జెర్సీతో అభిమాని రచ్చ.. పడిపడి నవ్విన సిరాజ్.. (వీడియో)

లండన్: భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఇంగ్లండ్‌కి చెందిన ఓ అభిమాని టీమిండియా జెర్సీతో ఆకస్మాత్తుగా మైదానంలో వచ్చి కాసేపు రచ్చరచ్చ చేశాడు. దాంతో అక్కడ నవ్వులు పూసాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. అసలేం అయిందంటే..మ్యాచ్‌లో మూడో రోజైన శనివారం ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ వికెట్ కోసం భారత బౌలర్లు తీవ్రంగా శ్రమిస్తుండగా.. సడన్ గ్రౌండ్‌లోకి జారో అనేఅభిమాని టీమిండియా జెర్సీలో మైదానంలోకి దూసుకొచ్చాడు.
బ్రహ్మానందం తరహాలో..
అతన్ని భద్రతా సిబ్బంది ఆటగాళ్ల వద్దకి వెళ్లకుండా నియత్రించేందుకు ప్రయత్నించగా.. జారో రిక్వెస్ట్ చేసిన తీరు నవ్వులు పూయించింది. జారో రియాక్షన్స్‌ను దగ్గర నుంచి చూసిన భారత పేసర్ మహ్మద్ సిరాజ్ పడిపడి నవ్వుకున్నాడు. మైదానంలో జారో చర్యలు తెలుగు సినిమాల్లోని బ్రహ్మానందాన్ని తలపించాయి. మైదానంలోకి వచ్చిన జారోని భద్రతా సిబ్బంది.. వెలుపలికి వెళ్లాల్సిందిగా సూచించారు. అయితే జారో మాత్రం తాను టీమిండియా ప్లేయర్ అని జెర్సీపై ఉన్న బీసీసీఐ లోగోని చూపిస్తూ.. మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యాడు.
కమాన్ లెట్స్ ప్లే అంటూ..
దాంతో.. మ్యాచ్‌ను అంపైర్లు తాత్కాలికంగా నిలిపివేశారు. కానీ.. సదరు అభిమాని మాత్రం చప్పట్లు కొడుతూ 'కమాన్ లెట్స్ ప్లే బాయ్స్' అంటూ భారత ఆటగాళ్లని మ్యాచ్‌కు సిద్ధం చేయబోయాడు. అదే సమయంలో జారోకి సమీపానికి వెళ్లిన జడేజా.. అతని రియాక్షన్‌ని చూసి నెమ్మదిగా పక్కకి జరిగి వెళ్లిపోయాడు. భద్రతా సిబ్బంది వారిస్తున్నా జారో మాత్రం తొలుత వెనక్కి తగ్గలేదు. తనకి సమీపంలో ఉన్న మహ్మద్ సిరాజ్ వైపు చూసి అతని తరహాలో సిగ్నేచర్ సైగలు చేశాడు.

పడిపడి నవ్విన సిరాజ్..
అయితే.. అప్పటికే అక్కడికి చేరుకున్న నలుగురు భద్రతా సిబ్బంది బలవంతంగా అతన్ని మైదానం వెలుపలికి తరలించారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ ఏంటట అతని గోల..? అని సిరాజ్‌ని ప్రశ్నించగా.. మ్యాచ్ ఆడతాడట అని సిరాజ్ పడిపడి నవ్వుతూ సమాధానం చెప్పాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఇంగ్లండ్‌కు అభిమాని ఇలా మైదానంలోకి వచ్చి టీమిండియా తరఫున మ్యాచ్ ఆడతాననడంపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. నవ్వులు పూయించే మీమ్స్‌ను ట్రెండ్ చేస్తున్నారు.

జోరూట్ జోరు..
ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌కు 27 పరుగుల స్వల్ప తొలి ఇన్నింగ్స్ దక్కింది. ఓవర్‌నైట్ స్కోరు 119/3తో ఆట కొనసాగించిన ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 391 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ జో రూట్ (321 బంతుల్లో 18 ఫోర్లతో 180 నాటౌట్) వరుసగా రెండో టెస్టులోనూ సెంచరీ సాధించగా... జానీ బెయిర్‌స్టో (107 బంతుల్లో 7 ఫోర్లతో 57 ) రాణించాడు. సిరాజ్‌కు 4, ఇషాంత్‌కు 3 వికెట్లు దక్కాయి. మూడో రోజు ఆట చివరి ఓవర్ చివరి బంతికి అండర్సన్‌ను షమీ బౌల్డ్ చేయడంతో ఇంగ్లండ్ ఆట ముగిసింది.
అయితే ఇంగ్లండ్‌ను మరింత భారీ స్కోరు చేయకుండా అడ్డుకోగలగడమే మూడో రోజు ఆటలో భారత్‌కు ఊరటనిచ్చే అంశం. తొలి రెండు సెషన్లలో ఇంగ్లండ్ జోరు చూపించినా... చివరి సెషన్లో చెలరేగిన భారత బౌలర్లు ప్రత్యర్థిని కట్టడి చేయగలిగారు. సహచరుల నుంచి చెప్పుకోదగ్గ సహకారం లభించకపోయినా కెప్టెన్ జో రూట్ అద్భుత బ్యాటింగ్‌తో నిలవడం శనివారం ఆటలో హైలైట్ కాగా... టీమిండియా తరఫున సిరాజ్, ఇషాంత్ తమ ముద్ర చూపించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications