Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మళ్లీ షూరూ చేసిన డేవిడ్ వార్నర్.. ఈ సారి బాలీవుడ్‌ను షేక్ చేశాడుగా! (వీడియో)

Watch David Warner As Shah Rukh Khan and Hrithik Roshan In This Viral Video

సిడ్నీ : ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్‌మన్ డేవిడ్‌ వార్నర్‌ మళ్లీ మొదలెట్టాడు. కరోనా సమయంలో టాలీవుడ్ సినిమాల్లోని పాటలు, డైలాగ్స్‌ను ఇమిటేట్ చేస్తూ అభిమానులను అలరించిన ఈ విధ్వంసకర క్రికెటర్.. ఇంజ్యూరీ బ్రేక్‌లో మరోసారి తనదైన స్పూఫ్ వీడియోలతో ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం గజ్జ గాయంతో బాధపడుతున్న వార్నర్ భారత్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. రెండో వన్డే సందర్భంగా ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డ వార్నర్ ఆ తర్వాత మూడో వన్డే, మూడు టీ20ల సిరీస్, ఫస్ట్ టెస్ట్‌కు దూరమయ్యాడు. గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో సెకండ్ టెస్ట్ ఆడటంపై కూడా డౌట్‌గా మారింది.

ఇది పక్కన బెడితే ఈ ఇంజ్యూరీ బ్రేక్‌ను కూడా ఆ ఆసీస్ ఆటగాడు ఆస్వాదిస్తున్నాడు. తనదైన స్పూఫ్ వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. అయితే లాక్‌డౌన్ టాలీవుడ్‌ను ఫాలో అయిన డేవిడ్ భాయ్.. ఇప్పుడు బాలీవుడ్ మీద పడ్డాడు. తాజాగా బాలీవుడ్‌ బాద్‌ షా షారుక్‌ ఖాన్‌, హృతిక్‌ రోషన్‌, ఆమిర్‌ ఖాన్‌‌లతో ఉన్న స్పూఫ్ వీడియోలను ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. ప్రస్తుతం ఇవి నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. ఏఐ ఫేస్‌యాప్‌ ఉపయోగించి ఈ వీడియోలను రూపొందించిన వార్నర్‌.. డాన్‌-2 సినిమాలో షారుక్‌లా కనిపించాడు. అచ్చం అతనిలా స్టంట్స్‌ చేస్తూ యాక్షన్‌ సీక్వెన్స్‌లో ఇరగదీశాడు. ' ఇంత హింస నేను ఎప్పుడూ చేయలేనని.. కానీ ఈ హీరో ఎవరో మీకు అర్థమై ఉంటుంది'అని క్యాప్షన్‌‌గా పేర్కొన్నాడు.

దాంతో పాటు హృతిక్‌ రోషన్ కీలకపాత్ర పోషించిన జోదా అక్బర్‌ సినిమాలోని అతని పాత్రను కూడా ఇమిటేట్ చేశాడు. డాన్‌-2 సినిమాకు దర్శకత్వం వహించిన ఫర్హాన్‌ అక్తర్‌ డేవిడ్ వార్నర్‌ వీడియోపై స్పందించాడు. 'బాలీవుడ్‌కు కొత్త డాన్‌ వచ్చాడు. అతనే డేవిడ్‌ వార్నర్‌.. సారీ డేవిడ్‌ ఖాన్‌'అంటూ సరదాగా కామెంట్‌ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. గతంలో వార్నర్ వీడియోలకు టాలీవుడ్ హీరోలు, డైరెక్టర్లు కూడా స్పందించిన విషయం తెలిసిందే.

Story first published: Wednesday, December 23, 2020, 16:05 [IST]
Other articles published on Dec 23, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+