For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మీడియా సమావేశంలో కేన్‌ మామకు బిగ్ సర్‌ప్రైజ్..! (వీడియో)

Watch BJ Watling Crashes Presser To Get Kane Williamsons Autograph

క్రైస్ట్‌చర్చ్: న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌కు సహచర ఆటగాడు బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. పాకిస్తాన్‌‌తో బుధవారం ముగిసిన రెండో టెస్ట్‌లో కివీస్ ఇన్నింగ్స్ 176 పరుగుల తేడాతో భారీ విజయాన్నందుకుంది. ఈ గెలుపుతో రెండు టెస్ట్‌ల సిరీస్‌ను 2-0తో క్లీన్ స్వీప్ చేసి టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో డబుల్ సెంచరీతో రాణించి విజయంలో కీలక పాత్ర పోషించిన కేన్ మామకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వరించింది. ఇక మ్యాచ్ అనంతరం విలియమ్సన్‌ మీడియాతో మాట్లాడుతున్న సమయంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.

 బిత్తరపోయిన కేన్ మామ..

బిత్తరపోయిన కేన్ మామ..

మీడియా సమావేశం మధ్యలో కివీస్ సహచర ప్లేయర్ బీజే వాట్లింగ్‌ విలియమ్సన్‌ దగ్గరకు వచ్చి బిగ్ ఫ్యాన్ ఆటోగ్రాఫ్‌ ఇవ్వాలని కోరాడు. ఈ ఊహించని సంఘటనతో కేన్ మామ బిత్తరపోయాడు. ఆ వెంటనే తేరుకొని చిరునవ్వుతో వాట్లింగ్‌ తెచ్చిన టీ షర్ట్‌పై తన సంతకాన్ని చేశాడు. ఈ వీడియోనూ న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తమ అధికారిక ట్విటర్‌లో అభిమానులతో పంచుకుంది. 'పోస్ట్‌ మ్యాచ్‌ కాన్ఫరెన్స్‌ సందర్భంగా సీరియస్‌గా మాట్లాడుతున్న సమయంలో తన సహచర ఆటగాడు ఆటోగ్రాఫ్‌ అడుగుతాడని విలియమ్సన్‌ ఏమాత్రం ఊహించి ఉండడంటూ' క్యాప్షన్‌గా పేర్కొంది. దాంతో ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది. ఈ వీడియోను ఫ్యాన్‌బాయ్ మూమెంట్ అంటూ ఐసీసీ కూడా పంచుకుంది.

కేన్ డబుల్.. పాక్ ట్రబుల్

కేన్ డబుల్.. పాక్ ట్రబుల్

ఇక రెండో టెస్టులో తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 297 పరుగులకు ఆలౌటవ్వగా.. న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ను 158.5 ఓవర్లలో 6 వికెట్లకు 659 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. దాంతో ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 362 పరుగుల భారీ ఆధిక్యాన్ని అందుకుంది. తొమ్మిది గంటల పాటు మారథాన్‌ ఇన్నింగ్స్‌ ఆడిన కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ తన కెరీర్‌లో నాలుగో డబుల్‌ సెంచరీ ( 28 ఫోర్లతో 238) సాధించాడు. అంతేకాకుండా టెస్టుల్లో 7 వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు. ఇక హెన్రీ నికోల్స్‌ (18 ఫోర్లు, సిక్స్‌‌తో 157), డారిల్‌ మిచెల్‌ (8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 102 నాటౌట్‌ ) కూడా శతకాలు బాదడంతో కివీస్‌ భారీ స్కోరును అందుకుంది.

 జెమీసన్ 10

జెమీసన్ 10

విలియమ్సన్, నికోల్స్‌ నాలుగో వికెట్‌కు 369 పరుగులు జోడించారు. 362 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన పాకిస్థాన్‌ కివీస్‌ బౌలర్‌ కైల్‌ జేమిసన్‌ దాటికి 186 పరుగులకే చేతులెత్తేసి ఘోర పరాజయాన్ని మూట గట్టుకుంది. అజార్‌ అలీ(37), జాఫర్‌ గౌహర్‌(37) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఇక ఈ మ్యాచ్‌లో జెమీసన్‌ మొత్తంగా 10 వికెట్లు తీసి సత్తా చాటాడు.

టెస్టు క్రికెట్‌ చరిత్రలోనే తొలిసారి

బుధవారం ఐసీసీ విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్‌ 118 పాయింట్లతో అగ్ర స్థానంలో నిలిచింది. భారత్‌, ఆస్ట్రేలియా వంటి టాప్ జట్లను వెనక్కినెట్టి కివీస్ అగ్రస్థానానికి ఎగబాకింది. ప్రస్తుతం న్యూజిలాండ్ (118)‌ మొదటి స్థానంలో ఉండగా.. ఆస్ట్రేలియా (116)‌, భారత్ (114) రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఇంగ్లండ్ (106), సౌతాఫ్రికా (96) టాప్-5లో ఉన్నాయి. పాకిస్థాన్‌ 82 పాయింట్లతో ఏడవ స్థానంలో ఉంది. అయితే కివీస్ అగ్రస్థానాన్ని అందుకోవడం తమ టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి. డానియల్ వెటోరి, స్టీఫెన్ ఫ్లెమింగ్, రాస్ టేలర్, బ్రెండన్ మెక్కల్లమ్ వంటి దిగ్గజ సారథులకు సాధ్యం కానీ రికార్డు కేన్ విలియమ్సన్‌ అందుకున్నాడు.

Story first published: Wednesday, January 6, 2021, 20:28 [IST]
Other articles published on Jan 6, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+