ఇంగ్లండ్‌పై సిరీస్ విజయం.. ఏమోయ్ వాన్ నిమ్మలంగానే ఉన్నావా? వసీం జాఫర్ సెటైర్!

హైదరాబాద్: టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ మరోసారి తనదైన ట్వీట్‌తో అభిమానులను అలరించాడు. గోతికాడ నక్కలా టీమిండియా ఎప్పుడు ఓడుతుందా? అని ఎదురు చూసే ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్‌కు దిమ్మతిరిగే బదులిచ్చాడు. ఈ ఇద్దరి మధ్య ట్విటర్ వేదికగా ఓ యుద్దమే జరుగుతుందన్న విషయం తెలిసిందే. ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తున్న రష్యా-ఉక్రెయిన్ ల మధ్య యుద్ధమైనా ఆగుతుందేమో గానీ వీరి ట్విటర్ పోరు మాత్రం ఆగేలా లేదు. ఆధిపత్యం చేతులు మారినప్పుడల్లా ఈ ఇద్దరూ తమదైన శైలిలో ట్వీట్లతో పంచులు విసురుకుంటూ ఇరు దేశాల క్రికెట్ అభిమానులకు కావాల్సినంత మజాను అందిస్తుంటారు. ముఖ్యంగా జాఫర్ సంధించే పంచ్‌లకు వాన్ ముఖం వాడిపోతుంది.
నర్వస్‌గా ఫీలవుతున్నావా?
తాజాగా ఇదే సీన్ రిపీట్ అయింది. ఇటీవల ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన రీషెడ్యూల్ టెస్ట్‌లో టీమిండియాపై ఇంగ్లండ్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో మూడు రోజుల పాటు ఆధిపత్యం చెలాయించిన భారత్ అనూహ్యంగా ఓటమిపాలైంది.దాంతో మైకేల్ వాన్ రెచ్చిపోయాడు. జాఫర్ ను లక్ష్యంగా చేసుకుని.. 'ఏం జాఫర్ ఏమైనా నర్వస్‌గా ఫీలవుతున్నావా?' అని ట్వీట్ చేశాడు. అయితే ఈ ట్వీట్‌కు జాఫర్ వెంటనే ఓ ఎమోజీ తో 'అబ్బే.. లేదే..' అని బదులిచ్చాడు. అప్పుడు వాన్ ది పై చేయి అయింది.
అంత నిమ్మలమేనా?
ఇక అవకాశం ఎదురు చూసిన వసీం జాఫర్‌కు ఆ సమయం రానే వచ్చింది. రోహిత్ శర్మ రాకతో టీమిండియా విజయాల బాట పట్టింది. మూడు టీ20ల సిరీస్‌లో చివరి మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. శనివారం జరిగిన రెండో మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన రోహిత్ సేన 49 పరుగులతో గెలుపొందింది. దాంతో జాఫర్ రెచ్చిపోయాడు. ఓ చిన్న పిల్లాడు విజిల్ వేస్తున్న ఏమోజీని షేర్ చేస్తూ..'వాన్.. అంతా ఓకేనా..? నువ్వు నిమ్మలంగానే ఉన్నావా..?' అని ప్రశ్నించాడు.

ఫ్యాన్స్ ఫిదా..
ఈ ట్వీట్ ఇప్పుడు నెటిజన్లను ఆకట్టుకుంటున్నది. టీమిండియా ఫ్యాన్స్ జాఫర్ ట్వీట్‌కు ఫిదా అవుతున్నారు.'సూపర్ జాఫర్ బాయ్.. వాన్ కు దిమ్మతిరిగిపోయుంటది..', 'దెబ్బ అదుర్స్ కదూ..'అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక జాఫర్ సెటైర్‌కు వాన్ ఇంకా స్పందించలేదు. వరుస ఓటములతో అతని ముఖం చిన్నబోయింది. ఇదే పరిస్థితుల్లో టీమిండియా ఉంటే వాన్ హడావుడి మాములగా ఉండేది కాదని అభిమానులు నవ్వుకుంటున్నారు. మరి జాఫర్ పెట్టిన ఈ ట్వీట్‌కు వాన్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

మెరిసిన జడేజా..
ఈ మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన టీమిండియా 49 పరుగులతో గెలుపొందింది. ఈ విజయంతో రోహిత్ సేన మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. మొదట భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 170 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా (29 బంతుల్లో 46 నాటౌట్; 5 ఫోర్లు), రోహిత్ శర్మ (20 బంతుల్లో 31; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు.
ఇంగ్లండ్ బౌలర్లు జోర్డాన్ (4/27), గ్లీసన్ (3/15) అదరగొట్టారు. తర్వాత ఇంగ్లండ్ 17 ఓవర్లలో 121 పరుగులకే కుప్పకూలింది. మొయిన్ అలీ (21 బంతుల్లో 35; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), డేవిడ్ విల్లే (22 బంతుల్లో 33 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) పరువు నిలిపే పరుగులు చేశారు. భువనేశ్వర్ (3/15), బుమ్రా (2/10), యజువేంద్ర చహల్ (2/10)ల నమ్మశక్యంకాని బౌలింగ్‌తో ఇంగ్లండ్ పతనాన్ని శాసించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications