Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రహానే ఆ ఇద్దరిని తీసుకో.. వసీం జాఫర్ కోడింగ్ మెసేజ్! చూస్తే వావ్ అనాల్సిందే!

Wasim Jaffer posts hidden message for Ajinkya Rahane, wishes good luck for Boxing Day Test
Ind vs Aus : Wasim Jaffer’s Ingenious ‘Hidden Message’ In Tweet Has Fans Crushing Over His Brain

ముంబై: ఆస్ట్రేలియాతో డే/నైట్ టెస్ట్ ‌లో చిత్తుగా ఓడిన టీమిండియా జట్టు కూర్పుపై తీవ్ర చర్చ జరుగుతుంది. యువ ఓపెనర్ పృథ్వీ షా, వికెట్ కీపర్ సాహా దారుణంగా విఫలమవ్వడం, స్టార్ పేసర్ మహ్మద్ షమీ గాయపడటం, కెప్టెన్ విరాట్ కోహ్లీ భారత్‌కు తిరిగిరానుండటంతో జట్టులో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. దాంతో మాజీ ఆటగాళ్లు, క్రికెట్ విశ్లేషకులు జట్టు కూర్పు విషయంలో తాత్కలిక సారథి అజింక్యా రహానేకు పలు సూచనలు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ కూడా రహానేకు సలహా ఇచ్చాడు. అయితే ఈ సలహాను వసీం జాఫర్ ట్విటర్ వేదికగా తనదైన శైలిలో చెప్పడం చర్చనీయాంశమైంది. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత సోషల్ మీడియా వేదికగా మరో సెహ్వాగ్‌ను తలపిస్తున్న వసీం జాఫర్ తనదైన పోస్ట్‌లతో అభిమానులను ఆకట్టుకుంటున్నాడు.

తాజాగా బాక్సింగ్ డే టెస్ట్‌కు శుభ్ మన్ గిల్, కేఎల్ రాహుల్‌లను తీసుకోవాలని అజింక్యా రహానేకు సూచించిన జాఫర్.. దాన్ని కోడ్ లాంగ్వెజ్‌లో చెప్పి అందరి దృష్టిని ఆకర్షించాడు. వినూత్నంగా చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం నెటిజన్లను ఆకట్టుకుంటుంది. 'డియర్ అజింక్యా రహానే.. ఈ రహస్య సందేశం నీకే . బాక్సింగ్ డే టెస్ట్‌కు గుడ్ లక్'అని ఓ కోడ్ లాంగ్వేజ్‌ను జాఫర్ ట్వీట్ చేశాడు.

Story first published: Monday, December 21, 2020, 20:38 [IST]
Other articles published on Dec 21, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+