Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పాపం డామ్ బెస్.. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో చేధు అనుభవం.. కోహ్లీ పనే అంటున్న ఫ్యాన్స్! (వీడియో)

 Watch Advertising board falls on Dom Bess head during press conference

చెన్నై: ఇంగ్లండ్ యువ స్పిన్నర్ డామ్ బెస్‌కు చేధు అనుభవం ఎదురైంది. భారత్‌తో జరుగుతున్న ఫస్ట్ టెస్ట్‌‌లో డామ్ బెస్ నాలుగు వికెట్లతో అదరగొట్టాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీతోపాటు పుజారా, పంత్, అజింక్యా రహానేలను ఔట్ చేసి భారత్ పతనాన్ని శాసించాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ ఇంగ్లండ్ యువ స్పిన్నర్ మీడియాతో మాట్లాడాడు. అయితే డామ్ బెస్ మాట్లాడుతుండగా.. అతని వెనుకాల ఉన్న అడ్వర్టయిజింగ్ బోర్డు మీదపడింది.

ఈ ఊహించని ఘటనతో షాక్‌కు గురైన డామ్ బెస్.. అలాగే తన ఇంటర్వ్యూను కొనసాగించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. అభిమానులు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఆ బోర్డు వెనుకాల విరాట్ కోహ్లీ ఉన్నట్లున్నాడని ఒకరంటే.. ఇదంతా ఏసీసీ సిమెంట్ ప్రమోషన్ కుట్రని మరొకరు కామెంట్ చేస్తున్నారు.

ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వికెట్ తీయడం.. తన కెరీర్‌లో అత్యత్తమమని డామ్ బెస్ చెప్పుకొచ్చాడు. మూడో రోజు ఆటలో కూడా తామే ఆధిపత్యం చెలాయించామని తెలిపాడు. రాబోయే రెండు రోజుల్లో పిచ్‌పై మరింత టర్న్ ఉండే అవకాశం ఉందన్నాడు. సౌతాఫ్రికా, శ్రీలంక పర్యటనల్లో 5 వికెట్ల ఘనతను అందుకున్నా.. తాజా టెస్ట్ మ్యాచ్ ప్రదర్శనే తనకు అత్యుత్తమమని ఈ ఇంగ్లండ్ స్పిన్నర్ చెప్పుకొచ్చాడు. విరాట్ వికెట్ కోసం తాను ఎలాంటి మ్యాజికల్ బాల్ వేయలేదన్నాడు. గుడ్ ఏరియాలో 10,15 బాల్స్ వేయడం వల్లే విరాట్ వికెట్ దక్కిందని తెలిపాడు.

'విరాట్ కోహ్లీ లాంటి వరల్డ్ క్లాస్ ప్లేయర్లను ఔట్ చేయడం అద్భుతం. అతను అసాధారణమైన ఆటగాడు. నేను నేర్చుకున్నది మ్యాచ్‌లో చూపెట్టా. నా వయసు 23 ఏళ్లే. ఇంకా చాలా దూరం ట్రావెల్ చేయాల్సి ఉంది. ఎత్తుపల్లాలు ఉంటాయి. కోహ్లీ వికెట్ నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. మ్యాచ్ మధ్యలో వికెట్ల గురించి ఎక్కువగా ఆలోచించను. చాలా హార్డ్ వర్క్ చేసి ఇక్కడికి వచ్చాం. సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ కోహ్లీని ఔట్ చేసేందుకు ప్రయత్నిస్తా'అని బెస్ పేర్కొన్నాడు.

Story first published: Monday, February 8, 2021, 11:25 [IST]
Other articles published on Feb 8, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+