Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Wasim Jaffer: కోహ్లీ గైర్హాజరే టీమిండియా కొంపముంచింది! రాహుల్ బదులు రహానే జట్టును నడిపించాల్సింది!

 Wasim Jaffer says ‘India missed Virat Kohli the ‘Captain’, Rahane should have led in his absence’
IND VS SA: Reasons For India’s Defeat At Wanderers, Missing Kohli | Oneindia Telugu

న్యూఢిల్లీ: సౌతాఫ్రికా గడ్డపై మూడు దశాబ్దాలుగా ఊరిస్తున్న టెస్ట్ సిరీస్‌ విజయం.. టీమిండియాకు చిక్కినట్లే చిక్కి చేజారింది. జోహన్నెస్‌బర్గ్ వేదికగా గురువారం ముగిసిన రెండో టెస్ట్‌లో సౌతాఫ్రికా 7 వికెట్ల తేడాతో గెలుపొంది సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఈ మ్యాచ్‌లో గెలిచి చరిత్ర సృష్టించే సువర్ణవకాశాన్ని టీమిండియా చేజేతులా చేజార్చుకుంది. పేలవ బ్యాటింగ్‌, పసలేని బౌలింగ్‌తో ఓటమికి తల వంచింది. దాంతో సిరీస్ ఫలితం కోసం మూడో టెస్ట్ వరకు వేచి చూడాల్సి పరిస్థితి ఏర్పడింది. అయితే అచ్చొచ్చిన వాండరర్స్ మైదానంలో భారత ఓటమికి ప్రధాన కారణం రెగ్యూలర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ అందుబాటులో లేకపోవడమేనని మాజీ ఓపెనర్ వసీం జాఫర్ అన్నాడు. అంతేకాకుండా కోహ్లీ గైర్హాజరీ‌లో భారత జట్టును కేఎల్ రాహుల్‌కు బదులు సీనియర్ ప్లేయర్ అజింక్యా రహానే నడిపించాల్సిందని అభిప్రాయపడ్డాడు.

రాహుల్ కరెక్ట్ కాదు..

రాహుల్ కరెక్ట్ కాదు..

మ్యాచ్ ప్రారంభానికి ముందు వెన్ను గాయంతో కోహ్లీ దూరమైన విషయం తెలిసిందే. దాంతో కేఎల్ రాహుల్ తాత్కలిక కెప్టెన్‌గా జట్టును నడిపించాడు. ఇక వరుస వైఫల్యాల నేపథ్యంలో రహానే వైస్ కెప్టెన్సీపై బీసీసీఐ వేటు వేసిన విషయం తెలిసిందే. అతని స్థానంలో రోహిత్ శర్మకు ఆ బాధ్యతలు అప్పగించగా.. అతను గాయంతో సౌతాఫ్రికా పర్యటనకు దూరమయ్యాడు. దాంతో కేఎల్ రాహుల్‌ను ఈ సిరీస్‌కు వైస్ కెప్టెన్‌గా బీసీసీఐ ఎంపికచేసింది. ఈ నేపథ్యంలోనే రాహుల్ జోహన్నెస్‌బర్గ్ టెస్ట్‌లో టీమిండియాను లీడ్ చేశాడు. అయితే ఈ నిర్ణయం సరైంది కాదని వసీం జాఫర్ అన్నాడు.

 రహానే ఉండగా రాహుల్ అవసరమా?

రహానే ఉండగా రాహుల్ అవసరమా?

‘విరాట్ కోహ్లీని టీమిండియా చాలా మిస్సయ్యింది. మైదానంలో దూకుడుగా ఉండే కోహ్లీ ఆటగాళ్లను ఎప్పటికప్పుడూ మోటివేట్ చేస్తాడు. అలాంటి ప్లేయర్ మైదానంలో ఉంటే ఆటగాళ్లు కూడా పెద్దగా తప్పులు చేయరు. ఇక టీమ్‌మేనేజ్‌మెంట్ నిర్ణయం కూడా తనను ఆశ్చర్యపరిచింది. కెప్టెన్‌గా ఓటమెరుగని, ఆస్ట్రేలియా గడ్డపై చారిత్రాత్మక సిరీస్ విజయాన్నందించిన అజింక్యా రహానే అందుబాటులో ఉన్నప్పటికీ కేఎల్ రాహుల్‌కు సారథ్య బాధ్యతలు ఇవ్వాల్సిన అవసరం ఏముందో? నేను కేఎల్ రాహుల్‌కు వ్యతిరేకంగా మాట్లాడటం లేదు. అతనో యువ ప్లేయర్. పంజాబ్ కింగ్స్‌కు సారథ్యం వహించాడు. టీమిండియా భవిష్యత్తు సారథి కూడా అతనే అనుకుంటున్నారు. కానీ కోహ్లీ గైర్హాజరీలో రహానే సారథ్యం వహించాల్సింది.'అని వసీం జాఫర్ ఇన్‌సైడ్ స్పోర్ట్ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.

 డీన్ ఎల్గర్ సూపరో సూపర్..

డీన్ ఎల్గర్ సూపరో సూపర్..

240 పరుగుల లక్ష్యఛేదనలో విజయం కోసం మరో 122 పరుగులు చేయాల్సిన స్థితిలో నాలుగో రోజు ఆట కొనసాగించిన సఫారీ టీమ్ 3 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసి గెలుపొందింది. 'ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' డీన్‌ ఎల్గర్‌ (188 బంతుల్లో 10 ఫోర్లతో 96 నాటౌట్‌) అద్భుతమైన బ్యాటింగ్‌ ప్రదర్శన కనబర్చగా...వాన్‌ డర్‌ డసెన్‌ (40), టెంబా బవుమా (23 నాటౌట్‌) అతనికి అండగా నిలిచారు. ఇక భారత బౌలర్లలో శార్దూల్, అశ్విన్, షమీ తలో వికెట్ తీయగా.. సిరాజ్, బుమ్రా దారుణంగా విఫలమయ్యారు. కీలక క్యాచ్‌లు నేలపాలు చేయడం కూడా భారత్‌ను దెబ్బతీసింది.

Story first published: Friday, January 7, 2022, 19:24 [IST]
Other articles published on Jan 7, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+