Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: పాపం బెన్ స్టోక్స్.. బాక్స్ బద్దలైంది! (వీడియో)

భారత్‌తో లార్డ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌కు తాకరాని చోట బంతి తాకింది. ఈ దెబ్బకు స్టోక్స్.. క్రీజులోనే కుప్పకూలాడు. నొప్పిని భరించలేక.. నేలపై పడుకున్నాడు. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ సందర్భంగా మహమ్మద్ సిరాజ్ వేసిన 29వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

సిరాజ్ వేసిన ఈ ఓవర్ ఆఖరి బంతి లో బౌన్స్‌గా దూసుకెళ్లి బెన్ స్టోక్స్ ప్రైవేట్ పార్ట్‌కు బలంగా తాకింది. ఆ బంతి ధాటికి స్టోక్స్ నేలకూలాడు. నొప్పితో విలవిలలాడాడు. ఫిజియోల సాయంతో ప్రథమ చికిత్స తీసుకున్న స్టోక్స్.. ఆ తర్వాత బ్యాటింగ్ కొనసాగించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. నెటిజన్లు పాపం స్టోక్స్ అంటూ కామెంట్ చేస్తున్నారు.

Watch Ben Stokes Struck in Groin by Mohammed Siraj s Delivery During Lord s Test

2/0 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ 87 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్, నితీష్ కుమార్ రెడ్డి, ఆకాశ్ దీప్ నిప్పులు చెరగడంతో ఇంగ్లండ్ తొలి సెషన్‌లోనే నాలుగు వికెట్లు కోల్పోయింది. బెన్ డకెట్(12), ఓలీ పోప్(4)లను సిరాజ్ పెవిలియన్ చేర్చితే జాక్ క్రాలీ(22)ని నితీష్ కుమార్ రెడ్డి ఔట్ చేశాడు. హ్యారీ బ్రూక్‌(23)ను ఆకాశ్ దీప్ క్లీన్ బౌల్డ్ చేశాడు. క్రీజులోకి వచ్చిన బెన్ స్టోక్స్, జో రూట్ ఆచితూచి ఆడుతున్నారు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 387 పరుగులకు ఆలౌటైంది. అనంతరం భారత్ కూడా 387 పరుగులే చేసింది. దాంతో ఏ జట్టుకు ఆధిక్యం దక్కలేదు.

Story first published: Sunday, July 13, 2025, 19:11 [IST]
Other articles published on Jul 13, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+