Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WTC Final రూల్స్ అర్థమైతే ఒట్టు.. అశ్విన్ నువ్వే చెప్పాలయ్యా.. వసీం జాఫర్ సెటైర్స్!

Wasim Jaffers shares Meme On WTC Playing Conditions Stars Ravichandran Ashwin

ముంబై: సోషల్ మీడియా వేదికగా ప్రతీ విషయంపై తనదైన శైలిలో వ్యంగ్యస్త్రాలు సంధించే టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్.. తాజాగా వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ రూల్స్‌పై కూడా సెటైర్లు పేల్చాడు. 'ఆ రూల్స్ అర్థమైతే ఒట్టు.. అశ్విన్ నువ్వే చెప్పాలయ్యా'అర్ధం వచ్చే క్యాప్షన్‌తో ఫన్నీ మీమ్‌ను షేర్ చేశాడు. ఇంగ్లండ్ వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య జరగబోయే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు సంబంధించిన విధివిధానాలను ఐసీసీ శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే. మ్యాచ్ టై లేదా డ్రా అయితే సంయుక్త విజేతగా ప్రకటిస్తామని తెలిపింది. మొత్తం 95 పేజీల రూల్స్ బుక్‌ను విడుదల చేసింది.

మా పరిస్థితి మున్నాభాయ్‌లానే ఉంది..

ఈ రూల్స్ బుక్‌పై జాఫర్ తనదైన శైలిలో స్పందించాడు. మున్నాభాయ్‌ ఎంబీబీఎస్‌ సినిమాలోని సంజయ్‌ దత్‌ క్లాస్‌రూం సీన్‌కు సంబంధించిన ఫొటోనూ మీమ్‌గా ట్వీట్ చేశాడు. ఈ సినిమాలో మున్నాభాయ్ పాత్ర పోషించిన సంజయ్ దత్‌కు పాఠాలు అర్థం కాకపోవడంతో తన పక్కనే కూర్చున్న మరో స్టూడెంట్‌ను.. లెక్చరర్లు చెప్పే పాఠాలు బాగా విని.. రూమ్‌కు వచ్చి అర్థమయ్యేలా చెప్పాలంటాడు. దాన్ని పేరడిగా తీసుకున్న జాఫర్‌ డబ్ల్యూటీసీ ఫైనల్‌ కోసం రూపొందించిన బుక్‌పై కామెంట్‌ చేశాడు. అశ్విన్‌ను బాగా అర్థం చేసుకొని టీమిండియా మొత్తానికి ఆ రూల్స్ వివరించాలని పరోక్షంగా సూచించాడు.

అశ్విన్ నువ్వే చెప్పాలయ్యా..

అశ్విన్ నువ్వే చెప్పాలయ్యా..

టీమిండియాలో రవిచంద్రన్‌ అశ్విన్‌ అందరికంటే జీనియస్‌.. మంచి మేథమెటిషీయన్‌గా పేరున్న అశ్విన్‌‌కు స్టాట్స్‌ , రూల్స్‌ గురించి బాగా వివరిస్తాడని భావించిన జాఫర్.. అతన్ని ఫస్ట్ బేంచర్‌గా పేర్కొన్నాడు. ఇక ఈ మీమ్‌పై ఓ నెటిజన్‌ సబ్‌టైటిల్స్‌ ప్లీజ్‌ అంటూ కామెంట్ చేయగా... దీనికి స్పందించిన అశ్విన్‌.. ''అరె బాయ్‌.. ముందు బుక్‌ను బాగా చదువు.. మేం కూడా అందులో ఏముందో తెలుసుకోవాలి'' అంటూ లాఫింగ్‌ ఎమోజీతో కామెంట్‌ చేశాడు.

సంయుక్త విజేతలు..

సంయుక్త విజేతలు..

ఐసీసీ నిబంధనల ప్రకారం డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌ డ్రాగా ముగిస్తే రెండు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు. మ్యాచ్‌ జరిగే ఐదు రోజుల్లో సమయం నష్టపోతేనే రిజర్వుడేను కేటాయిస్తారు. జూన 23 రిజర్వు డేగా ఉంటుంది. అదీ ఐదు రోజుల్లో ఫలితం తేలకుంటేనే. సాధారణ రోజుల్లో నష్టపోయే సమయాన్ని మాత్రమే రిజర్వ్‌డే ఆడిస్తారు. ఐదు రోజుల్లో ఎలాంటి అడ్డంకులు లేకుండా పూర్తి స్థాయిలో ఆట జరిగితే రిజర్వ్ డే ఉండదు. ఫలితంతో దీనికి సంబంధం లేదు. ఫలితం తేలని పక్షంలో రిజర్వ్ డేతో సంబంధం లేకుండా డ్రాగా ప్రకటిస్తారు.

రిజర్వ్‌డేపై తుది నిర్ణయం వారిదే..

రిజర్వ్‌డేపై తుది నిర్ణయం వారిదే..

రిజర్వ్ డే ఉపయోగించుకోవాలా లేదా అన్నది మ్యాచ్‌ రిఫరీ నిర్ణయిస్తారు. అది కూడా ఐదో రోజు చివరి గంటలో సమీక్షించి తుది నిర్ణయం తీసుకుంటారు. మ్యాచ్‌లో పూర్తిగా గ్రేడ్‌ 1 డ్యూక్‌ బంతుల్ని వినియోగిస్తారు. షార్ట్‌రన్‌పై మూడో అంపైర్ నిర్ణయం తీసుకుంటాడు. మిగతా ఎల్బీడబ్ల్యూ, డీఆర్‌ఎస్‌ నిబంధనలు ఎప్పటిలాగే ఉంటాయి. జూన్‌ 18 నుంచి 22 వరకు సౌథాంప్టన్‌ వేదికగా ఈ డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనున్న విషయం తెలిసిందే.

Story first published: Friday, May 28, 2021, 19:50 [IST]
Other articles published on May 28, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+