
హుడానే ఉత్తమం..
ఈ సందర్భంగా జడేజా స్థానంలో అక్షర్ పటేల్, దీపక్ హుడా బెటరా? అని ప్రశ్నించగా.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'నేను అయితే జడేజా స్థానంలో దీపక్ హుడానే ఆడించేవాడిని. ఎందుకంటే అతని రాకతో జట్టు బ్యాటింగ్ బలం పెరుగుతోంది. ముఖ్యంగా పాకిస్థాన్‌పై బ్యాటింగ్ బలం పెరగడం చాలా ముఖ్యం. ఎందుకంటే మనం చెప్పుకుంటున్న ఫైర్ బ్రాండ్ క్రికెట్ ఆడటం లేదు. ఎందుకంటే మన బ్యాటింగ్ డెప్త్ ఏడో స్థానం వరకే ఉంది. హుడా జట్టులోకి వస్తే అది పెరుగుతుంది. పైగా అతను ఒకటి రెండు ఓవర్లు బౌలింగ్ చేయడంతో పాటు ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగలడు.

చిక్కంతా లెఫ్టాండర్‌తోనే..
అయితే హుడా ఎంపిక విషయంలో ఒక సమస్య ఉంది. రిషభ్ పంత్, అక్షర్ పటేల్ లేకుండా హుడాతో బరిలోకి దిగితే పాకిస్థాన్ లెఫ్టార్మ్ స్పిన్నర్లు షాదాబ్ ఖాన్, మహమ్మద్ నవాజ్‌లతో ముప్పు పొంచి ఉంది. టాపార్డర్‌లో లెఫ్టాండ్ బ్యాటర్లు లేకపోవడం వారికి కలిసిరానుంది. దాంతోనే ఓ ఎడమచేతివాటం బ్యాటర్‌ను తీసుకోవాల్సిన పరిస్థితి భారత జట్టుకు ఏర్పడింది. రిషభ్ పంత్‌ను తీసుకుందామా? అంటే టీమ్‌మేనేజ్‌మెంట్ దినేశ్ కార్తీక్‌పై నమ్మకం పెట్టింది. ఈ క్రమంలోనే దీపక్ హుడా బదులు అక్షర్ పటేల్ ఆడే అవకాశం ఉంది.'అని వసీం జాఫర్ వివరించాడు.

టీమిండియా అదృష్టం..
ఇక రవీంద్ర జడేజా గాయంతో దూరమైనా అతని స్థానాన్ని భర్తీ చేయగల అక్షర్ పటేల్ ఉండటం టీమిండియా చేసుకున్న అదృష్టమని వసీం జాఫర్ అభిప్రాయపడ్డాడు. రవీంద్ర జడేజా లేని లోటు తెలియకుండా రాణించగల శక్తి సామర్థ్యాలు అక్షర్ పటేల్‌కు ఉన్నాయని చెప్పాడు. పాకిస్తాన్, హాంకాంగ్‌పై రవీంద్ర జడేజా అంచనాలకు తగ్గట్టే ఆడాడని, సూపర్-4లోనూ అదే స్థాయి దూకుడును ప్రదర్శిస్తాడని ఆశించానని తెలిపాడు. దురదృష్టం అతన్ని గాయం రూపంలో వెంటాడిందని, రవీంద్ర జడేజా అందుబాటులో లేకపోవడం వల్ల టీమిండియా పెద్డగా ఆందోళన చెందనక్కర్లేదని చెప్పాడు. అచ్చంగా అతని తరహాలోనే ఆడగల మరో ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ ఉన్నాడని పేర్కొన్నాడు.

జడేజా లేని లోటు..
రవీంద్ర జడేజా స్థానాన్ని అక్షర్ పటేల్‌తో భర్తీ చేయాలనుకోవడం బ్యాడ్ ఐడియా కాదని తేల్చి చెప్పాడు. అక్షర్ పటేల్‌కు ప్రత్యామ్నాయం మరొకరు కనిపించట్లేదని వసీం జాఫర్ పేర్కొన్నాడు. వెస్టిండీస్ పర్యటనలో అక్షర్ ఎలా ఆడాడనేది అందరూ చూశారని, పవర్ ప్లేలో సమర్థవంతంగా బౌలింగ్ చేయగలనని ఐపీఎల్‌లో తనను తాను నిరూపించుకున్నాడని చెప్పాడు. జడేజా లేని లోటు రానివ్వడని అంచనా వేశాడు.


Click it and Unblock the Notifications












