కోహ్లీసేన స్లో ఓవర్ రేట్.. పాకిస్థానీకి అదిరే బదులిచ్చిన వసీం జాఫర్!!

ఢిల్లీ: సుదీర్ఘ ఆస్ట్రేలియా పర్యటనను టీమిండియా నిరాశాజనకంగా ఆరంభించింది. కరోనా విరామం అనంతరం బరిలోకి దిగిన మొదటి అంతర్జాతీయ వన్డేలో ఓటమి చవిచూసింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శుక్రవారం ప్రేక్షకుల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 66 పరుగుల తేడాతో భారత్‌పై అలవోక విజయం సాధించింది. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ వీరబాదుడు ముందు భారత బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. ఏకంగా 374 పరుగుల్ని సమర్పించుకున్నారు. ఆసీస్ భారీగా పరుగులు చేయడంతో ఊహించినట్లే కోహ్లీసేనకు స్లో ఓవర్‌రేట్ పడింది.
స్లో ఓవర్ రేట్:
టీమిండియా తమ 50 ఓవర్ల కోటాను పూర్తి చేయడానికి నాలుగు గంటలకు పైగా సమయం తీసుకుంది. 246 నిమిషాలు తీసుకుంది. ఐసీసీ రూల్స్ ప్రకారం ఒక వన్డే మ్యాచ్‌లో పూర్తి బౌలింగ్ కోటా మూడు గంటల 30 నిమిషాల్లో కంప్లీట్ కావాలి. అంటే 210 నిమిషాల్లో మొత్తం ఓవర్లు వేయాలి. అయితే టీమిండియా అదనంగా మరో 36 నిమిషాలు తీసుకోవడంతో లైమ్‌లైట్‌లోకి వచ్చింది. స్లో ఓవర్ రేట్ కారణంగా టీమిండియా పాయింట్లను కోల్పోయే ప్రమాదంలో పడింది. ఐసీసీ వన్డే లీగ్ నిబంధనల ప్రకారం స్లో ఓవర్ రేట్‌తో బౌలింగ్ చేసిన జట్టుకు ఓ పాయింట్‌ను జరిమానా విధిస్తారు. ఇలా జరిగే ప్రపంచకప్ అర్హతపై కూడా ప్రభావం చూపుతుంది.

జాఫర్ ఫన్నీ రీప్లే:
ఇదే విషయాన్ని ట్విట్టర్ వేదికగా పాకిస్థాన్‌కు చెందిన క్రికెట్ స్టాటిషియన్ మజార్ అర్షద్ పేర్కొన్నాడు. భారత జట్టు బౌలింగ్ చేయడానికి 4 గంటలు తీసుకుంది. దీంతో ఒక పాయింట్‌ను కోల్పోతుందని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌పై భారత మాజీ క్రికెటర్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బ్యాటింగ్ కోచ్ వసీం జాఫర్ సరదాగా స్పందించాడు. 2023 ప్రపంచకప్‌కు ఆతిథ్యమిచ్చేది భారతే కాబట్టి.. ఆతిథ్య జట్టుగా టీమిండియా మెగా టోర్నీకి నేరుగా అర్హత సాధిస్తుందని జాఫర్ తెలిపాడు. పాయింట్లను కోల్పోయినా దాని ప్రభావం పడదన్నాడు. జాఫర్ సమయస్ఫూర్తికి మజార్ అర్షద్ నవ్వుతూ రిప్లయ్ ఇచ్చాడు.

ఫాన్స్ సెటైర్లు:
ఐసీసీ రూల్స్ ప్రకారం ఆతిథ్య జట్టు ఆటోమేటిక్‌గా ప్రపంచకప్‌కు క్వాలిపై అవుతుంది. అంటే ఆ మెగా ఈవెంట్‌కు ఇక్కడ స్లో ఓవర్ రేట్ ప్రభావం చూపే అవకాశం లేదు. రూల్స్ ప్రకారం పాయింట్లు తగ్గినా ప్రపంచకప్ అర్హతపై మాత్రం ఎటువంటి ప్రభావం ఉండదు. ఇది విషయాన్ని ట్వీటర్ యూజర్ (అర్షద్)కు సుతిమెత్తగా చెప్పాడు జాఫర్. అయితే అర్షద్ ట్వీట్‌పై ఫాన్స్ సెటైర్లు వేస్తున్నారు. కరోనా టైంలో క్వారంటైన్ నిబంధనలను పాటించని పాకిస్థాన్ వాళ్లు కూడా స్లో ఓవర్ రేట్ గురించి మాట్లాడుతున్నారని.. న్యూజిలాండ్‌లో ఏడుగురు పాక్ క్రికెటర్లకు కరోనా పాజిటివ్‌గా తేలిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.
మరో ఆల్‌రౌండర్ కోసం పాండ్యా కుటుంబాన్నే సంప్రదించాలేమో: హార్దిక్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications