Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

క్రిస్ గేల్ ‘ఫ’న్నింగ్ క్యాచ్‌.. నెట్టింట నవ్వులే నవ్వుల్! (వైరల్ వీడియో)

Watch Chris Gayle Funny Catch in Kings XI Punjab Training Camp

దుబాయ్: వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ప్లేయర్ క్రిస్ గేల్ అద్భుత క్యాచ్‌తో ఔరా అనిపించాడు. అదేంటి ఐపీఎల్ 2020 సీజన్ ఆరంభం కాకముందే రస్సెల్ క్యాచ్ పట్టడం ఏంటనుకుంటున్నారు. అవును ప్రస్తుతం దుబాయ్‌లో కింగ్స్ పంజాబ్ ట్రైనింగ్ క్యాంప్‌లో ఉన్న ఈ విండీస్ వీరుడు హుషారుగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఫీల్డింగ్ ప్రాక్టీస్ సెషన్‌లో భాగంగా.. బౌండరీ లైన్ వద్ద క్యాచ్‌లు సాధన చేశాడు. ఈ సందర్భంగా ఓ బంతిని అందుకొని అద్భుత క్యాచ్ తరహా బిల్డప్ ఇచ్చాడు. బౌండరీ దాటే బంతిని అందుకున్న గేల్.. దాన్ని గాల్లోకి ఎగిరేసి మళ్లి వచ్చి అడ్డుకున్నట్లు సీన్ ఇచ్చాడు. ఈ వీడియోను కింగ్స్ పంజాబ్ తమ అధికారిక ట్విటర్ హ్యాండిల్‌‌లో షేర్ చేయగా.. నెట్టింట వైరల్ అయింది.

గేల్ పట్టిన క్యాచ్ సిక్స్ అని ఎవరనుకుంటున్నారో కామెంట్ చేయండని కింగ్స్ పంజాబ్ క్యాప్షన్‌గా రాసుకొచ్చింది. దీనికి అభినులు ఫన్నీ కామెంట్లతో స్పందిస్తున్నారు. 'మీరు మీ బిల్డప్ తగలయ్యా.. ముందు ఈ ఏషాలు ఆపి టైటిల్ ఎలా గెలవాలో ఆలోచించండి' అంటూ చురకలంటిస్తున్నారు. ఇంకొందరు మైదానంలో ఇలాంటి క్యాచ్‌లు పట్టకపోతే మీకుంటుందని ఇంకొకరు కామెంట్ చేస్తున్నారు.

ఇక ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 125 మ్యాచ్‌లు ఆడిన గేల్ 151.02 సగటుతో 4484 రన్స్ చేశాడు. అంతేకాకుండా అత్యధిక వ్యక్తిగత స్కోర్ 175 నాటౌట్ రికార్డు కలిగి ఉన్నాడు. 2013లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున.. పుణె వారియర్స్‌పై ఈ రికార్డును నెలకొల్పాడు. ఈ సీజన్‌లో కింగ్స్ పంజాబ్ జట్టును కేఎల్ రాహుల్ నడిపించనుండగా.. అనిల్ కుంబ్లే హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. 12 సీజన్లుగా ఒక్క టైటిల్ కూడా గెలవని ఆ జట్టు ఈ సారి ఎలాగైనా ఆ నిరీక్షణకు తెరదించాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతుంది. సెప్టెంబర్ 19న ఈ క్యాష్ రిచ్ లీగ్‌కు తెరలేవనుండగా.. కింగ్స్ పంజాబ్ తమ తొలి మ్యాచ్ దుబాయ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో సెప్టెంబర్ 20న ఆడనుంది.

Story first published: Tuesday, September 8, 2020, 13:02 [IST]
Other articles published on Sep 8, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+