Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India Playing XI: విహారి ఔట్.. రహానే‌కు చాన్స్! సౌతాఫ్రికాతో తొలి టెస్ట్‌ బరిలోకి దిగే భారత జట్టు ఇదే!

 Wasim Jaffer Predicted India’s Playing XI for first Test vs South Africa, Ajinkya Rahane included

న్యూఢిల్లీ: సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న భారత జట్టు రేపటి(ఆదివారం) నుంచి మూడు టెస్ట్‌ల సిరీస్ ఆడనుంది. సఫారీ గడ్డపై ఇప్పటి వరకు అందని ద్రాక్షగానే ఉన్న టెస్ట్ సిరీస్ విజయం ఈ సారి అందుకోవాలని భారత జట్టు భావిస్తోంది. ఈ క్రమంలోనే సన్నాహకాల జోరును పెంచింది. గత వారం రోజులుగా నెట్స్‌లో కోచ్ రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలో చెమటోడుస్తుంది. అయితే టీమిండియా తుది జట్టు కాంబినేషన్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. సీనియర్ ఆటగాళ్ల రీఎంట్రీతో పాటు ఎక్స్‌ట్రా బ్యాట్స్‌మన్? లేక ఎక్స్ ట్రా బౌలర్‌ను తీసుకుంటారా? అనేదానిపై ఆసక్తి నెలకొంది. టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ శుక్రవారం బీసీసీఐ టీవీతో మాట్లాడుతూ.. ఐదుగురు బౌలర్లతోనే బరిలోకి దిగుతున్నామని హింట్ ఇచ్చాడు.

 రహానేకు చాన్స్..

రహానేకు చాన్స్..

మరోవైపు మిడిలార్డర్‌లో రెండు స్థానాల కోసం ముగ్గురు ఆటగాళ్లు పోటీపడుతున్నారు. అజింక్య రహానే, శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారి రేసులో ఉన్నారు.కాగా ప్రస్తుతం అజింక్య రహానే ఫామ్‌లో లేకపోయినా.. ఇక్కడ ఆడిన అనుభవంతో పాటు విదేశాల్లో మెరుగైన రికార్డులున్న నేపత్యంలో అతనికి తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. మరో వైపు ఆరంగ్రేట్ర మ్యాచ్‌లోనే సెంచరీతో చెలరేగిన శ్రేయస్ అయ్యర్‌ను పక్కనపెట్టే పరిస్థితి లేదు. దాంతో మరోసారి హనుమ విహారీ బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎక్స్ ట్రా బౌలర్‌ను తీసుకుంటే అయ్యర్, రహానేల్లో ఒకరు బెంచ్‌కే పరిమితం కావాల్సి ఉంటుంది.

 ఎక్స్‌ట్రా బ్యాట్స్‌మన్ అవసరం..

ఎక్స్‌ట్రా బ్యాట్స్‌మన్ అవసరం..

అయితే టీమ్ కాంబినేషన్‌పై ఆదివారమే క్లారిటీరానుంది. ఈ క్రమంలోనే క్రికెట్‌ నిపుణలు, మాజీ క్రికెటర్లు సౌతాఫ్రికాతో జరిగే తొలి టెస్ట్‌లో బరిలోకి దిగే భారత తుది జట్టును అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ కూడా తన టీమ్ ప్రిడిక్షన్ ప్రకటించాడు. సౌతాఫ్రికా పర్యటనలో భారత్ విజయం సాధించాలంటే ఎక్స్‌ట్రా బ్యాట్స్‌మన్‌ను తీసుకోవాలని సూచించాడు. గత పర్యటన ఫలితాలను పరిశీలిస్తే ఎక్స్‌ట్రా బ్యాట్స్‌మన్ అవసరమెంత ఉందో తెలుస్తుందన్నాడు. గత పర్యటనల్లో బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే భారత్ ఓడిపోయిందని, ఈ సారైన స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్‌లతో బరిలోకి దిగాలన్నాడు.

జాఫర్ ప్రిడిక్షన్..

జాఫర్ ప్రిడిక్షన్..

తన అంచనా వేసిన జట్టులో మయాంక్ అగర్వాల్, కేఎల్‌ రాహుల్‌ను ఓపెనర్లుగా అవకాశం ఇచ్చాడు. ఇక ఫామ్‌లో లేకపోయిన చతేశ్వర్ పుజారాకు తన జట్టులో మూడో స్ధానంలో చోటు కల్పించాడు. ఇక నాలుగో స్ధానంలో కెప్టెన్‌ కోహ్లీ బరిలోకి దిగుతాడని చెప్పాడు. ఐదో స్ధానంలో ఆశ్చర్యకరంగా అజింక్యా రహానేను తీసుకున్న వసీం జాఫర్.. ఆరో స్ధానంలో శ్రేయస్‌ అయ్యర్‌ అవకాశం ఇచ్చాడు. ఇక జట్టు వికెట్‌ కీపర్‌గా రిషబ్‌ పంత్‌ను ఎంచుకోగా... జట్టులో ఏకైక స్పిన్నర్‌గా రవిచంద్రన్‌ అశ్విన్‌ను తీసుకున్నాడు. ఇక బౌలర్లలో మహ్మద్‌ షమీ, జస్‌ప్రీత్‌ బుమ్రా,మహ్మద్‌ సిరాజ్‌లతో ముగ్గురు పేసర్లను ఎంపిక చేశాడు. జాఫర్ ప్రిడిక్షన్ టీమ్‌లోనూ తెలుగు క్రికెటర్ హనుమ విహారికి చోటు దక్కలేదు.

 వసీం జాఫర్ అంచనా వేసిన భారత తుది జట్టు:

వసీం జాఫర్ అంచనా వేసిన భారత తుది జట్టు:

మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ (కెప్టెన్‌), అజింక్యా రహానే, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్‌), రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మమహ్మద్ సిరాజ్

ఎక్స్‌ట్రా బౌలర్‌ను తీసుకుంటే మాత్రం రహానే, అయ్యర్‌లో ఒకరు బెంచ్‌కు పరిమితమవుతారు. ఎక్స్‌ట్రా బౌలర్‌గా బ్యాటింగ్ సామర్థ్యం కలిగిన శార్దూల్ ఠాకూర్ జట్టులోకి వస్తాడు. గాయాలతో చివరి క్షణంలో దూరమైతే తప్పా జాఫర్ అంచనా వేసిన టీమ్ అంతా బరిలోకి దిగే అవకాశం ఉంది.

Story first published: Saturday, December 25, 2021, 13:39 [IST]
Other articles published on Dec 25, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+