For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Wasim Jaffer:అందుకే టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ వద్దు!

Wasim Jaffer feels Rahul Dravid should not become Team Indias permanent head coach

ముంబై: క్రికెట్ అభిమానులంతా టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌ను నియమించాలని డిమాండ్ చేస్తుంటే.. మాజీ క్రికెటర్ వసీమ్ జాఫర్ మాత్రం అందుకు భిన్నమైన వ్యాఖ్యలు చేశాడు. రాహుల్ ద్రవిడ్‌ను టీమిండియా హెడ్ కోచ్‌గా నియమించవద్దని, అతను అండర్‌-19, భారత్‌-ఏ కోచ్‌గానే కొనసాగడమే ఉత్తమమని చెప్పుకొచ్చాడు.

జాతీయ క్రికెట్‌ అకాడమీ చీఫ్‌గా ద్రవిడ్ రిజర్వు బెంచ్‌ని పటిష్టం చేశాడని, అంతర్జాతీయ స్టార్ల కన్నా కుర్రాళ్లకే ఆయన మార్గనిర్దేశం అవసరమని అభిప్రాయపడ్డాడు. శిఖర్ ధావన్ నేతృత్వంలోని భారత జట్టుతో రాహుల్ ద్రవిడ్ హెడ్ కోచ్‌గా శ్రీలంక పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. దాంతో టీమిండియా భవిష్యత్తు కోచ్ ద్రవిడేననే ప్రచారం ఊపందుకుంది.

అందుకే వద్దంటున్నా..

అందుకే వద్దంటున్నా..

ఈ క్రమంలో తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడిన వసీం జాఫర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'శ్రీలంకలో పర్యటిస్తున్న భారత జట్టుతో ద్రవిడ్‌ కోచ్‌గా వెళ్లాడు. ఈ సిరీస్‌తో కుర్రాళ్లు తప్పక ప్రయోజనం పొందుతారు. అయితే ఒక అంతర్జాతీయ జట్టుకు కోచ్‌గా ఆయన తనకు తానుగా వెళ్లొద్దని నా అభిప్రాయం. అండర్‌-19, ఎన్‌సీఏకు వచ్చే క్రికెటర్లకు ఆయన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే ఆయన పర్యవేక్షణలోనే ఎదిగిన చాలా మంది ఆటగాళ్లు టీమిండియాకు ఆడుతున్నారు.

వారికి అవసరం..

వారికి అవసరం..

అండర్‌-19, భారత్‌-ఏ క్రికెటర్లు తర్వాతి స్థాయికి ఎదిగేందుకు ద్రవిడ్ మార్గనిర్దేశం అవసరం. కాబట్టి ద్రవిడ్ సుదీర్ఘ కాలం ఎన్‌సీఏ డైరెక్టర్‌గా కొనసాగడమే ఉత్తమం. అప్పుడే టీమిండియా బెంచ్ మరింత బలంగా తయారవుతోంది, రాహుల్‌ ద్రవిడ్‌కు ఇంతకన్నా ఎక్కువ ఘనతే దక్కాలి. ఎన్‌సీఏ ప్రధాన కోచ్‌గా ఆయన పనితీరు అద్భుతం. అండర్‌-19, భారత్‌-ఏ, గాయపడి ఎన్‌సీయేకు వెళ్లిన అంతర్జాతీయ ఆటగాళ్లకు ఆయన మార్గనిర్దేశం చేస్తాడు. వారికి అంతకు మించిన ఆదర్శనీయుడు ఎవరూ దొరకరు' అని జాఫర్‌ చెప్పుకొచ్చాడు.

కరోనా కలకలం..

కరోనా కలకలం..

శ్రీలంక పర్యటనలో ఉన్న గబ్బర్ సేన జులై 13 నుంచి ఆతిథ్య జట్టుతో మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌లు ఆడనుంది. ఇప్పటికే సన్నాహకాలు ప్రారంభించిన ధావన్ సేన.. ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్‌లను కూడా పూర్తి చేసుకుంది. ఇటీవలె ఇంగ్లండ్ పర్యటనను ముగించుకొని స్వదేశం చేరిన శ్రీలంక జట్టులో కరోనా కలకలం రేగింది.

ఇంగ్లండ్ ఆటగాళ్లు వైరస్ బారిన పడటంతో ముందు జాగ్రత్తగా కొలంబోలో అడుగుపెట్టిన లంక ప్లేయర్లకు పరీక్షలు నిర్వహించగా బ్యాటింగ్ కోచ్‌ గ్రాంట్ ఫ్లవర్‌కి పాజిటివ్‌గా తేలింది. దాంతో అతడ్ని వెంటనే ఐసోలేషన్‌కి పంపిన శ్రీలంక క్రికెట్ బోర్డు.. ఆటగాళ్లను కూడా క్వారంటైన్‌కి తరలించింది. ఇంగ్లండ్‌ నుంచి గ్రాంట్ ఫ్లవర్ వచ్చిన విమానంలోనే శ్రీలంక క్రికెటర్లు రావడంతో.. నాలుగు రోజుల్లో టీమిండియాతో ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌పై అనుమానాలు నెలకొన్నాయి. అయితే తాజాగా నిర్వహించిన కరోనా టెస్టుల్లో శ్రీలంక క్రికెటర్లందరికి నెగటివ్ అని తేలింది. దీంతో లంక బోర్డు ఊపిరిపీల్చుకుంది.

Story first published: Friday, July 9, 2021, 17:15 [IST]
Other articles published on Jul 9, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+