T20 WC Final 2021: మామ టాస్ టిప్స్ చెప్పవా? కోహ్లీ సలహా కోరిన విలియమ్సన్! నవ్వులే నవ్వులు!

దుబాయ్: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2021 తుది దశకు చేరకుంది. హాట్ ఫేవరేట్ జట్లన్నీ ఒక్కొక్కటిగా ఇంటిదారిపట్టగా ఏ మాత్రం అంచనాల్లేకుండా బరిలోకి దిగిన న్యూజిలాండ్, ఆస్ట్రేలియా అద్వితీయమైన ఆటతీరుతో ఫైనల్‌కు చేరాయి. టోర్నీ ఆరంభమైనపుడున్న అంచనాలు వేరు. టోర్నీ సాగిన తీరు వేరు. డిఫెండింగ్ ఛాంపియన్ వెస్టిండీస్, టైటిల్ ఫేవరెట్ అనుకున్న టీమిండియా సూపర్-12 దశను కూడా దాటలేదు. సూపర్-12లో ఘనవిజయాలతో ఫేవరెట్లుగా అవతరించిన ఇంగ్లండ్, పాకిస్థాన్ సెమీస్ గడప దాటలేకపోయాయి. ఇప్పటిదాకా కప్పు గెలవని, పెద్దగా అంచనాల్లేకుండా టోర్నీలో అడుగు పెట్టిన న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ఇప్పుడు కప్పు కోసం కొట్లాడబోతున్నాయి. ఆదివారం దుబాయ్ అంతర్జాతీయ మైదానం వేదికగా జరిగే టైటిల్ ఫైట్‌లో అమీతుమీ తేల్చుకోనున్నాయి.
టాస్ టిప్స్ అడుగుతూ..
అయితే ఈ మెగా ఫైనల్ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ షేర్ చేసిన మీమ్ నవ్వులు పూయిస్తోంది. ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ ఈ మీమ్‌లో ఏముందంటే.. ఫైనల్ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌కు ఆల్‌ది బెస్ట్ చెబుతున్నాడు. దీనికి బదులుగా కేన్ మామ థ్యాంక్స్ చెబుతూ.. టాస్ గెలవడం కోసం ఏమైనా టిప్స్ ఇస్తావా? అని ప్రశ్నించాడు. దాంతో నెటిజన్లు నవ్వు ఆపుకోలేకపోతున్నారు.

టాస్ కీలకం..
ఈ ప్రపంచకప్‌లో టాస్ కీలకంగా మారిన సంగతి తెలిసిందే. దాదాపు అన్ని మ్యాచ్‌ల్లోనూ టాస్ గెలిచిన జట్లే ఎక్కువగా విజయాలు నమోదు చేశాయి. ముఖ్యంగా దుబాయ్ వేదికగా జరిగిన 12 మ్యాచ్‌ల్లో 11 సార్లు సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లే గెలిచాయి. అయితే కోహ్లీకి మాత్రం ఈ టోర్నీలో టాస్ కలిసి రాలేదు. న్యూజిలాండ్, పాకిస్థాన్‌తో మ్యాచ్‌ల్లో కోహ్లీ టాస్ ఓడిపోవడంతో భారత్ టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. ఆ రెండు మ్యాచ్‌ల తర్వాత భారీ విజయాలు సాధించినప్పటికి అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తాజాగా ఫైనల్ మ్యాచ్‌లోనూ టాస్ కీలకంగా మారనుంది.

ఫైనల్ ఫలితం కూడా..
ఇక సెమీ ఫైనల్ మ్యాచ్‌ల్లో కూడా టాస్ గెలిచిన జట్లే విజయాలు సాధించి ఫైనల్‌కు చేరాయి. ఈ క్రమంలో ఫైనల్లో కూడా టాస్ గెలిచిన జట్టునే విజయం వరించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వసీం జాఫర్ కివీస్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. '' ఈ ప్రపంచకప్‌లో టాస్ కీలకంగా మారింది. సాధారణంగా క్యాచెస్ విన్ మ్యాచెస్ అంటారు.. కానీ ఇక్కడ మాత్రం టాస్ విన్ మ్యాచ్‌స్ లాగా తయారైంది. కీలకమైన సెమీఫైనల్ మ్యాచ్‌ల్లో అటు కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్.. ఇటు ఆసీస్ ఆరోన్ ఫించ్ ఇద్దరు టాస్ గెలిచి సగం మ్యాచ్ గెలిచారు. కానీ ఇది ప్రతీసారి జరగకపోవచ్చు. ఇక ఐసీసీ ఈవెంట్లలో ఫైనల్ చేరిన సందర్భాల్లో ఆస్ట్రేలియా ఫెవరెట్‌గా కనిపిస్తుంది. కానీ న్యూజిలాండ్ తక్కువ అంచనా వేస్తే ఆసీస్‌కు ప్రమాదం. మొత్తానికి మ్యాచ్ మాత్రం రసవత్తరంగా సాగడం ఖాయం అంటూ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications