Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఉత్కంఠగా మారితే.. రిషభ్ పంత్ భయపడుతున్నాడు: వసీం జాఫర్

 Wasim Jaffer says When the match gets tight, Rishabh Pant panics

న్యూఢిల్లీ: మ్యాచ్ ఉత్కంఠగా మారితే టీమిండియా తాత్కలిక సారథి రిషభ్ పంత్ భయపడుతున్నాడని మాజీ ఓపెనర్ వసీం జాఫర్ అన్నాడు. ఆ భయంతోనే మైదానంలో కెప్టెన్‌గా అనవసర తప్పిదాలు చేస్తున్నాడని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతున్న ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌తో రిషభ్ పంత్ అనుకోకుండా టీమిండియా సారథ్య బాధ్యతలు అందుకున్నాడు. రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ గైర్హాజరీలో కేఎల్ రాహుల్‌ను సారథిగా ఎంపిక చేయగా... అతని చివరి నిమిషంలో గాయంతో జట్టుకు దూరమయ్యాడు. దాంతో పంత్‌కి సారథిగా అవకాశం దక్కింది.

 పంత్ వైఫల్యం..

పంత్ వైఫల్యం..

అయితే, అందివచ్చిన అవకాశాన్ని పంత్‌ సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. అతని సారథ్యంలో ఆడిన తొలి రెండు టీ20ల్లో భారత్‌ ఓటమిపాలైంది. కెప్టెన్ పంత్‌ సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లే టీమిండియా ఓటములు చవిచూస్తోందని పలువురు విమర్శించారు. తొలి టీ20లో స్పిన్నర్‌ యుజువేంద్ర చాహల్‌తో మ్యాచ్‌ చివరి ఓవర్‌ ముందు వరకు రెండు ఓవర్లు మాత్రమే బౌలింగ్‌ చేయించడంతో పలువురు మాజీ క్రికెటర్లతోపాటు అభిమానులు పంత్‌ కెప్టెన్సీ తీరుపై విమర్శలు గుప్పించారు.

తప్పుడు నిర్ణయాలతో..

తప్పుడు నిర్ణయాలతో..

అంతేకాకుండా, రెండో టీ20లో ఉమ్రాన్‌ మాలిక్‌, రవి బిష్ణోయ్‌లను తుది జట్టులోకి తీసుకోకపోవడాన్ని కూడా తప్పుబడుతున్నారు. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో దినేశ్ కార్తీక్‌ కంటే ముందు అక్షర్‌ పటేల్‌ను పంపడాన్ని కూడా తప్పుబట్టారు. రెండో టీ20లో మిడిల్‌, డెత్ ఓవర్లలో పంత్‌ తన బౌలర్లను సరిగ్గా ఉపయోగించుకోలేదు. ఈ నేపథ్యంలో పంత్‌ కెప్టెన్సీ గురించి భారత మాజీ ఆటగాడు వసీం జాఫర్ మాట్లాడాడు. మ్యాచ్‌ ఉత్కంఠగా మారినప్పుడు రిషభ్ పంత్‌ భయపడుతున్నాడని జాఫర్‌ అభిప్రాయపడ్డాడు.

 అనుభవంతో..

అనుభవంతో..

పంత్‌ తన వ్యూహాల్లో మార్పులు చేస్తాడని, ఒకవేళ వాటి అమలు సరిగ్గా జరగకపోతే తొందరగా భయాందోళనలకు గురవుతున్నాడని జాఫర్‌ పేర్కొన్నాడు. 'పంత్‌ ఎన్ని ఎక్కువ మ్యాచ్‌లకు సారథ్యం వహిస్తే అంత మెరుగ్గా తయారవుతాడు. కానీ, ప్రస్తుతం అతను మ్యాచ్‌ ఉత్కంఠభరితంగా మారినప్పుడు కొంచెం భయపడుతున్నాడు' అని వసీం జాఫర్ వివరించాడు.

Story first published: Tuesday, June 14, 2022, 22:19 [IST]
Other articles published on Jun 14, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+