For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

T20 World Cup 2022: బాప్‌రే.. గ్లేన్ ఫిలిప్స్ క్యాచ్ ఆఫ్ ది టోర్నమెంట్.. అచ్చం చేప పిల్లలానే డైవ్! (వీడియో)

Watch Glenn Phillips Takes T20 World Cup 2022 Catch Of The Tournament

సిడ్నీ: టీ20 ప్రపంచకప్ 2022‌లో న్యూజిలాండ్ ప్లేయర్ గ్లేన్ ఫిలిప్స్ సూపర్ ఫీల్డింగ్‌తో అదరగొట్టాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో అసాధారణ క్యాచ్ పట్టి ఔరా అనిపించాడు. అచ్చం చేప పిల్లలానే డైవ్ చేసి సహచర ఆటగాళ్లతో పాటు టీవీల ముందున్న అభిమానులను సంభ్రమాశ్చర్యానికి గురి చేశాడు. ఫిలిప్స్ సూపర్ మ్యాన్ ఫీల్డింగ్‌కు ఆస్ట్రేలియా విధ్వంసకర ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినీస్(7) నిరాశగా పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారిందిఅసలేం జరిగిందంటే.. మిచెల్ సాంట్నర్ వేసిన ఇన్నింగ్స్ 9వ ఓవర్‌లో ఈ ఫిల్డీంగ్ విన్యాసం చోటు చేసుకుంది. ఈ ఓవర్ రెండో బంతిని సాంట్నర్ ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా.. స్లోగా వేయగా.. స్టోయినీస్ కవర్ డ్రైవ్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకొని గాల్లోకి లేచింది. డీప్ మిడ్ వికెట్ దిశగా ఉన్న ఫిలిప్స్ అద్భుతంగా రన్నింగ్ చేసి సూపర్ డైవ్‌తో బంతిని అందుకున్నాడు. ఫిలిప్స్ కాకుండా మరే ఏ ఫీల్డర్ ఉన్నా.. ఆ క్యాచ్ నేలపాలయ్యేది. ప్రపంచకప్‌ 2022లో ఇది బెస్ట్ క్యాచ్‌గా నిలవనుంది. ఈ వీడియోను చూసిన అభిమానులు అచ్చం చేప పిల్లలానే డైవ్ చేశాడని గ్లేన్ ఫిలిప్స్‌ను కొనియాడుతున్నారు.

ఇక 201 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. 82 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. క్రీజులో గ్లేన్ మ్యాక్స్‌వెల్(28 బ్యాటింగ్), ప్యాట్ కమిన్స్(5 బ్యాటింగ్) ఉన్నారు. మ్యాచ్ దాదాపు న్యూజిలాండ్ చేతిలోకి వెళ్లింది. ఈ మ్యాచ్ గెలిస్తే 11 ఏళ్ల తర్వాత ఆసీస్ గడ్డపై ఆ జట్టుపై విజయం సాధిస్తుంది. 2011 నుంచి న్యూజిలాండ్ ఏ ఫార్మాట్‌లోనూ ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపై ఓడించలేకపోయింది.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 200 పరుగులు చేసింది. ఓపెనర్ డేవాన్ కాన్వే(58 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 92 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీ సాధించగా.. ఫిన్ అలెన్(16 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో) దుమ్మురేపాడు. జేమ్స్ నీషమ్(13 బంతుల్లో 2 సిక్స్‌లతో 26 నాటౌట్) విలువైన పరుగులు చేశాడు. ఆసీస్ బౌలర్లలో హజెల్ వుడ్ రెండు వికెట్లు తీయగా.. జంపా ఓ వికెట్ పడగొట్టాడు.

Story first published: Saturday, October 22, 2022, 16:01 [IST]
Other articles published on Oct 22, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+