For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మరో ఆల్‌రౌండర్‌ కోసం పాండ్యా కుటుంబాన్నే సంప్రదించాలేమో: హార్దిక్‌

Hardik Pandya suggests Team India can look in the Pandya family for next all rounder

సిడ్నీ: జట్టు అవసరాల మేరకు ఇతర ఆల్‌రౌండర్‌లను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్ ‌పాండ్యా అన్నాడు. సరైన సమయంలో తాను బౌలింగ్‌కు దిగుతానని తెలిపాడు. సుదీర్ఘ ఆస్ట్రేలియా పర్యటనను కోహ్లీసేన నిరాశాజనకంగా ఆరంభించింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శుక్రవారం సిడ్నీ వేదికగా ప్రేక్షకుల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 66 పరుగుల తేడాతో భారత్‌పై అలవోక విజయం సాధించింది. మొత్తంగా పసలేని బౌలింగ్‌, పేలవ ఫీల్డింగ్‌, బ్యాటింగ్‌లో వైఫల్యంతో టీమిండియా ఓటమిని చవిచూసింది.

సరైన సమయంలోనే బంతి తీసుకుంటా:

సరైన సమయంలోనే బంతి తీసుకుంటా:

మ్యాచ్ అనంతరం హార్దిక్ ‌పాండ్యా మీడియాతో మాట్లాడాడు. 'నా బౌలింగ్‌పై కఠోర కసరత్తు చేస్తున్నాను. సరైన సమయంలోనే బంతి తీసుకుంటాను. నా బౌలింగ్‌ సామర్థ్యం 100% ఉండాలని భావిస్తున్నా. అంతర్జాతీయ స్థాయికి సరిపోయే వేగంతో బంతులు వేయాలన్నదే నా లక్ష్యం. ప్రస్తుతం సుదీర్ఘ లక్ష్యంతో పనిచేస్తున్నాను. మేం టీ20 ప్రపంచకప్‌ గురించి ఆలోచిస్తున్నాం. ఇతర టోర్నీలతో పోలిస్తే.. అక్కడ నా బౌలింగ్‌కు మరింత ప్రాముఖ్యం ఉంటుంది' అని హార్దిక్ అన్నాడు. వెన్నెముకకు శస్త్రచికిత్స చేయించుకున్న తర్వాత హార్దిక్ మళ్లీ బౌలింగ్‌ చేయలేదు. బౌలింగ్‌ ఫిట్‌నెస్‌ సాధించకపోవడంతో కెప్టెన్ అతడికి బంతి ఇవ్వడం లేదు.

పాండ్యా కుటుంబాన్నే సంప్రదించాలేమో:

పాండ్యా కుటుంబాన్నే సంప్రదించాలేమో:

జట్టులో మరో ఆల్‌రౌండర్‌ ఎవరైతే బాగుంటుందన్న ప్రశ్నకు హార్దిక్ ‌పాండ్యా సరదాగా స్పందించాడు. 'బహుశా మరో ఆల్‌రౌండర్‌ కోసం పాండ్యా (కృనాల్ పాండ్యా‌) కుటుంబాన్నే సంప్రదించాలేమో' అని చమత్కరించాడు. మరో ఆల్‌రౌండర్‌ కోటాలో తన అన్న కృనాల్ పాండ్యా‌ను తీసుకోవాలని హార్దిక్ చెప్పకనే చెప్పాడు. ఐపీఎల్ 2020లో కృనాల్ బాగానే రాణించిన విషయం తెలిసిందే. అటు బంతి, ఇటు బ్యాట్‌తో అద్భుతంగా రాణించాడు. పాండ్యా‌ సోదరులు ఐపీఎల్ ద్వారానే భారత జట్టులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇద్దరూ ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రధాన ఆటగాళ్లుగా మారారు. ఇక టీమిండియాలో వచ్చిన అవకాశాలను కృనాల్ సద్వినియోగం చేసుకుంటున్నాడు.

ఆల్‌రౌండర్‌ ఉంటే కాస్త ఉపశమనం:

ఆల్‌రౌండర్‌ ఉంటే కాస్త ఉపశమనం:

భారీ లక్ష్యం ఛేదిస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ కసిగా ఆడాల్సి ఉంటుందని హార్దిక్‌ పాండ్యా అన్నాడు. 'ఒక్కరే విజయం అందించలేరు. ఒక్కరితో అతిగా ప్రణాళికలు వేయలేం. ఇక ఐదుగురు బౌలర్లతో ఆడితే ఎప్పుడైనా కష్టమే. ఎవరైనా ఒకరు బాగా వేయకపోతే.. అతడి పనిని మరొకరు చేయలేరు. అందుకే ఆల్‌రౌండర్‌ ఉంటే కాస్త ఉపశమనం ఉంటుంది' అని వివరించాడు. సిడ్నీ వన్డేలో హార్దిక్‌ పాండ్యా (76 బంతుల్లో 90; 7ఫోర్లు, 4సిక్స్‌లు) ఆకట్టుకున్న విషయం తెలిసిందే. కీలక సమయంలో బ్యాట్ జులిపించి జట్టుకు భారీ ఓటమిని తప్పించాడు.

తండ్రయ్యాక ప్రశాంతంగా మారా:

తండ్రయ్యాక ప్రశాంతంగా మారా:

తండ్రయ్యాక కాస్త ప్రశాంతంగా మారానని పాండ్యా పేర్కొన్నాడు. 'పిల్లలుంటే సాధారణంగా ఎక్కువ పని ఉంటుంది. జీవితాన్ని భిన్నంగా చూస్తాం. కుటుంబం పట్ల నా దృక్పథమూ మారిపోయింది. ఒక వ్యక్తిగానూ నేను మారాను. మరింత మెరుగయ్యేందుకే మార్పని భావిస్తున్నా. అగస్త్యను ఇప్పుడు చాలా మిస్సవుతున్నా. 15 రోజులప్పుడు నేను బయటకు వచ్చా. ఇప్పుడతనికి 4 నెలలు. నేను ఇంటికి వెళ్లేటప్పటికీ ఇంకా మారిపోతాడు. ఏదేమైనప్పటికీ నా జీవితంలో ఇదే అత్యుత్తమ సమయం' అని పాండ్యా చెప్పుకొచ్చాడు.

బెయిర్‌స్టో మెరుపులు.. దక్షిణాఫ్రికాపై ఇంగ్లండ్ విజయం!!

Story first published: Saturday, November 28, 2020, 12:24 [IST]
Other articles published on Nov 28, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+