Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సచిన్.. నువ్వు 16 ఏళ్ల వయసులోనే బౌలర్లను వణికించావ్.. నీకు కరోనా ఓ లెక్క.. సిక్స్ కొట్టగలవ్!

Wasim Akram says To Sachin Tendulkar ‘You Will Hit Covid-19 For A Six’

ఇస్లామాబాద్‌: కరోనా బారిన పడిన టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ త్వరలోనే కోలుకుంటాడని పాకిస్థాన్ మాజీ పేసర్ వసీం అక్రమ్ ఆకాంక్షించాడు. ట్విటర్ వేదికగా తనదైన శైలిలో సచిన్‌కు ధైర్యం చెప్పాడు. 16 ఏళ్ల వయసులోనే సచిన్ వరల్డ్ క్లాస్ బౌలర్లను వణికించాడని, అతనికి కరోనా ఓ లెక్క కాదని, మహమ్మారిని సిక్స్ కొడతాడని తెలిపాడు. 2011 ప్రపంచకప్ విజయాన్ని డాక్టర్లు, ఆసుపత్రి సిబ్బంతితో జరుపుకుంటే బాగుంటుందని, అలా చేస్తే తనకో ఫొటో పంపించాలని వసీం అక్రమ్ విజ్ఞప్తి చేశాడు. క‌రోనా సోకిన ఆరు రోజుల త‌ర్వాత తాను వైద్య సిబ్బంది స‌ల‌హా మేర‌కు ఆసుప‌త్రిలో చేరిన‌ట్లు స‌చిన్ చేసిన ట్వీట్‌కు అక్ర‌మ్ బ‌దులిచ్చాడు.

సిక్స్ కొట్టేస్తావ్..

సిక్స్ కొట్టేస్తావ్..

'సచిన్.. 16 ఏళ్ల వయసులోనే నువ్వు ప్ర‌పంచ అత్యుత్తమ బౌల‌ర్ల‌తో పోరాటం చేసిన యోధుడివి. నువ్వు క‌చ్చితంగా కొవిడ్‌-19ను సిక్స్ కొట్ట‌గ‌ల‌వు. త్వ‌ర‌గా కోలుకో మాస్ట‌ర్‌. భారత్ 2011 వ‌రల్డ్‌క‌ప్ విజ‌యాన్ని నువ్వు డాక్ట‌ర్లు, ఆసుపత్రి సిబ్బందితో జ‌రుపుకుంటావని ఆశిస్తున్నా. అలా చేస్తే నాకు కూడా ఓ ఫొటో పంపించు'అని వసీం అక్ర‌మ్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది. 1990ల్లో వ‌సీం అక్ర‌మ్‌, స‌చిన్ టెండూల్క‌ర్ మ‌ధ్య క్రికెట్ ఫీల్డ్‌లో మంచి పోటీ ఉండేది. భారత్, పాకిస్థాన్ మ్యాచ్ జ‌రిగిన‌ప్పుడ‌ల్లా స‌చిన్‌, వ‌సీం ఇద్దరిలో ఎవ‌రిది పైచేయి అవుతుందో అన్న ఆస‌క్తి ఇరు దేశాల అభిమానుల్లో క‌నిపించేది. చాలాసార్లు ఈ లెఫ్టామ్ పేస్‌బౌల‌ర్‌పై స‌చిన్‌దే పైచేయిగా నిలిచింది.

ఆసుపత్రికి వెళ్తున్నా..

ఆసుపత్రికి వెళ్తున్నా..

అంతకు ముందు తాను వైద్యుల సూచన మేరకు ఆసుపత్రిలో చేరుతున్నానని సచిన్ ట్వీట్ చేశాడు. 'నేను త్వరగా కోలుకోవాలని అభిమానులు చేస్తున్న ప్రార్థనలకు, వారు చూపిస్తున్న ప్రేమా ఆప్యాయతలకు ధన్యవాదాలు. వైద్యుల సలహా మేరకు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఆస్పత్రిలో చేరాను. కొద్ది రోజుల్లో సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి తిరిగి వస్తా. కరోనా వైరస్ మళ్లీ పంజా విసురుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకుంటూ సురక్షితంగా ఉండాలని కోరుతున్నా' అని మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ ట్వీట్ చేశారు. ఇక 2011లో భారత్ రెండోసారి వన్డే ప్రపంచకప్‌ గెలిచి నేటికి పదేళ్లు పూర్తి అయిన నేపథ్యంలో సచిన్‌.. దేశ ప్రజలకు, తన సహచరులకు శుభాకాంక్షలు చెప్పారు.

రోడ్ సేఫ్ట్ సిరీస్‌లో..

రోడ్ సేఫ్ట్ సిరీస్‌లో..

మార్చి 27న తాను కరోనా బారిన పడినట్లు సచిన్‌ టెండూల్కర్ స్వయంగా ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే. తేలిక పాటి లక్షణాలు కనిపించడంతో కరోనా టెస్టు చేయించుకున్నానని.. దాంతో పాజిటివ్‌గా తేలిందని చెప్పారు. తన కుటుంబ సభ్యులకు నెగెటివ్‌ వచ్చిందన్నారు. ఈ క్రమంలోనే వైద్యుల సూచన మేరకు తొలుత హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్న సచిన్.. ఇప్పుడు ఆస్పత్రిలో చేరారు. రాయ్‌పూర్‌లో జరిగిన రోడ్‌ సేఫ్టీ సిరీస్‌లో ఇండియా లెజెండ్స్‌ను కెప్టెన్‌గా సచిన్ వ్యవహరించారు. అదే టోర్నీలో ఆడిన యూసఫ్‌ పఠాన్‌, ఇర్ఫాన్‌ పఠాన్, ఎస్ బద్రీనాథ్‌ సైతం వైరస్‌ బారిన పడ్డారు. వారందరూ ఇప్పుడు హోమ్‌ క్వారంటైన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నారు.

Story first published: Friday, April 2, 2021, 16:56 [IST]
Other articles published on Apr 2, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+