Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మైకేల్ వాన్.. నీకు ఎక్కడో కాలుతున్నట్లుంది.. ఈ బర్నాల్ రాసుకో: వసీం జాఫర్

Wasim Jaffer hit back Michael Vaughan trolling with burnol meme

హైదరాబాద్: టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ మరోసారి తనదైన ట్వీట్‌‌తో అభిమానులను ఆకట్టుకున్నాడు. తనదైన ట్వీట్‌తో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ నోరు మూయించాడు. ఈ ఇద్దరి మధ్య ట్విటర్ వేదికగా ఓ యుద్దమే జరుగుతుందన్న విషయం అందరికి తెలిసిందే. ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తున్న రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధమైనా ఆగుతుందేమో గానీ వీరి ట్విటర్ పోరు మాత్రం ఆగేలా లేదు. ఆధిపత్యం చేతులు మారినప్పుడల్లా ఈ ఇద్దరూ తమదైన శైలిలో ట్వీట్లతో పంచులు విసురుకుంటూ ఇరు దేశాల క్రికెట్ అభిమానులకు కావాల్సినంత మజాను అందిస్తుంటారు. ముఖ్యంగా జాఫర్ సంధించే పంచ్‌లకు వాన్ ముఖం వాడిపోతూ ఉంటుంది.

బర్నాల్ రాసుకో..

తాజాగా పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ కోచ్‌గా ఎంపికైన వసీం జాఫర్‌ను ఎగతాళి చేస్తూ మైకేల్ వాన్ ట్రోల్ చేశాడు. 'నా చేతిలో ఓడిన వ్యక్తి బ్యాటింగ్ కోచ్ అంట'అని ఎటకారంగా ట్వీట్ చేశాడు. దీనికి తనదైన శైలిలో బదులిచ్చిన వసీం జాఫర్.. బర్నాల్ మీమ్ షేర్ చేశాడు. తాను బ్యాటింగ్ కోచ్ అవ్వడాన్ని మైకేల్ వాన్ తట్టుకోలేకపోతున్నాడని, అతనికి ఎక్కడో కాలుతుందని, బర్నాల్ రాసుకోవాలని సెటైరికల్‌గా ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.

 ప్రపంచకప్ ఓటమిపై..

ప్రపంచకప్ ఓటమిపై..

టీ20 ప్రపంచకప్ 2022లో ఇంగ్లండ్‌తో సెమీస్‌లో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఓటమిపాలై ఇంటిదారిపట్టిన విషయం తెలిసిందే. ఈ పరాజయంపై కూడా మైకేల్ వాన్ సెటైర్లు పేల్చాడు. అప్పటి నుంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్న వాన్.. బర్నాల్ మీమ్‌తో నోరు మూయించాడు. ఐపీఎల్ 2023 సీజన్ కోసం పంజాబ్ కింగ్స్ భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. కెప్టెన్ మయాంక్ అగర్వాల్‌ను రిలీజ్ చేసిన పంజాబ్.. కోచ్ అనిల్ కుంబ్లేపై కూడా వేటు వేసింది. శిఖర్ ధావన్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించిన పంజాబ్ దగ్గర రూ.32.2 కోట్ల పర్స్ మనీ ఉంది.

 పంజాబ్ రిటైన్‌ లిస్ట్‌:

పంజాబ్ రిటైన్‌ లిస్ట్‌:

శిఖర్ ధావన్ (కెప్టెన్‌), షారుఖ్ ఖాన్, జానీ బెయిర్‌స్టో, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, భానుకా రాజపక్స, జితేష్ శర్మ, రాజ్ బావా, రిషి ధావన్, లియామ్ లివింగ్‌స్టోన్, అథర్వ తైడే, అర్ష్‌దీప్ సింగ్, బల్తేజ్ సింగ్, నాథన్ ఎల్లిస్, కగిసో రబాడ, రాహుల్ చాహర్, హర్‌ప్రీత్ బిఆర్

పంజాబ్‌ రిలీజ్ జాబితా

మయాంక్ అగర్వాల్, ఒడియన్ స్మిత్, వైభవ్ అరోరా, బెన్నీ హోవెల్, ఇషాన్ పోరెల్, అన్ష్ పటేల్, ప్రేరక్ మన్కడ్, సందీప్ శర్మ, రిటిక్ ఛటర్జీ

Story first published: Thursday, November 17, 2022, 18:46 [IST]
Other articles published on Nov 17, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+