ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా భారత్, నమీబియా మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. టీమిండియా బ్యాటింగ్ సందర్భంగా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను నమీబియా కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ తోసేసాడు. అనంతరం పుషప్స్ తీసి నవ్వులు పూయించాడు. ఎరాస్మస్ చర్యతో హార్దిక్ కూడా నవ్వు ఆపుకోలేకపోయాడు. ఈ సరదా ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ కాగా.. నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
గెర్హార్డ్ ఎరాస్మస్ వేసిన 12 ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ ఆఖరి బంతిని శివమ్ దూబే నాన్‌స్ట్రైకర్ వైపు ఆడగా.. ఎరాస్మస్ డైవ్ చేశాడు. అయితే అతను హార్దిక్ పాండ్యా కాళ్లలో పడటంతో ఇద్దరు కిందపడిపోయాడు. తనపై హార్దిక్ పడిపోగా.. ఎరాస్మస్ పుషప్స్ తీసాడు. దాంతో అక్కడ నవ్వులు పూసాయి.

హార్దిక్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఈ మ్యాచ్‌లో టీమిండియా 93 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 209 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్(24 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 61), హార్దిక్ పాండ్యా(27 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 52) హాఫ్ సెంచరీలతో రాణించారు. నమీబియా కెప్టెన్ ఎరాస్మస్(4/20) నాలుగు వికెట్లు తీయగా.. బెన్ షికోంగో, జేజే స్మిత్, బెర్నార్డ్ స్కాల్ట్జ్ తలో వికెట్ తీసారు
అనంతరం నమీబియా 18.2 ఓవర్లలో 116 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు స్టీన్ కాంప్(29), జాన్ ఫ్రిలింక్(22) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తీ(3/7) మూడు వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా(2/21), అక్షర్ పటేల్(2/20) రెండేసి వికెట్లు పడగొట్టారు. భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తీ ధాటికి ఐర్లాండ్ బ్యాటర్లు తేలిపోయారు.