ఇంగ్లండ్‌తో ఫస్ట్ టెస్ట్‌కు భారత జట్టు ఇదే.. వసీం జాఫర్ జోస్యం!

ముంబై: ఆస్ట్రేలియా పర్యటనలో చారిత్రాత్మక విజయంతో సర్వత్రా ప్రశంసలందుకుంటూ ఫుల్‌జోష్‌లో ఉన్న భారత జట్టు మరో సమరానికి సన్నద్ధమవుతోంది. ఫిబ్రవరి 5 నుంచి చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్ ఆడనుంది. నాలుగు టెస్ట్‌ల ఈ సిరీస్‌లో సెకండ్ మ్యాచ్ కూడా అక్కడే జరగనుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల ఆటగాళ్లు ఇప్పటికే చెన్నై చేరుకొని క్వారంటైన్‌లో ఉన్నారు. ఇక గాయాల నుంచి కోలుకున్న సీనియర్ ఆటగాళ్లు జట్టులోకి రావడంతో తొలి టెస్టు కోసం భారత ప్లేయర్స్ మధ్య తీవ్ర పోటీనెలకొంది. అయితే ఫస్ట్ టెస్ట్ బరిలోకి దిగే తుది జట్టు ఇదేనంటూ టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ తన అంచనాను ప్రకటించాడు.

ఓపెనర్లుగా రోహిత్, శుభ్‌మన్..
ఆసీస్ గడ్డపై అదరగొట్టిన శుభ్‌మన్ గిల్, సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మను ఓపెనర్లుగా సూచించాడు. బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన శుభ్‌మన్ గిల్ సూపర్ పెర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నాడు. గబ్బా మ్యాచ్‌లో అతను చేసిన 91 పరుగులు జట్టు విజయానికి బాటలు వేసాయి. మూడు మ్యాచ్‌ల్లో 50 సగటుతో పరుగులు చేశాడు. ఇక గాయం కారణంగా చివరి రెండు టెస్ట్‌లు మాత్రమే ఆడిన రోహిత్ శర్మ.. చెప్పుకొదగ్గ ప్రదర్శన కనబర్చకపోయినా.. వికెట్ త్వరగా ఇచ్చుకున్నాడనే విమర్శలు ఎదుర్కొన్నా.. మంచి ఆరంభాలను అందించడంలో కృషి చేశాడు.

మిడిలార్డర్‌లో..
పెటర్నీటీ లీవ్‌తో జట్టుకు దూరమైన విరాట్ కోహ్లీ తిరిగి జట్టులోకి రావడంతో మయాంక్ అగర్వాల్ బెంచ్‌కే పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. జాఫర్ కూడా తన జట్టులో మయాంక్‌కు అవకాశం ఇవ్వలేదు. టీమిండియా నయావాల్ చతేశ్వర్ పుజారా, కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ అజింక్యా రహానే మిడిలార్డర్ బ్యాట్స్‌మన్‌గా ఎంపిక చేశాడు. ఇక స్పెషలిస్ట్ కీపర్ వృద్దీమాన్ సాహాను కాదని ఆసీస్ పర్యటనలో అదరగొట్టిన రిషభ్‌పంత్‌నే వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్‌గా జట్టులోకి తీసుకున్నాడు.

అక్షర్ పటేల్‌కు చాన్స్..
ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ఎంపికైన యువ స్పిన్నర్ అక్షర్ పటేల్‌కు కూడా జాఫర్ అవకాశం ఇచ్చాడు. అక్షర్ పటేల్, రవి అశ్విన్‌లను స్పిన్నర్లుగా తీసుకున్న జాఫర్.. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ ఎడమచేతి వాటం స్పిన్నర్ చేతిలో ఇబ్బందిపడే అవకాశం ఉందని అందుకే అక్షర్‌కు చోటు కల్పించానని జాఫర్ స్పష్టతనిచ్చాడు.
అలాగే పేసర్లుగా బుమ్రాతో పాటు పిచ్‌ను బట్టి ఇషాంత్ శర్మ, మహ్మద్ సిరాజ్‌లలో ఒకరిని ఎంచకోవచ్చన్నాడు. కుల్దీప్ యాదవ్, శార్దూల్‌లకు కూడా ఇది వర్తిస్తుందని తెలిపాడు. ఇక ఇషాంత్ శర్మ గాయంతో ఆస్ట్రేలియా పర్యటనకు దూరం కాగా.. కుల్దీప్ యాదవ్ ఒక్క మ్యాచ్‌లో కూడా చోటు దక్కించుకోలేకపోయాడు. ఇక సిరాజ్, శార్దూల్ గబ్బా టెస్ట్ విజయంలో కీలక పాత్ర పోషించారు.
వసీం జాఫర్ తుది జట్టు(అంచనా)
రోహిత్ శర్మ , శుభ్‌మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, రిషభ్ పంత్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్/శార్దూల్ ఠాకూర్, ఇషాంత్ శర్మ / మహ్మద్ సిరాజ్, జస్‌ప్రీత్ బుమ్రా
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications